ఈ మధ్య కొంతమంది భూముల ధరలు తగ్గడానికి మరియు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం కుదేలవడానికి కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాలే కారణమని ఆరోపిస్తున్నారు. ఇది కొంతవరకు నిజమే అయినప్పటికీ, ఇది పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం మాత్రం కాదు.
దీనికి ప్రధాన కారణం కేవలం రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారులు మరియు సంస్థలు మాత్రమే. వారు తీసుకున్న నిర్ణయాలు మరియు విపరీతంగా పెంచిన ధరలే నేడు రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలవడానికి కారణమని నేను భావిస్తున్నాను.
ఒకప్పుడు హైదరాబాద్ మహానగరంలో ఒక డబుల్ బెడ్ రూమ్ ప్లాట్ కొనాలంటే 25 లక్షల నుండి 45 లక్షల లోపు మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఆ ధరలు అమాంతం 75 లక్షల నుండి 90 లక్షలకు పెరిగాయి.
ఇక త్రీ బిహెచ్కె ప్లాట్ లేదా హౌస్ విషయానికి వస్తే, ఒకప్పుడు దాని ధర 50 నుండి 60 లక్షల లోపు ఉండేది. కానీ ఇప్పుడు దాని విలువ ఏకంగా కోటి రూపాయలకు పైగా పెరిగింది.
విల్లా లేదా ఇండిపెండెంట్ హౌస్ల గురించి చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు విల్లా కొనాలంటే 60 లేదా 70 లక్షల లోపు వచ్చేది, బాగా డబ్బున్నవారు కొంటే 80 లక్షల లోపు ఉండేది. కానీ ఇప్పుడు వాటి ధర మూడు నుండి నాలుగు కోట్లు పలుకుతోంది.
మరికొన్ని అత్యంత ఖరీదైన విల్లాల గురించి చెప్పనక్కర్లేదు, వాటి అమ్మకాలు ఏకంగా 35 కోట్లకు పైగా జరుగుతున్నాయి.
అంతగా ధరలు పెంచితే సామాన్య ప్రజలు ఎలా కొంటారు? ధరల పెరుగుదల అనేది ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితులను బట్టి ఉండాలి కదా. సామాన్య మరియు పేద ప్రజలకు డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తున్నాయా? అన్ని లక్షల కోట్లు ఖర్చు చేసి వారు ఎలా కొనగలరు?
బెంగళూరులోనో, ఢిల్లీలోనో ధరలు ఎక్కువగా ఉన్నాయని ఇక్కడ కూడా పెంచితే ఎలా? ఇక్కడి ప్రాంత ప్రజల స్థితిగతులు మరియు ఆర్థిక పరిస్థితులను బట్టి కదా ధరలు పెంచాలి?
అందుకేనేమో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ప్రస్తుతం కుదేలవుతోంది!
గ్రామాల విషయానికి వస్తే భూముల ధరలు పెరగడం నిజమే. ప్రస్తుతం ఆ ధరలు కొంచెం అటూ ఇటూగా ఉన్నప్పటికీ, వాటిని హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంతో పోల్చలేము.
ఈ ధరల నియంత్రణను అడ్డుకోవడంలో గత ప్రభుత్వం మరియు ప్రస్తుత ప్రభుత్వం రెండూ విఫలమయ్యాయి మరియు అవుతున్నాయి.
మీరు నిజంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగాన్ని అభివృద్ధి చేయాలని అనుకుంటే, రియల్ ఎస్టేట్ సంస్థలతో మరియు ఏజెంట్లతో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజల అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత ధరల నియంత్రణ చర్యలు చేపట్టండి!
ఆ తర్వాతనే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఒక సరైన మార్గంలోకి వస్తుంది, తద్వారా ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరుగుతుంది!
ఈ చర్యలు చేపట్టకపోతే అటు రియల్ ఎస్టేట్ రంగం, ఇటు ప్రభుత్వం రెండూ నష్టపోతాయి.
ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.🙏
Regards
Surender Thallapelly
Cc :Telangana CMO Bhatti Vikramarka Mallu Ponnam Prabhakar Mahesh Goud Bomma Kalvakuntla Taraka Rama Rao - KTR
.jpeg)
No comments:
Post a Comment