ఓటు హక్కు అనేది భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిన హక్కు. భవిష్యత్తును మార్చుకునే అవకాశం ప్రజలు అనే మన చేతుల్లోనే ఉంచేది మన ఓటు. మంచి నాయకులను ఎన్నుకుని భవిష్యత్తు తరాలకు ప్రగతి బాటలు వేసుకోవచ్చు కానీ చాలా చోట్ల ఆ ఓటు హక్కు వినియోగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు కొందరైతే, మరికొందరు వారి ఓటు హక్కును అమ్ముకొని ప్రజాస్వామ్యాన్ని తప్పుడు వ్యక్తుల చేతులకు అప్పజెప్పి ప్రజాస్వామ్య వ్యవస్థను నాశనం చేస్తున్నారు.
మనం ప్రతిరోజు పొద్దున లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు మన కుటుంబానికి మనకు ఎలాంటి సమస్యలు రాకూడదని విజయాలు కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తాము కానీ ఆ భగవంతుడు మనకి వరాలు ఇస్తాడో లేదో తెలవదు కానీ మనం నమ్ముతాము, అలా నమ్మిన మనము ఎందుకు మన ఓటును మనం నమ్మడం లేదు?
మన ఓటు హక్కు ఆ ఇంద్రుడి వజ్రాయుధం కంటే అత్యంత శక్తివంతమైనది అని ఎందుకు తెలుసుకోలేకపోతున్నాము మనము. మన ఓటు హక్కు వజ్రాయుధం కంటే అత్యంత శక్తివంతమైనది, మన ఓటు హక్కుతో ఎంత పెద్ద నాయకుడిని అయినా, ఎంత పెద్ద ధనిక నాయకుడిని అయినా లేదా పేద నాయకుడిని అయినా రాజ్యాంగ పదవుల నుండి క్షణకాలంలో మన ఓటును వేసి వారి పదవులను మార్చవచ్చు, అలాగే వారి ప్రభుత్వాలను దించవచ్చు, ఎక్కించవచ్చు, అదే మన ఓటుకు ఉన్న శక్తి.
నీ ఓటు హక్కును 500 రూపాయల నోటుకో, కోటార్ సీసాకో, బిర్యానీ పోట్లానికో తాకట్టు పెట్టుకోవడం అంటే నీ కుటుంబాన్ని, నీ పిల్లల జీవితాన్నినీ ఊరు భవిష్యత్తుని తాకట్టు పెట్టడమే, అది ఎలాగా అంటే నీ ఓటును కొనుక్కునే నాయకుడు, ఎన్నికల తర్వాత పదవిలోకి వచ్చాక నీ ప్రభుత్వ ఆస్తిలో సొమ్మును, నీ కుటుంబానికి ప్రభుత్వ పథకాల ద్వారా అందవల్సిన వనరులను అందకుండా చేస్తారు, నీ ఊరి అభివృద్ధికి అందవల్సిన సొమ్మును పక్కకు మళ్ళి ఇస్తారు.. ఇదే కాదు, నీ పిల్లలకు అందవలసిన నాణ్యమైన ఉచిత విద్యని అందకుండా చేసి, మీ కుటుంబ జీవితాన్ని మొత్తం అంధకారంగా మారుస్తారు.. అలాగే నాణ్యమైన ప్రభుత్వ ఉచిత వైద్యం నీ కుటుంబానికి అందకుండా చేసి, మీ కుటుంబ భవిష్యత్తును మరో 10 సంవత్సరాలు వెనకకి నెట్టివేస్తారు..అందుకోసమే నీ ఓటును అమ్ముకోకు నీ కోసం, నీ కుటుంబ భవిష్యత్తు కోసం, నీ ఊరి అభివృద్ధి కోసం ఆలోచించేవారికి, పని చేసే వారికీ మీ ఓటును వెయ్యండి . అప్పుడే మీ కుటుంబం బాగుపడుతుంది, మీ ఊరు మన రాష్ట్రము, దేశం అభివృధి చెందుతుంది.
మనందరం మన ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకున్నప్పుడే, మన ప్రాంతాన్ని మన రాష్ట్రాన్ని దేశాన్ని పాలించుకునేందుకు సమర్ధులైన నాయకులలని ఎన్నుకున్న వచ్చు లేదంటే స్వార్ధపరులకు అవకాశం కల్పించినట్లు అవుతుంది వారి ద్వారా మన దేశాన్ని మరో 10 సంవత్సరాలకు వెనుకకు నెట్టినట్లు అవుతుంది కాబట్టి సమర్ధులైన నాయకులకు ఓట్లు వేసి వారిని చట్టసభలకు పంపించినప్పుడే మనం కన్న కలలు నెరవేరుతాయి దేశము అభివృద్ధి చెందుతుంది దయచేసి ఆలోచించు ఓటు వేయండి,మోసపోకండి, మోసగాళ్లను అసలు నమ్మకండి. మీ ఓటు వేసే ముందు ఒక్క క్షణం మీ భవిష్యత్తుని మీ కుటుంబ భవిష్యత్తుని ఆలోచించి నిజాయితీ కలిగిన నాయకుడికి ఓటు వేయండి.
-సురేందర్ గౌడ్ తాళ్లపల్లి
No comments:
Post a Comment