Wednesday, August 23, 2017

దాసోజు శ్రవణ్ గారి సవాల్ ఎదురుకోలేక సానుభూతి పేరుతో మానసిక దాడులు చేస్తున్న #టిఆర్ఎస్ నాయకులు.

ఆక్రోశం, అసూయ, స్వార్ధం ఆధిపత్య దురహంకారం వినాశనానికి మూలం. ఇది తెరాస ప్రస్తుత లక్షణం

దాసోజు శ్రవణ్ గారి సవాల్ ఎదురుకోలేక సానుభూతి పేరుతో మానసిక దాడులు చేస్తున్న #టిఆర్ఎస్ నాయకులు.
ఓ పక్క కాంగ్రెస్ లో  ఏ పదవి రాదు అని జ్యోష్యాలు చెపుతున్న మీకు శ్రవణ్ గారి పట్ల సానుభూతి ఉన్నట్లా.

చర్చ జరుగవలసింది ప్రభుత్వ మోసాల మీద అంతేకానీ శ్రవణ్ దాసోజు గారి వ్యక్తిగత జీవితం పై, కెసిఆర్ గారితో దిగిన ఫోటోల మీద, గతంలో జరిగిన సంఘటనల పై కాదు..

అది గతం గతహ: అది ముగిసిపోయిన స్టోరీ ,

ఇప్పుడు శ్రవణ్ దాసోజు గారు కాంగ్రెస్ పార్టీలో ఒక గొప్ప నాయకుడిగాను ఉన్నత స్థాయి  ఉన్నారు...కాంగ్రెస్ పార్టీ వేదికగా , కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ..మీరు, మీ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు నిర్ణయాలను ప్రశ్నింస్తున్నారు, వాటి మీద వివరణ అడుగుతున్నాడు.. అంతేకాకుండా వాటిమీద ప్రజాస్వామ్య పద్దతిలో  చర్చలకు రమ్మని ఆహ్వానిస్తున్నాడు..అంతేకానీ ఆరోజు తడిగుడ్డ బెట్టి గొంతుకోసినట్లు గా, తేనె పూసిన కత్తుల వలె, మీరు చేసిన మోసం గురించి, అతన్ని వాడుకొని కరివేపాకులా పక్కన పడవేసి దొంగలకు సద్దులు మోసినట్లు  తెరాస పెద్దలు మీరు ద్రోహులకు పట్టం  కట్టిన విషయం ఎక్కడ కూడా ఆయన మాట్లాడలేదు. నమ్మించి మీరు చేసిన మోసం గురించి తాను పల్లెత్తు మాట అనలేదు. ఇప్పుడు తనకు ఆ అవసరం కూడా లేదు .కానీ మీరు తన మీద అలాంటి రాజకీయ కుట్రలు చేస్తున్నారు...

సానుభూతి పేరుతో శ్రవణ్ దాసోజు గారిని రాజకీయగా దెబ్బ తీసేందుకు మరొక్కసారి టిఆర్ఎస్ వేదికగా కుట్రలు  చేస్తున్నారు. అతని పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

.అసలు గత టిఆర్ఎస్ పార్టీలో జరిగిన సంఘటనలు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు.. శ్రవణ్

 దాసోజు గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు..ఇప్పుడు తను అడిగినా ప్రశ్నలకు సమాధానం చెప్పవలసి బాధ్యత మీ ప్రభుత్వం మీద ఉంది..

తెలంగాణ ప్రజలకు తెలుసు ,మీకు కూడా తెలుసు శ్రవణ్ దాసోజు గారి పోరాటం, తెలంగాణ ఉద్యమం కోసం తాను చేసిన త్యాగం. అందులో భాగంగాను
శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి మీద ఉన్న నమ్మకముతో నిజాగానే భువనగిరి నుండి టికెట్ ఆడిగినడు, ఒకవేళ అది ఇవ్వకుంటే సికింద్రాబాద్ పార్లమెంట్ లేదా ముషీరాబాద్ టికెట్ ఇవ్వాలిని  పార్టీ పెద్దలు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని కోరిన్నారు.. ఎందుకంటే 2009 లో ఆయన సికింద్రాబాద్ ఎమ్ పి  గా పోటీ చేశారు. కానీ ఇక్కడ నుండి కూడా ఇవ్వలేదు..ఇవ్వకపోవడమే కాక చిన్న కులము వాడివి.. నీకు ఓట్లు ఎవరు వేస్తారని అన్న మాటల గురించి అందరికి తెలిసిందే... నిజం చెప్పండి.. భువనగిరి నుండి గెలవడం "టఫ్" అంటే ..
ఎవరో కూడా తెలియని  ఆలేరు కు చెందిన ఫైళ్ల శేఖర్ రెడ్డి గారికి టికెట్ ఎలా ఇచ్చారు ?
అదేవిధంగాను సికింద్రాబాద్ ఎమ్ పి గా ఎవరో కూడా తెలియాని వ్యక్తికి టికెట్ ఎలా ఇచ్చారు చెప్పండి ?

