Friday, February 9, 2024

ప్రజలే పాలకులు అవుతారు కానీ, పాలకులు ఎప్పుడూ ప్రజలు కాలేరు!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు చాలా కింది స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి వచ్చారు, అది అందరికీ సాధ్యం కాదు..

మీరు గతంలో ఎలాంటి పదజాలం వాడిన అది నడిచినది కానీ ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు, ఈ పదవిలో మీరు ఏమి మాట్లాడినా దాని ప్రభావం నాలుగున్నర కోట్ల ప్రజల మీద పడుతుంది, ముఖ్యంగా 60% పైగా ఉన్న యువత మీద పడుతుంది.. దయచేసి మిమ్ములను భవిష్యత్తు తరాలు గుర్తుపెట్టుకునేతట్లుగా మెలగండి..🙏

మీరు అన్నట్లు గుర్తులు ఆనవాళ్ళ గురించి, గత పాలకుల గుర్తులను, మీరు చెరిపేస్తే.. మీ గుర్తులను మీ ఆనవాళ్లను వచ్చే తరాలు కూడా చెరిపేస్తాయి అనే మాట మీరు మర్చిపోకండి (లోతుగా పోనవసరం లేదు ఎందుకంటే చరిత్ర పాఠాలు మనం చూస్తూనే ఉన్నాము).!

ఇక్కడ పాలకులు గుర్తుంచుకోవలసిన విషయం...పాలకులు ప్రజలకు స్వచ్ఛమైన పాలనను అందిస్తే, ఆ ప్రజలే వాళ్ల చరిత్రను లక్షల వేల సంవత్సరాలు అయినా వారి ఆనవాళ్లను, వారి గుర్తులను మరువరు, అంతేకాదు వారిని దేవుళ్ళు లాగా కొలుస్తారు..

అలాంటి వారి చరిత్ర ఆనవాలను తొలగించడానికి ఎన్ని విద్వాంసాలు చేసినా కూడా వారి చరిత్ర రెట్టింపు స్థాయిలో మళ్లీ తిరిగి వస్తుంది..అలాంటి ఫలితాలనే మనం చూస్తున్నాను..చూసినాము..చూడబోతున్నాము!

దానికి గొప్ప ఉదాహరణ :అయోధ్య శ్రీరాముడు, శ్రీకృష్ణుడు..🙏

. . మీ సురేందర్

Tuesday, November 14, 2023

ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కాంగ్రెస్ ముఖ్యమంత్రికి తేడాలు ఇవే!

కొంతమంది మిత్రులు గమ్మతిగా విమర్శిస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని

విమర్శ :ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రజలకి కలిసే అవకాశం ఇవ్వరు, ఎవ్వరికి అందుబాటులో ఉండరు అని, అలాగే కాంగ్రెస్ పాలనలో ముఖ్యమంత్రులు ప్రజలకు అందుబాటులో ఉండేవారు అని.


వారికి నా సమాధానం :


మీరు చెప్పింది నిజమే రాజశేఖర్ రెడ్డి గారి పాలనలో ఇలా జరిగేది. నాకు బాగా గుర్తు, కానీ మీకు ఎంతవరకు అవగాహన ఉందో లేదో నాకు తెలవదు.


ఆ సమయంలో వారిని కలిసిన సామాన్యుల, వారి సమస్యలు ఏంటో మీకు తెలుసా కనీసం, ఆ రోజుల్లో 200, 250రూపాయల పింఛన్ ఇస్తే, పింఛన్ డబ్బులు కూడా రాకపోయేవి. పింఛన్ అప్లై చేసుకుంటే అప్లై కూడా కాక పోయేది. వాటికి కూడా లంచాలు అడిగే వారు వాటిపై విన్నపం ఇవ్వడం కోసము వాటిని పరిష్కరించాలని విజ్ఞప్తి కోసం వచ్చేవారు,


రెండోది ఆ కాలంలో రైతులకు విపరీతమైన కరెంటు సమస్య ఉండేది కరెంటు వస్తే కరెంటు మోటర్లు విపరీతంగా కాలేవి, నూతన వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్స్ కావాలంటే ఇంజనీర్లకు లంచాలు ఇచ్చే అంతవరకు వచ్చేవి కావు, వాటి కోసం రైతులు తలా ఇంత పైసలు వేసుకుని వారికి ఇచ్చేవారు. అలాంటి సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి కోసం వెళ్లేవారు.


