ముఖ్యమంత్రి
కెసిఆర్ గారు ఎవరు ఎమన్నా, ఎవరు కాదన్నా భారత దేశ రాజకీయాలలో అతి కొద్దీ మంది నాయకుల్లో రాజకీయ
చాణిక్యుడు అని చెప్పుకోవచ్చు . తెలంగాణ ఉద్యమ నేతగా ఎదిగి రెండో సారి తెలంగాణ
రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు . మొదటిసారి ముఖ్యమంత్రిగా పాలనా కొనసాగించినప్పుడు
వ్యవసాయ రంగంలో కొన్ని నూతన చట్టాలు చేసి రాష్ట్ర ప్రజలను, రైతులను తన వైపు
తిప్పుకున్నారు ... అలాగే దేశంలో వివిధ రాజకీయ పార్టీలను కూడా తన మాదిరిగాను రైతుల
కోసం చట్టాలు, పథకాలు చేసే విధంగా చేసి ఒక ఆదర్శ నాయకుడిగా ఎదిగారు, అలాగే రెండోసారి
కూడా నూతన విధానాలు, పథకాలు ఏర్పాటు చేస్తాననే పేరుతో ముఖ్యమంత్రి అయ్యారు ..ఇక్కడి వరకు
ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ఒక రాజకీయ చాణిక్యుడు మరియు ఒక ఆదర్శ నాయకుడిగా ఉన్నాడు
.. కానీ ఇక్కడే ఇప్పుడే అసలు కథ మొదలైంది. చాణిక్యుడు & ఆదర్శ నాయకుడు కాస్త రాజ్యాంగ ఉల్లంఘన నాయకుడిగా మరి నేటి రేపటి
భవిష్యత్తు తరాలకు రాజకీయాలు, రాజకీయ నాయకులపై ఉన్న కాస్త గౌరవాన్ని రోడ్డు పై పడేశారు .. 88 మంది
ఎమ్మెల్యేలు ఉండి 46% మంది తెలంగాణ
ప్రజల ఓట్ల తో అధికారం చేపట్టినాక కూడా.. తెలంగాణ నూతన రాష్టంలో కొత్త చరిత్రకు
నాంది పలకావల్సిన నాయకులే డాక్టర్ బి.ఆర్
అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగలోని చట్టాలను పాటించకుండా ఉల్లంఘించి పక్క పార్టీ
కాంగ్రెస్ చెందిన 12 మంది ఎమ్మెల్యేలను అశాస్త్రీయంగాను కాంగ్రెస్ సీఎల్పీ పేరుతో
టిఆర్ఎస్ పార్టీలో విలీనం చేసుకొని పూర్తిగాను రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారుని
భారత రాజ్యాగంలోని చట్టాలు చెపుతున్నాయి .
భారత రాజ్యాంగం
ప్రకారం తెలంగాణ కాంగ్రెస్ సీఎల్పీ విలీనం అప్రజాస్వామిక చర్య అవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 29% శాతానికి పైగా
ప్రజలు ఓట్లు వేశారు.టిఆర్ఎస్ పార్టీ కి 46 % ఓట్లు వేశారు... అంటే కాంగ్రెస్ పార్టీ కంటే 17% ఓట్లతో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.. ఇలాంటి సమయంలో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అభివృద్ధి పేరుతో టిఆర్ఎస్ పార్టీలో
సీఎల్పీ విలీనం చేశామని స్పీకర్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు..కానీ ఇక్కడ
గమనార్హం ఏంటి అంటే, ఇంకా కాంగ్రెస్ పార్టీలో 6 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు..ఆ మిగిన ఆరుగురు ఎమ్మెల్యేలు ఎవరు అనే
విషయం స్పీకర్ చెప్ప వలసిన విషయం ఉంది. అలాగే 29% కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిన ప్రజల
ఓట్లు ఎలా విలీనం చేస్తారో కూడా స్పీకర్ కోర్టు కి చెప్పవలసిన అవసరం ఉంది...ఈ
కేసుపై కోర్టులో వాదనలు సకాలంలో జరుగుతే 12 మంది కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే అవకాశం ఉంటుంది...
