Friday, October 13, 2017

కరేబియన్ రాజు, పులుల కథ - మన తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ గారి పాలనా విధానం




కొన్ని సంవత్సరాల క్రితం దక్షిణాఫ్రికా ఖండంలో ఉన్నటువంటి కరేబియన్ దీవులలో ఒక పెద్ద అడవిలో ఒక రాజు ఉండేవాడట.. ఆరాజుకు చిరుతపులులను ,పెద్ద పులులను పెంచుకొనే అలవాటు ఉండేదట.. అలా పెంచుకున్న పులులకు రోజు కూడా వివిధ రకాల ఆహర పదార్థాలు పెట్టేవాడట, అలాకొన్ని రోజులు తన  జీవిత ప్రయాణ సాగుతుపోయింది.. ఒకానొక రోజు ఆ అడవిలో రాజుకు ఒక ఆలోచన వచ్చింది, అదేంటంటే తనకు ఉన్నటువంటి అలవాటు ..ఆ రాజుకు రోజు కూడా కొకైన్( మత్తు మందు)  తీసుకొనే అలవాటు ఉండేది..

అదే క్రమంలో తను పెంచుకోటున్న చిరుతపులులకు, పెద్దపులులకు ఒకానొక రోజు, రోజువారీగా పెట్టె ఆహార పదార్థాలకు బదులుగా ఒక రోజు తను తీసుకొనే కొకైన్( మత్తు మందు ) తో కపిలినా ఆహార పదార్థాలు, మరియు మరొక్క పక్కన రోజువారీ ఆహార పదార్థాలు పెట్టినడట.. ఆరోజు ఆ పులులు రోజువారీ ఆహారమును మొత్తం కూడా తినేసి ,పక్కనే మిగిలి ఉన్నకొకైన్ తో కలిపిన ఆహార పదార్థాలను కొంచం తిని వదిలిపెట్టినవట..


అలానే మరుసటిరోజు కూడా ఒక పక్కన రోజువారీ ఆహారం, మరో పక్కన కొకైన్ తో కలిపిన ఆహార పదార్థాలను పెట్టాడట ఆ రాజు గారు.. ఆరోజు ఆ పులులు రోజువారీ ఆహారం తినకుండా ,కొకైన్ తో కలిపిన ఆహార పదార్థాలను మాత్రమే తినేసి.. రోజువారీ ఆహార పదార్థాలను వదిలేసినవట...


ఇలా మూడో రోజు కూడా ఒక పక్కన రోజువారీ ఆహారం , మరోపక్కన కొకైన్ తో కలిపిన ఆహారం పెట్టాడట, ఆ రోజు కూడా రోజువారీ ఆహారం తినకుండా ,కొకైన్ తో కలిపిన ఆహారమును మాత్రమే తిన్నాయట ఆ పులులు...


ఇలానే రోజు కూడా  కొనసాగుతుందట..కొన్ని రోజుల తర్వాత ఆ రాజు గారు .. ఒక రోజు కొకైన్ తో కలిపిన ఆహారం పెట్టడం ఆపేశాడట..ఆరోజు ఆ పులులు ఆహారం తినకుండా అలానే ఉన్నాయట..రెండో రోజు కూడా కొకైన్ తో కలిపిన ఆహారం పెట్టలేదట.. ఆరోజు ఆ పులులు ఆకలితో ఉన్న కోపంలో మరియు కొకైన్ తో కలిగిన ఆహారం, ఆ రాజు గారు పెట్టలేదని కోపంతో ఆ రాజుగారి మీదనే దాడి చేశాయట.. ఆ దాడిలో ఆ రాజు గారు పూర్తిగా గాయపడినారట .. ఆ దాడి నుండి రాజు గారు  తప్పించుకొని భయంతో ఆ అడవి ప్రాంతాన్ని వదిలేసి పారిపోయారట....అక్కడే ఆ అడవిలో ఉన్న పులులు మాత్రం రోజు అలవాటు అయినా కొకైన్ తో కలిపిన ఆహారం దొరుకకా..కొన్ని రోజుల తర్వాత అన్ని పులులు కూడా చనిపోయాయట....