ఇక మంచినీళ్ల సమస్యలు, నీళ్ల కోసం ఆడవాళ్లు బిందెలు పట్టుకొని బాయిల దగ్గరికి కిలోమీటర్లు ప్రయాణించి నీళ్లు తెచ్చుకునేవారు. అలాగే ఒకవేళ అందుబాటులో ఉన్న కొళాయిలు ఉంటే వాటి ముందు వందల కొద్ది మహిళలు బిందెలు పట్టుకొని ఉండేవారు,ఆ కుళాయిల నుండి మంచినీళ్లు వచ్చేది కాదు, ఇలాంటి సమస్యలు పరిష్కరించాలని ఆ రోజు ముఖ్యమంత్రిని కలిసేవారు. 


ఇక ఇలాంటి లెక్కలు ఎన్నో ఉండేవి. ఇలాంటి సమస్యలు ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఉన్నాయి చెప్పండి?


ఇలాంటి సమయంలో తెలంగాణ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను పేద ప్రజలకు అందిస్తున్నాయి. సమయాన్ని బట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రజల సమస్యలు తెలుసుకుంటూనే ఉన్నారు, వారిని వ్యక్తిగతంగా కలుస్తూనే ఉన్నారు అధికారులతోటి ఎప్పటికప్పుడు రివ్యూ మీటింగ్ల ద్వారా ప్రజలకు దగ్గర అవుతూనే ఉన్నారు, ప్రజలకు కావలసిన సంక్షేమ పథకాలు అందిస్తూనే ఉన్నారు. ఇలాంటి సమయంలో ఇవన్నీ గమనించకుండా విష ప్రచారం చేయడం సరి అయింది కాదు. 


కాంగ్రెస్ పార్టీ అంటేనే కమిషన్ల పార్టీ ఇది అందరికి తెలిసిందే 60 ఏళ్ల పాలనలో ఏం చేసిందో అందరికీ కూడా తెలుసు, మీరు 9 ఏళ్ల పాలనను 60 ఏళ్ల పాలనతో పోల్చుతున్నారు, కానీ ప్రస్తుతం 60 ఏళ్లలో జరగని అభివృద్ధి కేవలం 9 ఏళ్లలో జరిగింది ఆ లెక్కలు ఒకసారి చూడండి.

ఆలోచించి ఓటు వేయండి, ఆవేశంతో కాదు.


      మీ మిత్రుడు

 సురేందర్ తాళ్ళపల్లి

Saturday, November 4, 2023

తెలంగాణ సమాజానికి కెసిఆర్ ఒక నమ్మకం - భరోసా కలిగించే రాజశేఖర్ రెడ్డి, కెసిఆర్ లాంటి నాయకులు ఆ పార్టీలలో ప్రస్తుతం లేరు!

 ఒక మిత్రుడు అడిగాడు ఈసారి ఎన్నికల్లో మన ఓటు ఎవరికి వేద్దాము అని

దానికి సమాధానంగా నేను చెప్పాను, ఏమి ఆలోచించకుండా బిఆర్ఎస్, కెసిఆర్ గారి కారు గుర్తుకే అని.



దానికి బదులుగా నా మిత్రుడు నన్ను అడిగాడు, గతంలో రెండు సార్లు వారికే అవకాశం ఇచ్చాం ఈసారి మనం మార్చుకోవచ్చు కదా అని.

దానికి సమాధానం ఇలా చెప్పాను నా మిత్రుడికి, రాజశేఖర్ రెడ్డి కెసిఆర్ గారి లాంటి నాయకులు  కాంగ్రెస్ లో కానీ బీజేపీలో కానీ ఉంటే వారికే వేసేవాళ్ళము. 

మళ్లీ నా మిత్రుడు నన్ను అడిగాడు ఇలా, టిఆర్ఎస్ పార్టీతో అసలు తెలంగాణలో ఏమి మార్పు జరిగిందని, ముఖ్యంగా నీకేమి లాభం జరిగిందని, నువ్వు వారి ద్వారా చాలా నష్టపోయావు, వారిని మూడోసారి ఎన్నుకోవాలి అనుకుంటున్నావు నువ్వు అని, నా మిత్రుడు నన్ను అడిగాడు. 

