భారత దేశ జనాభా ప్రస్తుతం 135 కోట్లకు పైగా ఉంది. అందులో ఎక్కువ శాతం యువతి, యువకులే కనీసం 80 కోట్లకు పైగా ఉంటారు.

ఇలాంటి యువ భారతదేశములో యువతకు రాజకీయ రంగంలో అవకాశాలు ఎక్కడ ?
దేశంలో వేల సంఖ్యలో రాజకీయ పార్టీలు , 2014 భారత ఎన్నికల సంఘం ప్రకారం దేశంలో వివిధ రాజకీయ పార్టీల సంఖ్య 1866 గా నమోదు అయింది. ఇది ఇలా ఉంటే ఇందులో పెద్ద పార్టీల సంఖ్య 150 పైగా ఉన్నాయి.. కానీ ఈ పార్టీలలో ఎంతమంది యువతీ ,యువకులు ఉన్నారు.ఒకవేళ ఉంటే ఆ పార్టీలలో ఉన్నవారికి ఎంత వరకు ఉన్నత స్థాయి అవకాశాలు ఇస్తున్నారు... వారి ఆలోచనలకు ఎంత వరకు విలువలు ఇస్తున్నారు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి.... సహజంగాను అన్ని రకాల రాజకీయ పార్టీలకు విద్యార్థి, యువజన సంఘాలు ఉన్నప్పటికీ... ఆ సంఘాలు ఎలాంటి ఆలోచనతో నడుస్తున్నాయి అనేది కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి....

కానీ ఎలాంటి కొత్త పద్దతులు , ఉద్యోగాలు కల్పించడంలో పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టడం లేదు. కేవలం దేశ అభివృద్ధి పేరుతో ,రాష్ట్రల అభివృద్ధి పేరుతో చేసే హంగామా తప్ప మరేం మార్పు లేదు....ఒకపక్కన రోజు రోజుకు దేశ జనాభా పెరుగుతూ పోతుంది.. మరో పక్కన దేశ యువత నిరుద్యోగ సమస్య పెరుగుతూ వస్తోంది...అయినా కూడా చట్టాలు చేసే నాయకులు మాత్రం ఎలాంటి దృష్టి ఈ సమస్య మీద పెట్టడం లేదు... కేవలము వారి ఐదు సంవత్సరాల అధికారం మీద, మళ్ళీ తిరిగి అధికారంలోకి ఎలా రావలి అనే దాని మీద మాత్రమే దృష్టి పెడుతున్నారు..

మన కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు యువత కోసం ఏం చేస్తున్నాయి ?