క్కడ మనం తెలుసుకోవాలిసిన నీతి సారాంశం :-

 పైన జరిగిన సంఘటను ప్రస్తుతం మన తెలంగాణ ప్రభుత్వం ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు చేస్తున్న ప్రయత్నాలు కూడా పైన మనం తెలుసుకొన్న విధంగానే ఉన్నాయి.

సీఎం కేసీఆర్ గారు ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు కోట్లాది రూపాయలు, చీరలు , వివిధ పథకాలు హామీలు ఇస్తున్నాడు..అది ఎలాగో నేను ఇక్కడ మీకు తెలుపుతాను...పైన జరిగిన సంఘటను మన ప్రభుత్వ విధి విధానాలతో పోల్చి మీకు వివరిస్తాను..


 ఇక్కడ ఆ కరేబియన్ రాజు అంటే = మన సీఎం కేసీఆర్ గారు

ఇక్కడ ఆ అడవిలో పులులు అంటే = తెలంగాణ ప్రజలు


రోజువారీ ఆహారం అంటే = మంచి ప్రభుత్వం పథకాలు

కొకైన్ (మత్తు మందు) తో కలిపిన ఆహారం అంటే = ప్రజల దృష్టిని ఆకర్షించే పథకాలు , వస్తువులు , నిధులు ( చీరలు దుబారా ఖర్చులు..ect )



ఆ కరేబియన్ రాజు ఎలాగాయితే ఆ పులులకు రోజువారీ ఆహార పదార్థాలు పెట్టకుండా, కొకైన్ తో కలిపిన మత్తు ఆహార పదార్థాలు పెట్టడం మొదలు పెట్టాడో.. అలానే తెలంగాణ రాష్ట్రములో సీఎం కేసీఆర్ గారు , ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు చీరలు, దుబారా ఖర్చులు, కొన్ని పథకాలు ప్రజలకు అలవాటు చేస్తున్నాడు.....


అదేవిధంగాను ఆ కరేబియన్ రాజు , ఆ పులులకు మత్తు  కూడిన కొకైన్ ఆహార పదార్థాలు ఇవ్వడం వల్ల చివరకు ఆ పులులు రోజువారీ ఆహారం తినడం మానేసి , కేవలము మత్తుతో కూడిన ఆహార పదార్థాలు మాత్రమే తినడం అలవాటు చేసుకొన్నవి.. చివరకు ఆ ఆహార పదార్థాలు ఇవ్వకపోవడం వల్లనే కరేబియన్ రాజు పైనే దాడి చేశాయి ఆ పులులు , అదేవిధంగా చివరకు ఆ పులులు కూడా ఆకలితో మరణించిన్నవి ..ఇక్కడ అలానే ఉన్నది పరిస్థితి తెలంగాణ రాష్ట్రలో సీఎం కేసీఆర్ గారు , ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు వివిధ పథకాలు, దుబారా ఖర్చులు, చీరలు మరియు ఇలాంటివి ప్రజలకు అలవాటు చేయడం ద్వారా ఎదో రోజు ప్రజలు కూడా ప్రభుత్వం పై తిరగబడుతారు.. పైనా జరిగిన విధంగానే ఇక్కడ కూడా చివరకు ప్రజలు నష్టపోతారు... ప్రభుత్వం కూడా నష్టపోతోంది...

చివరగాను ఈ కథను కొన్ని కలిపిత కధలతో  రాయడం జరిగింది.. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు  నష్టం జరగకుండా ఉండాలని మంచి ఉదేశ్యంతో రాయడం జరిగింది...దయచేసి ఇది మీరు గ్రహించగలరని కోరుకొంటున్నాను...