దానికి బదులుగా ఇలా నా మిత్రుడికి చెప్పాను నేను. 

మొదటగా తనకి చెప్పాను నేను, నాకు జరిగిన లాభనష్టాల గురించి నేను ప్రస్తుతం ఆలోచించడం లేదు,కేవలం తెలంగాణ సమాజానికి మరీ ముఖ్యంగా రైతు సమాజానికి జరిగిన లాభాలను అభివృద్ధిని మాత్రమే ఆలోచిస్తున్నాను. 

📌తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కొన్ని వ్యవస్థలో మార్పు జరిగింది అది మనం ఒప్పుకోవాల్సిందే. 

📌 మొదటగా రైతులు, వ్యవసాయం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగక ముందు తెలంగాణ రాష్ట్రంలో కరెంటు కష్టాలు దాని ద్వారా రైతులు పడ్డ ఎన్నో రకాల ఆవేదనలు మనం మర్చిపోవద్దు, కరెంటు ఎప్పుడు వస్తుందో తెలవదు ఎన్ని గంటలు ఉంటుందో తెలవదు వస్తే నాణ్యమైన కరెంటు వస్తుందో రాదో తెలియదు దాని ద్వారా బాయ్ మోటర్లు ట్రాన్స్ఫార్మర్లు పదే పదే కాలిపోయేవి. ఇక అక్కడ సినిమా మొదలయ్యేది రైతులకి.. కరెంటు అధికారుల చుట్టూ నిరంతరం తిరిగే వాళ్ళు లంచాలు ఇచ్చేవారు, అయినా సరియైన సమయానికి ట్రాన్స్ఫార్మర్లు వచ్చేవి కాదు దానితో పంటలు ఎండిపోయేవి, ఈ కష్టాలు నేను తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిన చూడడం లేదు, రైతులు సంతోషంగా ఉన్నారు. ఇది ఏ రైతును అడిగినా చెబుతాడు.

📌 వ్యవసాయ నీటిపారుదల, మంచినీటి తాగునీరు సమస్య తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు జరగకముందు ఇది విపరీతంగా ఉండే ఇది అందరికీ తెలిసిందే. ఈ సమస్య తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 80% పైగా నెరవేరింది. గతంలో మంచినీళ్ల కోసం లైన్లో బిందెలతో నిలబడే వాళ్ళు, బాయిల కాడికి నీళ్ల బిందెలతో వెళ్లి నీళ్లు మోసుకుంటూ ఇండ్లకు వచ్చేవాళ్లు. ఇప్పుడు అలాంటి సమస్య లేదు, ప్రతి ఇంటికి మంచినీటి కొళాయి వచ్చాయి.

📌 గతంలో రైతులు పండించే పంటలకు పెట్టుబడి సహాయం ఉండేది కాదు, వడ్డీ వ్యాపారుల చేతిలో బ్యాంకర్ల చేతిలో మోసపోయి అప్పుల బాధతో రైతులు ఆత్మహత్యలు చేసుకునేవారు, నేడు ఆ సమస్య 85% పైగా నెరవేరింది, నేడు రైతుకి పెట్టుబడి సహాయం కింద రైతు బంధువు అందుతుంది, ఒకవేళ రైతు ఏ కారణంతో చనిపోయిన కూడా ఆ రైతు కుటుంబానికి రైతు బీమా పథకం అందుతుంది. 

ఇక ఎన్నో మరి ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి ఇలా వివరించుకుంట పోతే బోలెడన్ని ఉన్నాయి, ఈ కార్యక్రమాలు ప్రస్తుత వేరే పార్టీలు నిర్వహిస్తాయని ప్రజలు నమ్మడం లేదు నేను కూడా నమ్మడం లేదు, ఎందుకంటే నడిపే నాయకుడు కావాలి ఆ నాయకుడు ఆ పార్టీలో కనబడడం లేదు,

