తెలంగాణ శాసనమండలి సభ్యులుగా ఎంపికైన తర్వాత డాక్టర్ శ్రవణ్ దాసోజు అన్న గారిని వెళ్లి కలవడం జరిగింది !
శ్రవణ్ అన్న రాజకీయ ప్రస్థానంలో, వారికి తోడుగా, వారి వెంటనడిచిన నడిచిన ప్రయాణంలో కొన్ని గుర్తులు..
తెలంగాణ ఉద్యమ అధినాయకులు, గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రసంగాలతో ప్రేరణ పొంది, తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి ఉద్యమకారుడిగా అడుగులు వేసి నా వంతు పాత్ర పోషించాను..
ఆ తదననంతరం, ఒక తెలంగాణ బిడ్డగా, నేటి రాజకీయాల్లో నా తరఫునుండి ఈ సమాజంలో ఏదో ఒక మార్పు చేయాలని ఒక దృఢ సంకల్పంతో...శ్రవణ్ అన్న గారితో కలిసి 2014లో ప్రయాణం మొదలుపెట్టడం ప్రారంభించాను..వారు చేసే ప్రతి పనిలో మమ్ములను భాగం చేస్తూ, మాకు దిశా నిర్దేశం ఇచ్చేవారు, కేవలం రాజకీయ అంశాలే కాకుండా..నిజ జీవితంలో జరిగే కష్టనష్టాలను కూడా ఎలా తట్టుకోవాలో వాటిని ఎలా ఎదుర్కోవాలో నిర్దేశించేవాడు..
శ్రవణ్ అన్న గారు నేటి సమాజ మార్పు కోసం,పేద ప్రజల బాగు కోసం, బడుగు బలహీన వర్గాల ఉన్నతి ప్రగతి కోసం, వారు పడిన తపన, పోరాట స్ఫూర్తి, వ్యక్తిగత జీవితాన్ని వదులుకొని ఎన్నో రాత్రి పగలు పరితపించిన క్షణాలకు నేను ఒక సాక్షిని .
వారితో ప్రయాణించే సమయంలో నేను ఎక్కువగా వారి వద్ద నుంచి గమనించిన కొన్ని విషయాలు..
ఒక ఉన్నతంగా చదువుకున్న వ్యక్తిగా ఈ సమాజ మార్పు కోసం ,పేద ప్రజల జీవితాల బాగు కోసం..ఏదో ఒక గొప్ప మార్పు చేసి వారి జీవితాలను మార్చాలని తపన వారిలో ఎప్పుడూ కనపడేది.
వారు ఏదైనా ఒక కార్యక్రమాన్ని మొదలు పెడితే ఆ కార్యక్రమము అయిపోయేంత వరకి ఆ పనిలో నిమగ్నం అయ్యేవారు..ఆ సమయంలో వారు రాత్రి పగళ్లు కూడా మరిచిపోయి పనిచేసే వారు మమ్ములను అదేవిధంగా ప్రేరేపించేవారు.
ఎప్పుడైనా ఈ సమాజాన్ని ఉద్దేశించి ఏదైనా చెప్పాలనుకున్న సమయంలో, ఆ సమస్య గురించి క్షుణ్ణంగా పరిశోధించి, పరిశీలించి..ఆ సమస్య పరిష్కారంలో ఎక్స్పర్ట్ అయిన వ్యక్తులను సంప్రదించి వారితో చర్చించిన ఆ తర్వాతే వారి వ్యక్తిగత అభిప్రాయాన్ని మీడియా సాధనాలతో ప్రజలకు వ్యక్తపరిచేవాడు..
వారు రాజకీయాలలో ఏ కార్యక్రమం చేసిన ఈ కార్యక్రమం చేయాలనుకున్నా రాజకీయ పరిశుభ్రత పాటించాలి అనుకునేవాడు..
వారి జీవితంలో దైవ నిర్ణయంతో కొన్ని అనుకోని సంఘటనలు జరిగినా, చివరికి ఉద్యమ అధినాయకులు పెద్దలు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఎమ్మెల్సీగా శాసనమండలిలో అడుగుపెడుతున్నారు..
శ్రవణ్ అన్న గారి జీవిత ప్రయాణంలో వారు పడిన ఆటుపోటులు, నేటి యువతరానికి ఎంతో అవసరం, మరీ ముఖ్యంగా ఉన్నత చదువులు చదువుకొని రాజకీయాల్లోకి వచ్చి ఈ సమాజాన్ని మార్చాలని అనుకునే యువతరానికి ఎంతో గాను అవసరం..
చివరగా ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదంతో, పెద్దలు కేసీఆర్ గారి అండదండలతో..మీరు ఒక శాసనమండలి ప్రతినిధిగా ఒక ఎమ్మెల్సీగా..డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పూలే గారి ఆశయాలతో..బడుగు బలహీన వర్గాల ఉన్నతి కోసం ప్రగతి కోసం పోరాడాలని..నేటి రాజకీయాల్లో రావాలనుకునే యువతరానికి..మీరు పడిన ఆటుపోటులను వివరిస్తూ,నేటి సమాజ మార్పు కోసం ఉన్నతమైన యువకులను తయారు చేసే శక్తి మీకు ఆ భగవంతుడు ఇవ్వాలని ప్రార్థిస్తూ మీరు ఎల్లవేళలా శక్తివంతులుగా ఉండాలని కోరుకునే మీ తమ్ముడు సురేందర్..🙏💐


