ఒక మిత్రుడు అడిగాడు ఈసారి ఎన్నికల్లో మన ఓటు ఎవరికి వేద్దాము అని
దానికి సమాధానంగా నేను చెప్పాను, ఏమి ఆలోచించకుండా బిఆర్ఎస్, కెసిఆర్ గారి కారు గుర్తుకే అని.
దానికి బదులుగా నా మిత్రుడు నన్ను అడిగాడు, గతంలో రెండు సార్లు వారికే అవకాశం ఇచ్చాం ఈసారి మనం మార్చుకోవచ్చు కదా అని.
దానికి సమాధానం ఇలా చెప్పాను నా మిత్రుడికి, రాజశేఖర్ రెడ్డి కెసిఆర్ గారి లాంటి నాయకులు కాంగ్రెస్ లో కానీ బీజేపీలో కానీ ఉంటే వారికే వేసేవాళ్ళము.
మళ్లీ నా మిత్రుడు నన్ను అడిగాడు ఇలా, టిఆర్ఎస్ పార్టీతో అసలు తెలంగాణలో ఏమి మార్పు జరిగిందని, ముఖ్యంగా నీకేమి లాభం జరిగిందని, నువ్వు వారి ద్వారా చాలా నష్టపోయావు, వారిని మూడోసారి ఎన్నుకోవాలి అనుకుంటున్నావు నువ్వు అని, నా మిత్రుడు నన్ను అడిగాడు.
దానికి బదులుగా ఇలా నా మిత్రుడికి చెప్పాను నేను.
మొదటగా తనకి చెప్పాను నేను, నాకు జరిగిన లాభనష్టాల గురించి నేను ప్రస్తుతం ఆలోచించడం లేదు,కేవలం తెలంగాణ సమాజానికి మరీ ముఖ్యంగా రైతు సమాజానికి జరిగిన లాభాలను అభివృద్ధిని మాత్రమే ఆలోచిస్తున్నాను.
📌తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కొన్ని వ్యవస్థలో మార్పు జరిగింది అది మనం ఒప్పుకోవాల్సిందే.
📌 మొదటగా రైతులు, వ్యవసాయం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగక ముందు తెలంగాణ రాష్ట్రంలో కరెంటు కష్టాలు దాని ద్వారా రైతులు పడ్డ ఎన్నో రకాల ఆవేదనలు మనం మర్చిపోవద్దు, కరెంటు ఎప్పుడు వస్తుందో తెలవదు ఎన్ని గంటలు ఉంటుందో తెలవదు వస్తే నాణ్యమైన కరెంటు వస్తుందో రాదో తెలియదు దాని ద్వారా బాయ్ మోటర్లు ట్రాన్స్ఫార్మర్లు పదే పదే కాలిపోయేవి. ఇక అక్కడ సినిమా మొదలయ్యేది రైతులకి.. కరెంటు అధికారుల చుట్టూ నిరంతరం తిరిగే వాళ్ళు లంచాలు ఇచ్చేవారు, అయినా సరియైన సమయానికి ట్రాన్స్ఫార్మర్లు వచ్చేవి కాదు దానితో పంటలు ఎండిపోయేవి, ఈ కష్టాలు నేను తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిన చూడడం లేదు, రైతులు సంతోషంగా ఉన్నారు. ఇది ఏ రైతును అడిగినా చెబుతాడు.
📌 వ్యవసాయ నీటిపారుదల, మంచినీటి తాగునీరు సమస్య తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు జరగకముందు ఇది విపరీతంగా ఉండే ఇది అందరికీ తెలిసిందే. ఈ సమస్య తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 80% పైగా నెరవేరింది. గతంలో మంచినీళ్ల కోసం లైన్లో బిందెలతో నిలబడే వాళ్ళు, బాయిల కాడికి నీళ్ల బిందెలతో వెళ్లి నీళ్లు మోసుకుంటూ ఇండ్లకు వచ్చేవాళ్లు. ఇప్పుడు అలాంటి సమస్య లేదు, ప్రతి ఇంటికి మంచినీటి కొళాయి వచ్చాయి.
📌 గతంలో రైతులు పండించే పంటలకు పెట్టుబడి సహాయం ఉండేది కాదు, వడ్డీ వ్యాపారుల చేతిలో బ్యాంకర్ల చేతిలో మోసపోయి అప్పుల బాధతో రైతులు ఆత్మహత్యలు చేసుకునేవారు, నేడు ఆ సమస్య 85% పైగా నెరవేరింది, నేడు రైతుకి పెట్టుబడి సహాయం కింద రైతు బంధువు అందుతుంది, ఒకవేళ రైతు ఏ కారణంతో చనిపోయిన కూడా ఆ రైతు కుటుంబానికి రైతు బీమా పథకం అందుతుంది.
ఇక ఎన్నో మరి ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి ఇలా వివరించుకుంట పోతే బోలెడన్ని ఉన్నాయి, ఈ కార్యక్రమాలు ప్రస్తుత వేరే పార్టీలు నిర్వహిస్తాయని ప్రజలు నమ్మడం లేదు నేను కూడా నమ్మడం లేదు, ఎందుకంటే నడిపే నాయకుడు కావాలి ఆ నాయకుడు ఆ పార్టీలో కనబడడం లేదు,
అంతేకాదు భవిష్యత్తులో ప్రజలు మెచ్చే మరిన్ని ఆలోచనలతో అభివృద్ధి పథకాలు చేపడతారని నమ్ముతూ అందుకోసం ఈసారి కూడా నా ఓటు బిఆర్ఎస్ కే🚘🗳️✊
ఇట్లు
సురేందర్ తాళ్లపెళ్లి
No comments:
Post a Comment