ఇట్లు
సురేందర్ తాళ్లపెళ్లి


Tuesday, October 10, 2017

ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణాలు :

తెలంగాణ రాష్ట్రములో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇటీవల కాలంలో ఏ ఎన్నికలలో చూసిన ఓడిపోవడానికి ముఖ్య కారణాలు ఏంటో తెలుసుకొందాం.అదే విధంగాను కాంగ్రెస్ పార్టీ మీద ప్రస్తుతం ఉన్న భాద్యతలు ఏంటి,  పార్టీ ఎలా పని చేయాలి అనేది తెలుసుకొని చర్చలోకి పోదాం.

అటు కేంద్రంలో,ఇటు రాష్ట్రములో రెండు చోట్ల కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ ఉంది.ఇలాంటి సమయంలో ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న బాధ్యతలు. అధికారంలో ఉన్న ప్రభుత్వాల పని తీరును తెలుసుకొని, అదేవిధంగాను ప్రజల అభిప్రాయలను గ్రామ పంచాయతీ  స్థాయి నుండి నగర, పట్టణ ప్రాంతాల్లో ఉండే ప్రజల వరకు ప్రజా అభిప్రాయం సేకరణ చేసి. అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ పై పోరాటాలు చేయవలసి ఉంటుంది.

 మరికొన్ని బాధ్యతలు :-

 1. అధికారంలో ఉన్న పార్టీలు ప్రజలకు ఇచ్చే హామీల మీద పథకాల మీద పూర్తి స్థాయిలో ముందుగా అవగాహన చేసుకోవాలి.

2.అలా తెలుసుకొన్న పథకాల అమలు గురించి , వాటికి అనుసంధానంగా ఉన్న  శాఖలలో ఉన్న మేధావులతో,ఉన్నతాధికారులతో చర్చలు చేసి. అందులో ఉన్న తప్పులు, ఒప్పులు తెలుసుకొని సమయం వచ్చినప్పుడు వాటి మీద పోరాటం చేయాలి.

3.అన్నిటికంటే కూడా ముఖ్యమైన విషయం ప్రజా అభిప్రాయం సేకరణ,ప్రభుత్వం పథకాల అమలు ఎలా జరుగుతుంది.అవి ప్రజలకు ఎంత వరకు అందుతున్నాయి. అనే విషయం పై అంచనా చేయడం కూడా తెలుసుకోవాలి.. దీనిని దృష్టిలో పెట్టుకుని అధికార పార్టీల పై పోరాటాలు చేయవలసి ఉంటుంది.

4.అధికార పార్టీ ప్రభుత్వం పై ఆ పార్టీ నాయకుల పై అవినీతి ఆరోపణలు తెలుసుకొని వారి పై పూర్తి స్థాయి సమాచారంతో పోరాటాలు చేయవలసి ఉంటుంది.

5.ప్రభుత్వం ఉన్నతాధికారుల పనులను కూడా అప్పుడు అప్పుడూ తెలుసుకొని వారి పనుల మీద కూడా ఒక కోణంలో అంచనా వేస్తూ ఉండాలి.

6.ప్రభుత్వం నూతన పథకాలలో జరుగుతున్న అవినీతి ఆరోపణల మీద, ఆ పథకాలకు కేటాయించిన నిధుల వివరాలు , కేటాయించిన నిధుల  మంజూరు వివరాలు తెలుసువాలి. ఇలా కొన్ని విషయాల మీద, ప్రతిపక్ష పార్టీలకు ఉండవాల్సిన కనీస బాధ్యతలు.

ప్రతిపక్షాల ఓటమికి ప్రధాన కారణం ఏంటి ?