ఇదేకాకుండా మరో కోణంలో యువతను మోసం చేస్తున్న విషయాలు... కులాల, మతాల పేరుతో కొన్ని రకాల పథకాలను ఏర్పాటు చేసి, అవే పథకాలు యువత కోసం అని తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ఇలా ఏర్పాటు చేయడం వల్ల పూర్తి స్థాయిలో యువతకు నష్టమే జరుగుతుంది కానీ,ఎలాంటి లాభము మాత్రం జరగడంలేదు. అదేకాకుండా మన ప్రభుత్వాల నుండి ఎలాంటి సహాయ సహకారాలు నేటి యువతరానికి పూర్తి స్థాయిలో అందడం లేదు. ఇదే విషయం దేశంలో ఉండే మేధావి వర్గానికి, చదువుకున్నా వారికి అందరికి తెలిసినా విషయమే..!
మళ్ళీ తిరిగి యువతరం రాజకీయ విశ్లేషణలోకి పోదాం :-
గత కొన్ని సంవత్సరాల నుండి నేను చూస్తున్నాను ..రాజకీయ పార్టీల నాయకులు పెద్ద పెద్ద సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి , ఆ సమావేశాలలో ఆ నాయకుడి నుండి వచ్చే మొదటి నోటి మాట... నేటి యువతరం దేశానికి రక్షణ కవచలు ...నేటి యువతరం అందరూ కూడా రాజకీయాలలోకి వచ్చి. దేశాన్ని మీ ఆలోచనలతో ,మీ జ్ఞానముతో అభివృద్ధి చేయాలి.. దేశాన్ని మార్చాలని పెద్ద పెద్ద మాటలు మాట్లాడం ...మనం ఎన్నో సార్లు చూశాం.. కానీ అది ఆచరణలో మాత్రం సాధ్యం అవుతుందా ? ఇలా మాట్లాడే నాయకులు ఎంత వరకు యువతరానికి ప్రోత్సహిస్తున్నారు.అనేది మనం అర్థం చేసుకోవాలి.
రాజకీయాలు అంటే యువత ఎందుకు భయపడుతున్నారు ??
ఇది నేను నా పూర్తి స్థాయి అనుభవముతో చెప్పుతున్నాను. నేను అంటే (సురేందర్ తాళ్లపెళ్లి) నాకు విద్యార్థి రాజకీయాల మీద 8 సంవత్సరాల అనుభవము ఉంది. ఈ సమయంలో నాకు , నా తోటి స్నేహితులకు, సమాజంలో నాలాంటి యువ రాజకీయ ఆలోచలు ఉన్నవారిని చూసి, వారికి జరిగిన సంఘటనలను ఆధారంగాను ..ఇక్కడ రాస్తున్నాను..
దేశంలో , రాష్ట్రములో యువత ప్రధానంగాను రాజకీయాలలో రాణించకపోవటానికి కారణాలు :-
1.దేశంలో , రాష్ట్రములో అన్ని రాజకీయ పార్టీలకు విద్యార్థి, యువజన సంఘ విభాగాలు ఉంటాయి.కానీ ఆ సంఘాలలో పార్టీల కోసం , సమాజం నిర్మాణం కోసం, నిరంతరము పని చేసే యువతరానికి నేటి రాజకీయ పార్టీల పెద్దలు వారికి ఎంత వరకు సహాయ సహకారాలు ఇస్తున్నారు, అదేకాకుండా వారి ఆలోచనలకు ఎంత వరకు గుర్తింపు ఇస్తున్నారు అనేది మన ఇక్కడ అర్థం చేసుకోవాలి.ఇలా వారి పోరాటాలకు ,వారి ఆలోచనలకు తగిన గుర్తింపు ఇవ్వకపోవడం ఒక పెద్ద ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చును.
2.అదేవిధంగాను ఈ విద్యార్థి, యువజన సంఘలలో చేరే వారు ఎక్కువ మంది కూడా గ్రామీణ ప్రాంతాల పేద యువత కావడం మరో ప్రధాన కారణం. వారికి ఆ పార్టీల నుండి సహాయ సహకారాలు అంతగాను అందకపోవడం , వారి నెలవారీ ఖర్చులకు కూడా డబ్బులు లేకపోవడం.. ఇలా కొన్ని పోరాటాలు చేసి.. చివరకు ఇంట్లో వాళ్ళ నుండి వచ్చే వత్తిడితో, జీవితం గడవాలి కాబట్టి చివరకు ఎదో ఒక ఉద్యోగంలో చేరిపోవడం జరుగుతుంది.
3.ఇలా ఎక్కడో 100 మందిలో కేవలం 8 మంది మాత్రమే వారి కులము పేరుతోనే, వారి కుటుంబ సభ్యుల సహకరంతోను, లేదా వారికి ఉన్న డబ్బుతోను నేటి రాజకీయాలలో ఆ 8% శాతం యువత మాత్రమే రాణిస్తున్నారు.
రాజకీయ పార్టీల విధి విధానాలు మారాలి, రాజకీయాలు కూడా నేటి యువతరానికి ఒక వృత్తిగా మార్చి, రాజకీయాలలో ఒక నూతన మార్పులు చేయాలి ..!
నేటి రోజులలో యువతరానికి రాజకీయాలు అంటే చెడు అభిప్రాయం ఉన్నప్పటికీ, యువతలో మాత్రం నేటి రాజకీయాలను మార్చాలి అనే ఆలోచన చాలా మంది యువతలో బలం ఉంది.కానీ సరియైన అవకాశాలు లేక, తోడ్పాటు లేకపోవడం, వారికి పార్టీల పెద్దలు నమ్మకం, భరోసా ఇవ్వక పోవడం వల్ల వెనుకడుగు వేస్తున్నారు. అదేకాకుండా రాజకీయాలలో చదువుకున్నా యువతకు అవకాశాలు కలిపించి, కనీసం 40% వరకు అయినా ఉద్యోగులకు నెల వారి జీతాలు ఎలా ఇస్తారో ,అలానే ఇలాంటి పద్ధతులు నేటి రాజకీయాలలో ఏర్పాటు చేస్తే అవినీతి తగ్గి, నేటి రాజకీయాలలో ఒక గొప్ప మార్పు వచ్చే అవకాశం ఉంది..ఇలా చేయడం వల్ల దేశంలో కొంతలో కొంత వరకు అయినా నిరుద్యోగ సమస్యను తగ్గించవచ్చును, కానీ ఇది జరగాలి అంటే చాలా మార్పులు చేర్పులు జరగాలి..ఇది జరగాలని అందరం కోరుకుందాం...!
తెలంగాణ రాష్ట్రములో ఒక పెద్ద మార్పు 2014 ఎన్నికలో రావాల్సిండే ?

