Tuesday, November 12, 2024

సమస్య రైతుల భూముల లేదా ప్రతిపక్ష నాయకుల?మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి ఆ రైతులకు న్యాయం జరిగే విధంగా ఆలోచన చేయండి.

 వికారాబాద్ జిల్లా లగచర్లలో జరిగిన సంఘటన అత్యంత దురదృష్టకరం,ప్రభుత్వంలో ఎవరు ఉన్న రైతుల విషయంలో ప్రతిసారి జరిగేది అన్యాయమే,అభివృద్ధి పేరుతో అమాయక రైతుల భూములను లాక్కొని, కనీసం వారి భూములకి, భూ సేకరణ చట్టం ద్వారా ఇవ్వవలసిన నష్టపరియారాన్ని ఇవ్వకుండా,రైతుల వ్యక్తిగత అభిప్రాయాలను సరిగ్గా తీసుకోకుండా,తెలుసుకోకుండా..రైతుల మధ్యకు పోతే ఇలాంటి సంఘటనలే జరుగుతాయి,ఇలాంటి సంఘటనలే గతంలో కూడా మనం చూసాం,అప్పుడు ఆ రైతులకు మద్దతుగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు, మంత్రులు అప్పటి రాష్ట్రపతి గారికి లేఖలు రాశారు స్వయాన వెళ్లి కలిసారు కూడా, కొంతమంది ఇప్పటి మంత్రులు అయితే స్వయాన రైతుల తరపున కోర్టులో పోరాటాలు కూడా చేశారు.



నాకు ఇదే అర్థం కావడం లేదు,ప్రభుత్వాలు మారగానే ఆ ప్రభుత్వంలోకి మనం రాగానే ఎందుకు ఆ చట్టాలను ఆ పోరాటాలను మరిచిపోతాము,


ఆ రైతులు అడిగేది వారి పొలాలకు వారి భూములకు సరి అయిన పరిహారం ఇవ్వాలనే కదా మిమ్ములను అడిగేది,ఎందుకు వారికి ఇతర పార్టీలతో సంబంధాలు ఉన్నాయని బదనాం చేస్తున్నారు, ఒకవేళ ఉంటే తప్పేంటి..గతంలో మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా,సమస్య ఉన్న రైతులు ప్రతిపక్షాల దగ్గరికి వచ్చే కదా వారి బాధలను పంచుకున్నారు..అలా వచ్చిన రైతులను ఆరోజు ప్రభుత్వం కూడా అలానే బదనాం చేసింది!


నాకు ఇక్కడ అర్థం కాని విషయం,అక్కడ రైతుల సమస్య స్పష్టంగా కనబడుతుంది.అలాంటప్పుడు ఆ రైతులని ప్రభుత్వ అధికారులతో మంత్రులు ముఖ్యమంత్రులు వెళ్లి ఎందుకు కలవలేదు,వారి సమస్యలను ఎందుకు తెలుసుకోలేకపోయారు?


చివరికి కొంతమంది అధికారులను పంపి,రైతులను భయాందోళనకు గురిచేసి,ఆ రైతులు ఆవేశంతో కోపంతో ఆ అధికారుల మీద తిరగబడే విధంగా ఎందుకు ఈ దుస్థితికి తీసుకొచ్చారు?


ఇక్కడ తప్పు అధికారులది కాదు రైతులది కాదు,రైతులు చెప్పే కారణాలు సమస్యలు తెలుసుకోకుండా ఆ అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు నడపడానికి ఆలోచన చేసిన ప్రభుత్వాందే అవుతుంది!


దయచేసి ఈ విషయంలో ప్రభుత్వము మరోసారి ఆలోచన చేసి ఆ రైతులకి భూసేకరణ చట్టం ద్వారా పరిహారాన్ని చెల్లించి,ఆ రైతులకు న్యాయం చేసి..అభివృద్ధి కార్యక్రమానికి అడుగులు వేయండి🙏 


అంతేకానీ వారి భూములను కోల్పోతున్నామని ఆవేశంలో దాడులు చేసిన రైతులని జైల్లో పెడితే ఏమి లాభం ఉండదు, ఆ సంఘటన అత్యంత దురదృష్టకరమైన సంఘటన అలాంటి సంఘటనలు జరగవద్దు అని కోరుకుందాం👍..


CC: Telangana CMO Anumula Revanth Reddy Ponnam Prabhakar Mahesh Goud Bomma Prabhakar Ponnam Bandi Sanjay Kumar Kalvakuntla Taraka Rama Rao - KTR Dr Sravan Dasoju Rahul Gandhi Telangana Congress Uttam Kumar Reddy

No comments:

Post a Comment