గూడు చెదిరిన గౌడ కుల వృత్తి..
మండుటెండల్లో దాహంతో అలమటిస్తున్న జనానికి దాహం తీర్చినది గౌడ కులస్తులు.మోకు భుజానేసుకుని, కాళ్లకు గుత్తి తొడిగి, కత్తి వెనక్కి జెక్కి యుద్ధానికి వెళ్తున్న సైనికునోలె గౌడ కులస్తులు నిత్యం చావు, బతుకుల పోరాటం చేస్తారు. కల్లుగీత కోసం ఇంటి నుంచి బయలు దేరిన గౌడు ఇంటికి తిరిగి వచ్చినప్పుడే వచ్చినట్లుగా ఆ వృత్తిలో ఉన్నవారు భావిస్తారు అంటే ఈ గీతవృత్తి ఎంత ప్రమాదంతో కూడుకొని ఉన్నదో అర్థం అవుతుంది. నేటి సమాజంలో అన్ని వృత్తులకంటే. అతి ప్రమాదకరమైన ది కల్లుగీత వృత్తి. రోజుకు రెండుసార్లు తాటి చెట్లను ఎక్కి గీస్తే తప్ప కల్లు పారదు. ఎండైనా, వానైనా తాటి చెట్లను ఎక్కి తీరాల్సిందే. గాలి, దుమారాలు వచ్చినప్పు డు అయితే.. చావును సవాల్ చేస్తూ.. గౌడులు తాటి చెట్లను ఎక్కడం అనేది వారి నైపుణ్యానికి ఓ నిదర్శనమైతే..,అంతకంటే ముఖ్యంగా అంతటి ప్రమాదకరమైన పరిస్థితిల్లో కూడా తాటి చెట్లను ఎక్కక తప్పని స్థితి వారి ధైన్యాన్ని తెలియజేస్తున్న ది.
పండగైనా,పబ్బమైనా ఒక్కరోజు, ఒక్కపూట కూడా విడిచిపెట్టకుండా తాటిచెట్లను గీయాల్సిందే.
తాగేనీటిలో ఫ్లోరిన్,ఇతర లవణాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కల్లు తాగితేనే వారి ఆరోగ్యం సరిగా ఉంటుంది. తాగుతున్న నీటిలోని హానికరమైన లవణాలను నిర్వీర్యం చేసి, మనిషి ఆరోగ్యాన్ని రక్షించడంలో కల్లు ప్రధానపాత్ర పోషించింది.
కానీ.. ఆధునిక సమాజంలోని వక్రమార్గాలు తోడై..,కల్లుకు రసాయనాలు కలిపి నకిలీ కల్లును తయారు చేసి, మత్తు పదార్థాలను కలిపి కల్లుగా అమ్మడంతోనే కల్లు మత్తుపదార్థంగా, హానికరమైనదిగా ప్రచారం జరుగుతున్నది.
కానీ చారివూతకంగా కల్లు ఏనాడూ శరీరానికి హాని చేసేదిగా లేదు. ఆరోగ్య రక్షణకు తోడ్పడేదిగానే ఉన్నది. అలాగే..కల్లుగీత వృత్తి నుంచి ప్రతిఏటా కోట్లాది రూపాయలు ఎక్సైజ్ పన్ను రూపేణా ప్రభుత్వానికి గౌడ కులస్తులు కడుతున్నారు
తాళ్లపెళ్ళి సురేందర్ గౌడ్
Jntuh JAC State Media Spokesperson
No comments:
Post a Comment