Tuesday, July 16, 2019

నాణేనికి బొమ్మ, బొరుసు లాంటి వారు గురువులు


గురువులు అంటే కేవలం విద్య  నేర్పేవారే కాదుగురువు అంటే ఆధ్యాత్మిక అంశాలతో & భవిష్యత్తు పాఠాలను నేర్పే వారందరు కూడా గురువులే .


ప్రస్తుతం నా వయసు 28 సంవత్సరాలు.  28 ఏళ్లలో,  నా విద్య అభ్యాసం 4 సంవత్సరాల వయసులో మొదలైంది, ప్రయాణంలో  నేను చాలా మంది గురువు వద్ద  విద్యను అభ్యసించాను , అలాగే వారి వద్ద ఎనో కొత్త విషయాలు నేర్చుకున్నాను...అందులో కొంత మంది  గురువులు  పుస్తకాలలోని విద్యను నేర్పిస్తే, మరికొందరు గురువులు సమాజంలోని ఉన్నత విలువల గురించి, భవిష్యత్తు పాఠాలు & మరెన్నో కొత్త విషయాలు విజ్ఞానం, పరిజ్ఞానం నేర్పారు, ఇంకా కూడా నేర్పుతున్నారు .

అలాగే మన దేశంలో గురువుకి  ఒక ప్రత్యేకమైన స్ధానం ఉంది, గురువు అనేవారు  ఒక శిల్పి లాంటి వాడు. బండరాళ్లతో అందమైన శిల్పాలు చెక్కి వాటికి ప్రాముఖ్యతను కలిగించగల ప్రఙ్ఞాశాలి ఒక గురువు మాత్రమే . అలాగే  మంచి గురువు చేతిలో మలచబడేవారు ఉత్తమ వ్యక్తులుగా ,సంస్కారవంతులై ,సమాజానికి ఉపయోగపడతారు. ఇలాంటి గురువులో కొంతమంది గురువులు నా ప్రయాణంలో కలిసాను, వారి వద్ద ఎన్నో గొప్ప విషయాలు నేర్చుకున్నాను, ఇంకా కూడా  నేర్చుకుంటున్నాను..

నా గురువులు నాకు చెప్పిన  కొన్ని ముఖ్య  విషయాలు :

1. సమస్యలకు ఎప్పుడు భయపడకు, సమస్యలను ప్రేమతో పోరాడు..
2. దుష్టులకు దూరంగా ఉండు.
3. జీవితంలో ఎదగడం కోసం తప్పుడు మార్గాలను అనుసరించకు.
4 ఆత్మవిశ్వాసానికి పదును పెట్టు, ఇష్టపడి కొత్త విషయాలను నేర్చుకో, ఇతరులపై ఈర్ష్యపడటం మానుకో..
5 జీవితంలో ఎదగడం కోసం ఒకరితో పోల్చుకోకు.
6 జీవితంలో పని చేసిన కూడా ఏకాగ్రతతో చేయడం నేర్చుకో .
7. సమాజంలో మంచి, చెడు ఉంటాయి..సమయాన్ని బట్టి  సమయంలో కూడా వారితో పని చేయడం నేర్చుకో ..
8 తప్పు లేనప్పుడు తలదించకు, తప్పు జరిగినప్పుడు క్షమాపణలు కోరడం మరిచిపోకు .
9  సమస్యలను సొంతంగాను పరిష్కరించడం నేర్చుకో, అలా జరగని సమయంలో నీ మంచిని కోరుకునే వారిని సంప్రదించు .
10 నీ మంచిని కోరుకునే వారికీ ఎల్లవేళలా రక్షణగా నిలువు .
11 విషయాన్ని స్పష్టంగా మాట్లాడటం & ఇతరులకు చెప్పడం నేర్చుకో ..
12  విజ్ఞానానికి వయస్సు తో  సంబంధం లేదు..అలా అందరి దగ్గర కొత్త విషయాలను నేర్చుకో ..
13 నూతన విషయాలపై పరిశోధనలు చేయు, వాటిని తెలుసుకొని అవసరమైన వారికీ పంచు ..

ఇలా ఎన్నో విషయాలను నా గురువులు నాకు చెప్పారు. ఇలా మరెందరో నూతన విషయాలు చెప్పుతున్నారు .. వారు నేర్పించిన విషయాలను కొన్ని పాటించాను, మరికొన్ని పాటించడానికి ప్రయత్నిస్తున్నాను.. చివరిగాను నా గురువులకు గురు పూర్ణిమ శుభాకాంక్షలు..
                                                                      ఇట్లు
మీ సురేందర్

No comments:

Post a Comment