మన తెలంగాణ రాష్ట్ర విషయానికి వస్తే , ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ప్రజలలో విశ్వసనీయత కోల్పోవడానికి ప్రధాన కారణం గతంలో చేసినా తప్పుడు నిర్ణయాలు, తప్పుడు ఆలోచనలు... అదే విధంగాను 10 సంవత్సరాలు అధికారంలో ఉండడం మరో ప్రధాన కారణం.. ఇక్కడ వరకు ఒక కారణం అయితే.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత నుండి తెలంగాణ రాష్ట్రములో ప్రధాన ప్రతిపక్షంగాను ఉన్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. అసలు తెలంగాణ రాష్ట్రములో ,తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసినా కాంగ్రెస్ పార్టీ పై  ప్రజలకు ఇంతా వ్యతిరేకత ఎందుకు ? అంతగా కాంగ్రెస్ పార్టీ ఏం తప్పులు చేసింది అనేది మనం తెలుసువాలి.

౦ .తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో  కీలకగాను ముందుడి ,తన మాటలతో ప్రజలకు దగ్గరయినా వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు , అలా 2014 ఎన్నికలలో తెలంగాణ వాదం పేరుతో , ప్రభుత్వాని ఏర్పాటు చేసినా విషయం మన అందరికి తెలిసిన విషయమే...ఇలా ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో ఎనో ఆకర్షణీయమైన పథకాలను ప్రవేశపెట్టి, ప్రజలకు మరింత దగ్గరయినా వ్యక్తి నేటి సీఎం కేసీఆర్ గారు.
ఇలా ప్రభుత్వం కొనసాగుతున్న క్రమంలో ఈ ముడున్నారేళ్ల సమయంలో ప్రభుత్వం మీద ప్రజలలో ఎంతో వ్యతిరేకత , ఉన్న కూడా ఈ మధ్య సమయంలో వచ్చిన ప్రతి ఎన్నికలలో కూడా కేసీఆర్ గారి ప్రభుత్వానికే ప్రజలు మద్దతు ఇస్తున్నారు..ఇలా ఎందుకు ఇస్తున్నారు అనేది మనం ఆలోచన , ప్రజా సేకరణ చేస్తే తెలిసినా కొన్ని విషయాలు మీకోసం ఇక్కడ రాస్తున్నాను...

 1.మొదటగా ప్రధాన ప్రతిపక్షంగాను ఉన్న కాంగ్రెస్ పార్టీ విషయంలో ప్రజలకు ఉన్న అభిప్రాయం : కేసీఆర్ గారి ప్రభుత్వం & కేసీఆర్ గారి  మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. కానీ కేసీఆర్ లాంటి మరో నాయకుడు , అలా మాట్లాడే  , అలా మాటలు చెప్పే , ముఖ్యగాను ప్రజలకు భరోసా కలిపించే నాయకుడు ప్రజలకు, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలో కనిపించడం లేదట..ఇక్కడ ఆశ్చర్యం  కలిగించే విషయం ఏటంటే తెలంగాణ రాష్ట్రములో కొన్ని గ్రామాల్లో, నగరాల్లో ఉన్న ప్రజలు చెప్పిన మాటలు ఇవి: ప్రతి 10 మందిలో 6 మంది చెప్పే మాట ఇదే... ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ లాంటి నాయకుడు మాకు కన్పిచడం లేదు.. మాకు బలమైన భరోసా ఇచ్చే వ్యక్తి అక్కడ ఇవ్వరు లేరు.. అందరూ సిఎంలుగా వారికి వారే ఆలోచన చేసుకొంటారు..అనే మాటలు ప్రజల నుండి వస్తున్నాయి... ఇది కాంగ్రెస్ పార్టీ ఓటమికి ఒక పెద్ద ప్రధాన కారణం... ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఒకటి గుర్తు పెట్టుకోవాలి, నోటి మాట చాలా విలువైనది, చాలా బలమైనది కూడా ఒక నోటి నుండి ఒక మాట వస్తే అది ఒక్కరి నుండి కోట్ల మందికి చేరుతుంది. అలా చేరిన మాటలు అవే నిజమైన మాటలు అనీ నమ్మేవారు 70% ప్రజలు మన మధ్య ఉంటారు.. ఇప్పుడు మన దేశంలో ,రాష్ట్రములో జరుగుతుంది కూడా ఇదే...

