కొద్దీ రోజుల క్రితం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మధ్య బండి సంజయ్ గారి మధ్య జరిగిన సంఘటనలు చూసాక కొంత భాదకలుగుతుంది...
ఇద్దరూ కూడా బడుగు బలహీన వర్గాలకు చెందిన కుటుంబాల నుంచి వచ్చిన వారే, ఇద్దరూ కూడా ఆ వర్గాల ఉన్నతి కోసం, ప్రగతి కోసం నిరంతరం వారి స్థాయిలో పోరాడుతూ ఉన్నవారే..
దయచేసి ఒక విషయం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది, ఒక కులం కానీ ఒక మతం కానీ ఎవరి సొంతం కాదు..భారత దేశం అన్ని కులాల అన్ని మతాల మాతృ వేదిక...
అంతే కానీ ఒక కులాన్ని, ఒక మతాన్ని ఎవరు తక్కువ చేసి మాట్లాడినా అది భారత రాజ్యాంగం ప్రకారం చట్ట విరుద్ధ చర్యనే అవుతుంది..దానికి ఎవరూ అతీతులు కాదు..భవిష్యత్తులో కాకూడదు కూడా..
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు,వారి ఆలోచనలతో లక్షలాది మంది విద్యార్థులను ఉన్నత స్థాయికి చేరవేస్తూ మరి కొంతమందిని చేరవేయడానికి వారి శక్తిని, వారి ఆలోచనలు ఉపయోగించి బడుగు బలహీన వర్గాల విద్యార్థుల, యువత కోసం సేవ చేస్తున్నారు అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు కానీ కొన్నిసార్లు ఆలోచనలతో అడుగులు వేయవలసిన అవసరం ఎంతగానో ఉందని మనవి !
బండి సంజయ్ గారు కూడా బడుగు బలహీనవర్గాల కుటుంబాల నుంచి వచ్చిన నాయకుడు, ఒక పార్టీ రాష్ట్ర అధినాయకుడు, అలాగే ఆ వర్గాల ఉన్నతి కోసం వారి స్థాయిలో పోరాడుతున్నారు..అలాంటి వారు కొన్ని ప్రత్యేక సమయాలలో ఆలోచనతో అడుగులు వేసి అందరి వారిగా ముందుకు నడవాలని మనవి..!
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కానీ, బండి సంజయ్ గారు కానీ ఇద్దరిలో ఏ ఒక్కరు మన ఆలోచనలతో, మన మాటలతో, మన నిర్ణయాలతో బలహీనపడితే భవిష్యత్తులో మన వర్గాలకే నష్టం..దయచేసి అది గ్రహించాలని మనవి !
ఇట్లు
మీ బంధువు
టి సురేందర్
Note : ఇది నా వ్యక్తిగత అభిప్రాయం 😊🙏