కానీ ప్రస్తుతం అది జరుగుతుందనే నమ్మకం కోర్టులు ఇచ్చే తీరుపై ఆధారపడి ఉంది.
మీ తాళ్లపెళ్లి సురేందర్ గౌడ్
ఇది కేవలం ముఖ్యమంత్రి
కెసిఆర్ గారి రాజకీయ వ్యూహం కావచ్చు కానీ రేపటి భవిష్యత్తులో టిఆర్ఎస్
పార్టీకి ప్రమాద సూచికలు :
ముఖ్యమంత్రి
కెసిఆర్ రాజకీయ వ్యూహం అని అందరికి తెలిసిన విషయమే కానీ భవిష్యత్తులో టిఆర్ఎస్
పార్టీకి ప్రమాద సూచికలు, ఎందుకంటే అధికారం ఇప్పుడు మనదే ఉండదు..
భవిష్యత్తులో అధికారం వేరే పార్టీల చేతులు మారే అవకాశం ఉంది. అయినా ఇది సర్వ సహజమే
కానీ ఇక్కడే రెండు విషయాలు టిఆర్ఎస్ పార్టీ పెద్దలు, మేధావులు అర్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది .
1. ప్రజల ప్రశ్నించే గొంతుక ప్రతిపక్ష పార్టీ, అలాంటి నోరుకు సంకెళ్లు వేసి మాయం జేస్తే .. అదే ప్రజలు కళ్ళు
మూసుకొని కూర్చున్నారు, మరిఎదో రూపంలో అధికార ప్రభుత్వం
పై పోరాటకి సిద్ధం అవుతారు . అలాంటి
సమయాలు మన దేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో చాలా చాలా చూశాం.. అంత
వరకు ఎందుకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కూడా అలానే సాగింది .
2. జాతీయ పార్టీల పై పోరు కూడా అంత మంచిది కాదు. కాంగ్రెస్ పార్టీ
అధికారంలో ప్రస్తుతం లేకపోవచ్చును కానీ ఎదో రోజు తిరిగి అధికారంలోకి వస్తుంది .
అప్పుడు వారు గతాన్ని మర్చిపోరు ... అలాగే రాష్టంలో కాంగ్రెస్ పార్టీని బలహీనపరచడం
వాళ్ళ ఎంతో కొంత మరో జాతీయ పార్టీ బీజేపీ బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకు
ఉదాహరణ అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుతే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఏకగాను 12% శాతం ఓట్లు పెరిగి 19% పైగాను ఓట్లు
రావడం ఇందుకు ఒక పెద్ద ఉదాహరణ. ఇలాంటి సమయాలలో భవిష్యత్తులో టిఆర్ఎస్ పార్టీకి
రెండు జాతీయ పార్టీల నుండి గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది . అలాగే ఈరోజు టిఆర్ఎస్
పార్టీలోకి అధికారం కోసం, పదువులు కోసం వచ్చే వారందరూ కూడా టిఆర్ఎస్ పార్టీనే భవిష్యత్తులో ఉంటారు అనే నమ్మకం కూడా లేదు .
ఎందుకంటే వారు కేవలం ప్రజల కోసం , ప్రజల సమస్యల కోసం రాలేదు . ఆలా వస్తే
ఎన్నికల ముందు వచ్చి ఉండాలి కానీ ఆలా జరగలేదు ..
చివరాగాను ఈ
దేశంలో ఎవరు నూతన చట్టాలు ఏర్పాటు చేస్తారో వారు ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రజల గుండెల్లో
గూడు కట్టుకొని ఆదర్శగాను ఉంటారు .
మీ తాళ్లపెళ్లి సురేందర్ గౌడ్
No comments:
Post a Comment