 2. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో, నాయకుల మధ్య   విభేదాలు మరియు అందరూ కలిసికట్టుగా లేకపోవడం కూడా పెద్ద కారణంగానే మనం చెప్పుకోవచ్చును.

3.అధికార పార్టీ ప్రవేశపెట్టే పథకాలను సరియైన స్థాయిలో అంచనాలు వేయకపోవడం ,ఒకవేళ అంచనా వేసిన కూడా వాటి మీద గ్రామ పంచాయతీల  స్థాయి నుండి ప్రజల వద్ద నుండి అభిప్రాయలను తెలుసుకోకపోవడం , అలా ఆ సమస్యల మీద అధికార పార్టీ ప్రభుత్వం పై సరియైన స్థాయిలో పోరాటాలు చేయకపోవడం.ఒకవేళ చేసిన ఒకటీ, రెండు సమస్యల మీద గట్టిగాను పోరాటం చేసి.. మిగిన సమస్యలను గాలికి వదిలేయడం కూడా మనం ఒక కరణంగాను చెప్పుకోవచ్చు.

 4.రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకులు ఎప్పటికి ,అప్పుడు ప్రభుత్వం విధి , విధానాల పై పోరాటం చేసిన వారికి సొంత పార్టీ నాయకుల నుండే సరియైన  స్థాయిలో సపోర్ట్ లేకపోవడం కూడా ఒక ప్రధాన కారణం అయితే ..మరి కొంతమంది వింతగాను , అధికార పార్టీ  పై పోరాటాలు చేసే వారికి వ్యతిరేకంగా కార్యక్రమలు చేస్తున్నారట. ఇలా చేయడం కూడా పార్టీకి పెద్ద నష్టం అవుతుందని మనం చెప్పుకోవచ్చు.

 5.ఈ మధ్య కాలంలో కొన్ని సమస్యల మీద మరియు ప్రభుత్వ  వైఫల్యాల మీద పోరాటాలు చేస్తున్నప్పటికీ, కొంతమంది సొంత పార్టీ నాయకుల కలిసి రాకపోవడం ఒక కారణం.

6. పార్టీ నిర్మాణం కోసం నూతన పద్ధతులు ఆలోచనలు చేయకపోవడం.

 7. గ్రామ స్థాయి ఉన్నత సభలు పెద్దగా ఏర్పాటు  చేయకపోవడం.

8. విద్య, వైద్య, ఉద్యోగ, వ్యవసాయ, ఐటీ రంగాల మీద శాఖల వారిగా చేసుకొని ,పార్టీ నాయకులు ప్రభుత్వం పై పోరాటాలు చేయడం అనేది కూడా ఒక కారణం.

 9. ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలను, అవినీతి ఆరోపణలను బయటకు తెలియకపోవడం. తీసినా ఆ ఆరోపణలను పూర్తి స్థాయి ఆధారాలతో నిరూపించకపోవడం కూడా ఒక కారణం.
10. నూతన ఆలోచనలు కలిగిన యువ నాయకులకు సరియైన స్థాయిలో గుర్తిపు ఇవ్వకపోవడం, నేటి తరం యువతర మీద సరియైన స్థాయిలో దృష్టి పెట్టకపోవడం కూడా ఒక కారణం.


చివరగాను  తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే, ముందు పార్టీ నాయకులు అందరూ కూడా ఒక తాడు మీదకు రావాల్సిన అవసరం పార్టీ నాయకుల ఉంది.ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఈ సమస్యను  పరిష్కరించుకోకపోతే 2019 ఎన్నికలలో భారీ ఎత్తున పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంది.అదేకాకుండా కేసీఆర్ గారి పార్టీని పరోక్షంగా మరోసారి 2019 ఎన్నికలలో గెలుపుకు సపోర్ట్ చేసిన వారు కూడా అవుతారు.

ఇట్టు
సురేందర్.టి