అట్లనే ముషీరాబాద్ నుండి ఒక ఎప్పుడో కౌన్సిలర్ గ పని చేసిన టీడీపీ కి చెందిన ముఠా గోపాల్ గారికి రాత్రికి రాత్రి టికెట్ ఎలా ఇచ్చారు చెప్పండి ?

అంతేకాకుండా ..శ్రవణ్ దాసోజు గారు టీఆర్ఎస్ పార్టీలో నేడు ఉండివుంటే #MLC గా అయి ఉండే వారని ముసలి కన్నీరు కారుస్తున్నారు.. కానీ ఇది పక్క రాజకీయ కుట్ర.. ఒక్కటి చెప్పండి..  శ్రవణ్ దాసోజు గారు టీఆర్ఎస్ పార్టీలో అలాగే పడి ఉండి ఉంటే MLC గాను అయి ఉండేవారేని మీరు ఊహాజనితంగా మాట్లాడుతున్నారు,

అయితే నేటి టిఆర్ఎస్ అధినేత ,ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆరోజు టీడీపీ పార్టీ అధ్యక్షుడు, అప్పటి ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మంత్రి పదవి ఇవ్వలేదని  రాజీనామా చేసి ఉండకుండా ఉంటె, . నేడు టీడీపీ నుండి ఉపరాష్ట్రపతిగా అయి ఉండిఉండే వాడేమో..ఇవన్నీ ఊహలు, జరిగిపోయిన గతాలు

కెసిఆర్ కు, శ్రవణ్ గారికి సంబంధించిన  గతం పై కాదు చర్చ కావాల్సింది, వర్తమానంపై, ప్రభుత్వ పనితీరు పై ఇప్పుడు చర్చ జరగాలి.

చివరగా అసలు ఇక్కడ చర్చ జరగవలసింది శ్రవణ్ దాసోజు గారి టికెట్ గురించి కాదు... ఎక్కడ ఇప్పుడు చర్చ జరగవలసింది భారత రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన హక్కుల కాలరాస్తున్న వైఖరి మీద, రైతుల ఆత్మహత్యలపై, రైతుల వారి గోసల పై , నిరుద్యోగ సమస్యలపై, సాండ్ మాఫియా మాఫియా పై, సాగునీరు ప్రోజెక్టుల పేరు, మిషన్ భాగీరథ పేరు మీద అవినీతి పై, కవిద్యార్థుల ఫి రేయింబర్సుమెంట్ , స్కాలర్ షిప్ సమస్యలపై, పై, దళిత బహుజను హక్కుల పై ,వారిపై జరుగుతున్న దాడుల పై, ఎన్నికలలో చేసిన వాగ్ధానాల అమలులో వైఫల్యం, అదేవిధంగా ప్రభుత్వం చేస్తున్న అప్పుల మీద, ఐ టి ఐ ర్ వైఫల్యం మీద, నేరెళ్ల దురాగతం మీద, రబ్బరు ముద్రల వలే పడిఉన్న మంత్రుల మీద, ఫార్మ్ హౌస్ పాలన మీద,  దొంగ చట్టం ద్వారా అదిరించి బెదిరించి ప్రభుత్వమే దళసరిగా దౌర్జన్యంగా భూములు లాకుంటున్న వైనంపై, పోలీసు అణచివేత పై, సంకుచిత కుల రాజకీయాలపై, ప్రభుత్వం తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాల పై చర్చలు జరగాలి...

అంతే కానీ వ్యక్తిగత జీవితం , వ్యక్తిగత జీవితంలో జరిగిన సంఘటనల మీద కాదు.....ఆలా మాట్లాడు కోవాలంటే ఆలే నరేంద్ర, విజయ శాంతి, చెరుకు సుధాకర్ , విజయ రామరావు మీద, చంద్రశేఖర్, రవీంద్ర నాయక్ మీద రఘునందన్ మీద ఇంకా చాలా గత అంశాల మీద చర్చ జరగాలి. వైస్సార్ బతికుంటే కెసిఆర్ తప్ప అందరు  కాంగ్రెస్ లో  చేరి ఉండే వారన్న విషయం పై  జరగాలి. విజ్ఞులు వర్తమానం గురించి మాట్లాడుతారు. ఇంకా చెప్పాలంటే పేరుకే మంత్రులం గాని, మేము బుగ్గ కారున్న బానిసలు గా మారామని మీ వెనుక మాట్లాడుతున్న మంత్రుల గూర్చి మాట్లాడనుకోవాలి. తెరాస లో కోనసాగుతున్న బానిసత్వం గూర్చి మాట్లాడుకోవాలి.

గతం కాదు.
ధైర్యం ఉంటె, నీతి నిజాయితీ ఉంటె, చర్చ కు రండి
Regards
సురేందర్ గౌడ్ .టి

No comments:

Post a Comment