తెలంగాణ ఉద్యమ సమయంలో మనం అందరం కూడా చూశాం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎంతో మంది యువకులు ముందు వరుసలో ఉండి ప్రాణలు త్యాగాలు చేసి ,అమరుల అయినారో తెలంగాణ సమాజానికి,ప్రపంచానికి తెలిసిన విషయమే. అదేకాకుండా రాష్ట్ర ఏర్పాటు కోసం ఎంతో మంది యువకులు, విద్యార్థులు వారి చదువును, వారి ఉద్యోగా అవకాశాలను, వారి కుంటుబాలకు పక్కన పెట్టి పోరాటాలు చేస్తే చివరికి రాష్ట్ర ఏర్పాటు తర్వాత వారికి ఏం మిగిలిందో కూడా అందరికి తెలిసిన విషయమే... రాష్ట్రము ఏర్పాటు తర్వాత ఆ యువతను కనీసం ఆదుకోవాల్సిన బాధ్యత కూడా మర్చిపోయి, వారి ,వారి జీవితలను నడి రోడ్ల మీద వదిలేశారు నేటి పాలకులు... కేవలం 2% శాతం యువతకు మాత్రమే న్యాయం చేసి.. మిగిలిన 98% శాతం యువతకు అన్యాయం చేశారు... కానీ నిజానికి రాష్ట్ర ఏర్పాటు తర్వాత పోరాటాలు చేసిన యువతకు రాజకీయంగాను, లేదా వారి జీవితల త్యాగాలకు సరియైన న్యాయం జరగవలసి ఉండే కానీ అది జరగలేదు... అది ఒకవేళ జరిగి ఉంటే దేశ రాజకీయాలలో ఒక పెద్ద మార్పుగా ఉండేది.. చూదాం చరిత్రను ప్రపంచం మొత్తం కూడా ఎప్పటికి అప్పుడు చూస్తూనే ఉంది... ఈ చరిత్ర గురించి మరొక వ్యాసంలో మాట్లాడుకొందాం..!
నేటి రాజకీయాలలో కొన్ని మార్పులు :-

చూస్తున్నాం..అదికూడా ఎంత వరకు ఇప్పుడే మనం నమ్మలేం కానీ చాలా గొప్ప ఆలోచన అని మాత్రం చెప్పవచ్చును.. కొన్ని రోజుల క్రితం
మరో గొప్ప మార్పు :-

చివరగా నా మనవి :
రాజకీయ పార్టీలకు , నాయకులకు, ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి అంటే శుద్ధమైన ఆలోచనలు కలిగిన యువతీ యువకులు కావాలి, అలాంటి వారు ఉంటేనే మీరు అనుకొన్న వ్యవస్థ నిర్మాణం 100% నెరవేరుతుంది. వారు మీతో ముందుకు నడవడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉన్నారు కానీ వారికి మీరు ఎలాంటి భరోసా ఇస్తారు అనేది ఇక్కడ ఆలోచించదగ విషయం.
Regards
సురేందర్ టి
No comments:
Post a Comment