అంతేకాదు భవిష్యత్తులో ప్రజలు మెచ్చే మరిన్ని ఆలోచనలతో అభివృద్ధి పథకాలు చేపడతారని నమ్ముతూ అందుకోసం ఈసారి కూడా నా ఓటు బిఆర్ఎస్ కే🚘🗳️✊

ఇట్లు

సురేందర్ తాళ్లపెళ్లి

Saturday, August 5, 2023

స్నేహితులు దినోత్సవం రోజు, ప్రతి స్నేహితులు తెలుసుకోవలసిన గొప్ప స్నేహితుల బంధ చరిత్ర

 స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు💐💐🙏


ప్రతి స్నేహితుడు ప్రతి స్నేహితులు ఈ కథ చదవాలి, స్నేహబంధం ఎంత గొప్పదో ఈ చరిత్ర తెలుపుతుంది. 


*నేను చరిత్ర లో చదివిన అత్యంత గొప్ప మిత్రులు.*


👉 *కృష్ణ-కుచేలుడు*

👉 *కర్ణుడు-దుర్యోధనుడు.*

కృష్ణుడు-కుచేలుడు యాదవ రాజ్యం లో ఆడుకున్నవాడు. తరువాత కృష్ణుడు రారాజయినా, కుచేలుని మనసారా ఆదరించాడు. ‘కొత్తగా అధికారము, ధనమూ వచ్చాయని పాత స్నేహితులని మర్చిపోవద్దు’ అన్నది నీతి..!

*ఎంత కష్ట కాలం లో ఐనా ఒకరినొకరు స్నేహానికి విలువ ఇచ్చిన వారు కర్ణుడు-దుర్యోధనుడు.*

*స్నేహానికి ప్రాణమిచ్చిన కర్ణుడు*

అమ్మా నాన్నలు, బంధవుల్ని దేవుడే సృష్టించి స్నేహితులను మాత్రం ఎంపికచేసుకునే అవకాశం మనకే ఇచ్చాడు. అమ్మ అనే పదం తర్వాత ఆత్మీయతను ధ్వనింపజేసే మాట స్నేహం. స్నేహం అనేది ఆ దేవుడిచ్చిన గొప్ప వరం. మంచి స్నేహాతుడిని సంపాదించుకుని భద్రంగా కాపాడుకుంటే వారు జీవితాంతం సంతోషంగా ఉంచుతారు. మనలా ఆలోచించి, గురువులా బోధించి, తప్పు చేసినప్పుడు మందిలించే వ్యక్తి నిజమైన స్నేహితుడు. మంచి స్నేహితుల మధ్య ఎలాంటి మొహమాటాలు, రహస్యాలు ఉండవు. కష్టంలో కలత చెందిన మనసుకి వెన్నలా చల్లదనాన్ని, ప్రశాంతతను కలిగించే దివ్యౌషధం స్నేహం.

*మహాభారతంలోనూ కర్ణ, దుర్యోధనల చెలిమి నేటికీ ఆదర్శం.* 

తనను గౌరవించిన దుర్యోధనుడి వెంట మరణం వరకు ఉన్న కర్ణుడు...స్నేహం కోసం ధర్మాన్ని ఎదరించి, తన ప్రాణాలను వదిలాడు. కురుక్షేత్ర సంగ్రామం జరుగుతున్న ఒకనాటి రాత్రి శ్రీకృష్ణ పరమాత్మ కర్ణుడి శిబిరానికి వచ్చాడు. కర్ణా... అని పిలవగానే కృష్ణుడి గొంతు విని వడివడిగా వచ్చి కర్ణుడు నమస్కరించాడు. ‘కృష్ణా... ఏమిటి ఇంత రాత్రి వేళ ఈ రాక’ అన్నాడు. కర్ణుడికి జన్మ వృత్తాంతం చెప్పి పాండవుల పక్షంలోకి రమ్మని శ్రీకృష్ణుడు కోరుతాడు. దీనికి కర్ణుడు చిన్నగా నవ్వి కృష్ణా, నేనెవరన్నదీ నాకు తెలుసు. కురుక్షేత్ర సంగ్రామంలో గెలుపొందేది పాండవులే. ధర్మం పాండవుల పక్షాన ఉంది కనుకనే నువ్వు పాండవుల పక్షాన చేరి ధర్మ సంరక్షణ చేస్తున్నావు. అధర్మ వర్తనులైన కౌరవులు ఎన్నటికీ గెలవరు. ఆ విషయం నాకూ తెలుసు అన్నాడు.


