Monday, February 17, 2025

రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉండే నాయకులే అంటున్నారు,బూతులే మా ఆయుధాలు,మా రక్షణ కవచాలు,మా రాజకీయ పదవులకు పునాదులు..రేపటి భవిష్యత్తుకు బలాలు అంటున్నారు!

 

"బూతులే బంగారు బాతులు" అనే వార్త ఆంధ్రజ్యోతిలో చదివాను,ఇలాంటి వార్త రాయడం అభినందించే విషయము..


మీరు రాసిన వార్త నూటికి నూరు శాతం నిజమే,ఈ విషయం మీద చాలా లోతుగా చర్చ జరగాలి!


కేవలం యూట్యూబ్ ఛానల్ లే కాదు,కొన్ని వార్తాపత్రికలు వార్తా ప్రసార మాధ్యమాలు కూడా ఇదే రీతిలో వ్యవహరిస్తున్నాయి..


కొందరు బూతులతో డబ్బులు సంపాదిస్తుంటే,మరికొందరు అబద్దాల వార్తలు నిజాలుగా రాసి కోట్లు సంపాదిస్తున్నారు,ఇది అందరికీ తెలిసిన విషయమే దీని లోతులోకి పోదలుచుకోలేను!


ఈ వార్త లోకి వస్తే, ఈ మధ్య ఒక పుస్తక విడుదల కార్యక్రమాల్లో స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారే మాట్లాడారు..బూతులు మాట్లాడడం తప్పే గాని అంటూ..బూతులు మాట్లాడలేకపోతే నేను రాజకీయాలు చేయలేను నా రాజకీయ జీవిత ఆట ఆడలేను అని మాట్లాడారు..!


నాకు తెలిసి ఇది అతి పెద్ద ప్రకటన రాజ్యాంగ పదవిలో ఉండి ఒక ముఖ్యమంత్రి గారు ఆ మాట మాట్లాడారు అంటే,అది చాలా పెద్ద విషయం,కానీ ఆ వార్త గురించి మరుసటి రోజు ఏ పత్రిక కూడా ప్రచురించలేదు!


అఫ్కోస్ ముఖ్యమంత్రి గారు అన్న విషయంలో అర్థం ఉంది,బూతు మాటలతో మాట్లాడకపోతే ప్రజలకి నా మాటలు ఎక్కవు నన్ను ఆదరించరు అనే విధంగా మాట్లాడారు తను..


బహుశా ప్రస్తుత యూట్యూబర్లు కూడా ఇవే దారిని అనుసరిస్తున్నారేమో,ఇక్కడ తప్పు ముఖ్యమంత్రి గారితో యూట్యూబర్లదో కాదు..


నూటికి నూరుపార్లు ప్రజలదే తప్పు అవుతుంది, ఒక నాయకుడు, ఒక యూట్యూబర్ఓ లేదంటే ఒక సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వ్యక్తి బూతులతో మాట్లాడినప్పుడు  లేదా పోస్ట్ పెట్టినప్పుడు..వారి వార్తలను వారి పోస్టులను ఆదరించినంత విధంగా. బూతులు లేకుండా అర్థవంతంగా రాసిన పోస్టులకు కానీ వీడియోలకు కానీ మాట్లాడిన మాటలకు కానీ ఈరోజు ప్రజలు పట్టించుకోవడం లేదు..


రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉండే నాయకులే అంటున్నారు,బూతులే మా ఆయుధాలు,మా రక్షణ కవచాలు,మా రాజకీయ పదవులకు పునాదులు..రేపటి భవిష్యత్తుకు బలాలు అంటున్నారు!


ఇక ఎలా మార్పు వస్తుంది, మనం ఈ మార్పుని ఎలా ఆశించాలి?


✍️మీ సురేందర్ తాళ్ళపల్లి.

No comments:

Post a Comment