అమ్మ అనే కమ్మని మాట లోనే వుంది అమృత ధార…
అమ్మ అంటే అలౌకిక ప్రేమ కేంద్రం
అమ్మ అంటే కమనీయ రాగం.
అమ్మ కమ్మగా పాడుతుంటే మాయమవుతుంది మన కంటిలో చెమ్మ,
అమ్మ అంటే అమృతము.
అమ్మ అంటే గురి తప్పని శ్రీరాముని బాణం అమ్మే!
ఈ జగతికి మూలం అమ్మే!
లోకాన్ని తెలిపే తొలి గురువు మన అమ్మే !
మనం పీల్చే ప్రతి శ్వాసకు ప్రాణం అమ్మే!
అమ్మ నీ జన్మ ఇలలో ఒక అద్భుత వరం మాకు .
- టి .సురేందర్ గౌడ్
No comments:
Post a Comment