ఇంత తెలిసినవాడివి పాండవుల పక్షాన ఎందుకు చేరడం లేదని శ్రీకృష్ణుడు ప్రశ్నించాడు. అందుకు కర్ణుడు... *దుర్యోధనుడు నన్ను నమ్ముకునే పాండవులతో యుద్ధానికి సిద్ధపడ్డాడు. నన్ను నమ్మిన దుర్యోధనుడిని ఒంటరిని చేసి పాండవులతో చేరడం మిత్రద్రోహం అనిపించుకోదా? నిజమైన స్నేహితునిగా నేను ఉండాలనుకుంటున్నానని తెలిపాడు. తన జన్మ గురించి తెలిసినా, స్నేహితుడిని విడిచి వెళ్లక అతడికి ధైర్యం నూరిపోసిన ధీశాలి కర్ణుడు. స్నేహానికి ప్రతిరూపం అతడు.*


ఇక కృష్ణ, కుచేలుర మైత్రి అపురూపమైంది. సాందీప మహర్షి ఆశ్రమంలో కృష్ణ, కుచేలురు కలసి విద్యాభ్యాసం చేశారు. ఆ సమయంలో ఇరువురి మధ్య స్నేహం కుదరింది. విద్యాభ్యాస కాలమంతా కలసి ఉన్న కృష్ణ, కుచేలురు తర్వాత విడిపోయారు. అధిక సంతానంతో ఎన్నో బాధలను అనుభవిస్తున్న కుచేలుడు పిల్లలకు కడుపునిండా భోజనం కూడా పెట్టలేకపోతున్నాడు. అలాంటి సమయంలో కుచేలునికి శ్రీకృష్ణుడు జ్ఞప్తికి వచ్చాడు. శ్రీకృష్ణుని కలసి తన పరిస్థితిని వివరిస్తే అతడు దయచూపుతాడని భావించిన కుచేలుడు కలవాలని నిర్ణయించుకున్నాడు. బంధువుల, స్నేహితులను చూడటానికి వెళ్లేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్లకూడదని అంటారు. మరి కృష్ణుని వద్దకు ఎలా వెళ్లాలి అని తర్జన భర్జన పడి కొన్ని అటుకులను మూటగా కట్టుకుని ద్వారకకు బయలుదేరాడు.


కుచేలుడు కృష్ణ మందిరంలోకి ప్రవేశించగానే సాదరంగా ఆహ్వానించి ఉచితాసనంపై కూర్చుండబెట్టి కుశలమడిగాడు. ‘మిత్రమా! చాలా రోజులకు కలుసుకున్నాం కదా. ఈ స్నేహితునికి తినడానికి ఏమైనా తెచ్చావా?’ అని అన్నాడు. కృష్ణుడు అలా అడిగేసరికి కుచేలుడు సిగ్గుపడి ఏ సమాధానం చెప్పకుండా చేష్టలుడిగిపోయాడు. కృష్ణుడే అటుకుల మూటను చూసి అడిగాడు. కుచేలుడు వాటిని ఇచ్చాడు. కృష్ణుడు వాటిని తినగానే తను, తన కుటుంబం ఎంతగా బాధపడుతున్నదీ చెప్పకుండానే కుచేలుడు తిరుగుముఖం పట్టాడు. సర్వం తెలిసిన పరమాత్ముడు కుచేలుడిని ఐశ్వర్యవంతుడిని చేశాడు. ఇలాంటి నిస్వార్థ స్నేహమే కలకాలం నిలుస్తుంది. ఎవరైనా సరే కృష్ణ, కర్ణులను ఆదర్శగా తీసుకుని స్నేహం చెయ్యాలి.


*మంచి స్నేహం వ్యక్తి వికాసానికి బాటలు వేస్తుంది. మిత్రుడు తోడుంటే ఆయుధం ధరించినంత ధైర్యంగా ఉంటుంది. ప్రతి వ్యక్తి జీవితంలోను విలువైన స్నేహాన్ని జీవితాంతం నిలుపుకునే ప్రయత్నం చేయాలి. స్నేహానికన్నా మిన్నా లోకాన లేదురా... ఆ విలువైన బంధాన్ని అపురూపంగా కాపాడుకోవాలి.*

Saturday, July 29, 2023

ప్రకృతి విపత్తు వర్షాలు, వరదలతో కూడా రాజకీయమా? వరద బాధిత ప్రజలకు సహాయం చేయండి ఆ తర్వాత మీ రాజకీయాలు చేయండి.

 పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి పనులు చూస్తే, అచ్చం మహాభారతంలో పౌండ్రక వాసుదేవుడు, శ్రీకృష్ణ పరమాత్మ మధ్య జరిగిన సంఘటనలు గుర్తుకొస్తున్నాయి,

రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనంత విధంగా విపరీతమైన వర్షాలు, వరదలు వచ్చాయి. దీనికి సంబంధిత సాక్షాలు అందరి కండ్ల ముందు కనిపిస్తున్నాయి, ఒకవేళ కనిపించని వారు భారత వాతావరణ శాఖ దగ్గర వివరాలను తీసుకుని చూడవచ్చు.

సామాన్యంగా వరదలు, వర్షాలు వచ్చినప్పుడు నాయకులు చేయవలసిన పని, ప్రజలకు ధైర్యాన్ని కల్పించి, వారికి తోచిన స్థాయిలో ఆహారం, నిత్యవసర వస్తువులు కల్పించి వారికి తోడు నిలవాలి, అది నాయకుడి యొక్క ప్రథమ లక్షణం.

అంతేకానీ వర్షం వెలవగానే మొదటి రోజు నుండే ప్రభుత్వంపై ధర్నాలు చెయ్యడం ఏంటి?

ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో తప్పులేదు కానీ ఈ సమస్య ప్రభుత్వం ద్వారా జరగలేదు. ప్రకృతి విపత్తు నుండి జరిగింది, ఈ సమయంలో ప్రతిపక్ష పార్టీ సమన్వయం వహించి, బాధిత ప్రజలకు తోడు నిలిచి, ప్రభుత్వం వరద అంచనా వేసిన తర్వాత. బాధితులకు సరియైన స్థాయిలో నష్టపరిహారాన్ని ఇవ్వకుంటే, అప్పుడు ప్రభుత్వంపై బాధిత ప్రజల తరఫున పోరాడాలి, ధర్నాలు చేయాలి. ఇది ఒక పద్ధతి, ఇది మరిచి పోయి, అంగడి అంగడి ఆగమాగం చేస్తే ఎలా?

ఈ వర్షాల గురించి ఈ వరదల గురించి ప్రజలకు, గ్రామీణ ప్రజలకు సరియైన స్థాయిలో అవగాహన ఉంది, మీరు వరదలు వచ్చినా గ్రామాలలోకి వెళ్లి అడగండి. వారి చెప్పారు, ఇలాంటి వర్షాలు ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చాయో,


ఇలాంటి రాజకీయాలు చేస్తే కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఓట్లు కూడా రాకుండా పోతాయి. 🙏😊మనం ప్రజల మనసులను దోచుకునే పనులు చేయాలి అంతేకానీ ప్రజలను గందరగోళంలోకి నెట్టకూడదు.

శ్రీయుత గౌరవనీయులైన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, తెలంగాణ ముఖ్యమంత్రి గారికి నమస్కరించి రాయునది ఏమనగా.





Saturday, July 15, 2023

ప్రమాదంలో తెలంగాణ కాంగ్రెస్ - బూతు మాటలకి ఓట్లు రాలవు

 ప్రమాదంలో తెలంగాణ కాంగ్రెస్

అధికారం కోల్పోయి తొమ్మిది సంవత్సరాలు అవుతూ, ఈసారి ఎలాగైనా కాంగ్రెస్ని అధికారంలో తీసుకురావాలన్న కాంగ్రెస్ కార్యకర్తల ఆశలు మరో మారు అడియాశలు అవుతున్నాయి.

రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర నూతన శక్తిని ధైర్యాన్ని కల్పించిన, కర్ణాటక విజయం నూతన ఉత్తేజాన్ని నింపిన, ఎన్నిసార్లు కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు గీతోపదేశం చేసిన మారినట్టే మారి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ని మళ్లీ అదే స్థాయికి నింపుతున్నారు ఇక్కడి నాయకులు.

