Friday, March 7, 2014

ఉద్యమకరులయిన విద్యార్థుల బావితవ్యం ప్రశ్నేనా ?..

అదే విధంగా ఇదొక చిన్న సందేశం ...
తెలంగాణ ఉద్యమం కోసం మా యూనివర్సిటీ నుండి మా శక్తి ఎంత వుందో అంతమేరకు శక్తిమేరకు కృషి చేసాం. అలానే అని యూనివర్సిటీ విద్యార్థులు కూడా అలానే చేసారు .అదే విదంగా తెలంగాణ ఉద్యోగ సంఘాలు ,ప్రజలు పోరాడారు .
నేను 2008 లో ఇంజనీరింగ్ చదవడనికి మా పల్లె నుండి హైదరాబాద్ కి వచ్చాను .అప్పటికే తెలంగాణ ఉద్యమం చాలా చాలా ఉద్రిక్తత పరిస్దితులలో నడుస్తుంది .అప్పటికే నాకు తెలంగాణ ఉద్యమం పోరాటం గురించి కొంచం కొంచం తెలుసు అది ఏదో పేపర్ లో లేదా టీవీ లో చూసి మాత్రమే,... .అలా హైదరాబాద్ కి వచ్చిన కొని రోజుల తరువాత నేను మొదటి సారి గా ఉద్యమాలగడ్డ ఉస్మానియా యూనివర్సిటీ కి పోయిన .అదే సమయంలో విద్యార్థులకు మరియు పోలీస్లకు మద్య ఒక యుదం జరుగుతుంది .అది చూసి. నాకు నా ప్రాంతంకు- నా తెలంగాణ ప్రాంత ప్రజలకు ఏదో చేయాలి అని .తెలంగాణ ఉద్యమంలో కి నేను కూడా మొదటి అడుగు పెట్టాను . యిట్లా నాలెక్క ఎంతోమంది విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలోకి వచ్చారు ,..
అలా కొన్ని రోజుల తరవాత మా యూనివర్సిటీ లో కూడా ఒక విద్యార్ధి విబాగం ను ఏర్పాటు చేసాం .ఇంకా ఆ సమయం నుండి మాకు ఎన్నో సమస్యలు .అది అందరికి తెలిసిందే .అని యూనివర్సిటీ లో అందరి విద్యార్థుల పరిస్దితి ఒకటే .
అట్టు యిటు కానీ పరిస్థితి తెలంగాణ విద్యార్థుల మరియు విద్యార్ధి నాయకుల పరిస్దితి .
తెలంగాణ ఉద్యమం పోరాటం లో నాటి నుండి నేటి వరకు అదే పరిస్దితి .తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటం కోసం నిరంతరము పోరాటం చేసి .ఎప్పుడు ఏం చేయనో అర్ధం కానీ పరిస్దితి .ఉద్యమాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ నుండి మొదలు కొని ,కాకతీయ విశ్వవిద్యాలయము,జవహర్లాల్ నెహ్రు టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ ,మహాత్మా గాంధీ యూనివర్సిటీ ,పాలమూరు యూనివర్సిటీ ఇలా అన్ని తెలంగాణా యూనివర్సిటీ లలో ఎప్పుడు ఒకే పరిస్దితి .
తెలంగాణా రాష్ట ఏర్పాటు జరిగింది .కానీ ఏ ఒక్క రాజకీయ పార్టీ నాయకుడు కూడా విద్యార్థుల గురించి మరియు విద్యార్ధి నాయకుల జీవితాల గురించి కానీ మాట్లాడడం లేదు. ఏదో చేదాం నా ప్రాంతానికి నా దేశనికి అనీ. అరా చేతులో ఒక సంచితో హైదరాబాద్ కి వచ్చి .తెలంగాణ ఉద్యమం కోసం మరియు తెలంగాణ ప్రజల విముక్తి కోసం. తొమ్మిది నెలలు నవమాసాలు మోసిన అమ్మ అనుబంధంను వదిలివేసి .తెలంగాణ రాష్టం ఏర్పాటు కోసం ప్రాణ త్యాగలు & ఆత్మ బలిదానం చేసారు ఎందరో విద్యార్థులు .
ఇక మరి కొంత మంది విద్యార్థులు నా ఆకలినే నా ప్రాంత ప్రజల ఆకలిని. పోరాటమే లక్ష్యంగా . పోలీస్ లాటిలకు మరియు తూటాలకు బయపడకుండా అడు గోడలాగా ముందుకు పోయారు .ఇలా ఒక్క ఒక్క విద్యార్ధి నాయకుల మీద వందల కేసులు పెట్టిండ్రు .కానీ వీరికి న్యాయం చేసేది ఎవరు చెప్పండి .
వీరి విలువయిన సమయాన్ని వెచ్చించి ,తల్లిదండ్రుల ప్రేమ ,అనురాగాలను ,వారి విద్యను ఉద్యోగాలను త్యాగం చేశారు ,..అట్లాన్టివారికి తెలంగాణలోఉద్యోగాలు లబిస్తయా ,..లేక ఉద్యోగాలకోసం మరో ఉద్యమానికి సిద్ధం అయ్యేపరిస్థితి వస్తుందా ?..కాలమే సమాధానం చెపుతుంది .

                              తాళ్ళపల్లి సురేందర్ గౌడ్ ,
జవహర్లాల్ నెహ్రు టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ స్టేట్ మీడియా స్పోక్స్ పర్సన్
తెలంగాణ
                          9030643192

No comments:

Post a Comment