Monday, November 25, 2013

రైతు కష్టం. పంటలకు నష్టం . ఇది ఏం బతుకు ఇది ఏం బతుకన్నా మన రైతన్న బతుకు.

రైతు కష్టం. పంటలకు నష్టం . ఇది ఏం బతుకు ఇది ఏం బతుకన్నా మన రైతన్న బతుకు.
ఏటా ఏదో ఓ విపత్తు అన్నదాత ఉసురు తీస్తోంది.పంటచేతికొస్తుందనుకున్న సమయంలో అకాల వర్షాలు రైతును నట్టేట ముంచాయి.వ్యవ'సాయానికి' సర్కార్‌ మొండిచెయ్యి. వరి కొనుగోలు కేంద్రాల్లో దళారుల మాయాజాలం.రైతులపై దళారుల దోపిడీ.పుట్టెడు కష్టాల్లో రైతన్న,
ఒక ఏటా కష్టం నీళ్ళ & నేల పాలు .మరొక ఏటా కష్టం ఎండల పాలు.
పంటలు మంచిగా చేతికొస్తుందనుకున్న సమయంలో రైతులపై దళారుల దోపిడీ.
ప్రభుత్వలు ఉన్నా , పాలకులు ఉన్నా అధికారులు ఉన్నా .రైతన్న నోటికి అందేది శూన్యమునే.రైతులు నివసించేది పల్లెల్లోనె. రైతు అంటే వ్యవసాయదారుడు. దేశానికి ఆహారం పెట్టగలిగిన వాడు రైతు. దేశ జనాబా లో అధిక శాతం వ్యవసాయదారులే. దేశానికి రైతు వెన్నెముక లాంటి వారని అని చెప్పుకునే మనం.అ రైతు పుట్టెడు కష్టాల్లో వుంటే .మన నేతలు అర్దము చేసుకుంటారా.చేసుకున్న ఆది ఎన్నికల ముందునే .ఎన్నికల అయిపోతే రైతు ఎవడు ! నేనే రాజు అనే నాయకులలో చాలా మంది ఉన్నారు.
దేశములో అన్ని ధరలు ఏటా పెరుగుతాయి కాని .ప్రధానమైన పంటలు వరి, జొన్నలు, మొక్క జొన్న, పత్తి,పంటల ధర పెరగవు.వరి ధాన్యానికి ప్రభుత్వం మద్దతు ధరలు ఇలా ఉన్నాయి .ఏడాది ఖరీఫ్ సీజన్ లో సాగు చేసిన వరిలో సాధారణ రకం ధాన్యానికి క్వింటాకు రూ.1310, గ్రేడ్-ఏ రకం ధాన్యానికి క్వింటాకు రూ.1345 .ఇందులో వరి మద్దతు ధర రూ : 60/- .ఈ ధరలు రైతు చేతులకు అందుతుందా ? అదే వరి గింజలు బియ్యముగా మార్చబడి అదే ప్రజలకు అమ్మితే అ బియ్యము ధర కనీస రేటు 2500 rs ఉంటుంది.ఇది మన సమాజం ఇది మన విలువలు.మరి ఎక్కడ న్యాయము ఉంది చెప్పండి ? ఇది ఇలాగే కొనసాగుతే కొన్ని రోజుల తరువాత రైతు జీవితం ఇది ఇలాగే కొనసాగుతే కొన్ని రోజుల తరువాత రైతు జీవితమును మన దేశంలో museum లో మాత్రమే చూడవలసి వస్తుంది సుమా !
Thallapelly Surender Goud
JNTUH-JAC official Spokes Person - TS JAC

No comments:

Post a Comment