అధికార పార్టీ ఎప్పటికప్పుడు వ్యూహాలు రచించుతుంటే, వారి వ్యూహంలో తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు బందీలు అవుతున్నారు, ఒక పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆచి చూసి అడుగులు వేయాలి, ఆలోచించి మాట్లాడాలి, అందర్నీ కలుపుకపోయి స్పందించాలి.

కానీ ఇది కనిపించడం లేదు కాంగ్రెస్ పార్టీలో, మరీ ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ అధినాయకుడు విషయంలో స్పష్టంగా కనబడుతుంది, ఒక విషయం గురించి ఒక పాలసీ గురించి మాట్లాడినప్పుడు వివరాత్మకంగా విషయబద్ధంగా ప్రజలకు నొప్పి కలగకుండా మాట్లాడాలి, అలాగే అధికార పార్టీ వారు కానీ ఇతరులు కానీ విమర్శలు చేసినప్పుడు వాటికి వివరాత్మకంగా స్పందించాలి.

కానీ కాంగ్రెస్ తెలంగాణ అధినాయకుడు మాత్రం అలా స్పందించడం లేదు, ఏ విషయాన్ని వివరించిన బూతు పురాణమే ఆధారం అన్నట్టుగా, బూతే నా భవిష్యత్తు అన్నట్టుగా, ఏమి మాట్లాడినా బూతులతోనే సమాధానం చెప్పడం సరికాదు, కొన్నిసార్లు ఆ బూతులకి ప్రజలు ఆకర్షితులు కావచ్చు కానీ చివరకు ఆ బూతు మాటలు ఎన్నికల్లో ఓట్లుగా మారలేవు ఆ విషయం అర్థం చేసుకుంటే కాంగ్రెస్ బాగుపడుతుంది, కాంగ్రెస్ కార్యకర్తల కల నెరవేరుతుంది.



ఒక్క విషయం కాంగ్రెస్ నాయకులు గుర్తుపెట్టుకోవాలి, రాజకీయాల్లో విమర్శలు సద్విమర్శలు అనేది సహజం, ఇలాంటివి ఎదురుపడినప్పుడు జాగ్రత్తగా స్పందించాలి, అంతేకానీ మాట్లాడిన వారిపై వ్యక్తిగత దాడులు, వారి వ్యక్తిగత సైన్యంతో బూతులు మాట్లాడిస్తూ చౌకబార రాజకీయాలుగా మార్చుతున్నారు. ఈ పద్ధతి కేవలం అధికార పార్టీ వారిపైనే కాదు సొంత పార్టీ వారిపై కూడా గతంలో కొనసాగించారు ఈ విషయం అందరికీ తెలిసిందే.

ఇలాంటి సమయంలో ప్రజలు కాంగ్రెస్ వైపు ఎలా చూస్తారో మీరే ఆలోచించండి.ఇది ఒక ఎత్తు అయితే.


మరో అతిపెద్ద ప్రమాదం కాంగ్రెస్ కి దగ్గర్లో ఉంది.

అదే తెలంగాణ కాంగ్రెస్ నుండి పుట్టిన మరో కాంగ్రెస్ పార్టీ, మాజీ కేంద్రమంత్రి పుంజాల శివశంకర్ గారి తనయుడు పుంజాల వినయ్ కుమార్ వారి సారథ్యంలో సామాజిక విలువలతో పురుడు పోసుకున్న పార్టీ "తెలంగాణ సమాజ కాంగ్రెస్ పార్టీ".

ఈ పార్టీతో కాంగ్రెస్కి నూటికి నూరు శాతం నష్టం జరగబోతుంది, అది ఎలాగా అంటే కాంగ్రెస్ అంటేనే ఆధిపత్య కులాల, ఒక కులానికి పేటెంట్ గా అన్నట్టుగా మార్చేశారు, ఇదే ఆవేదన ఆ పార్టీలో ఉన్న బలహీన వర్గాల నాయకులు పదేపదే ప్రశ్నించి బయటికి వచ్చారు, మరికొందరు ఆ పార్టీలోనే ఇంకా పోరాడుతూనే ఉన్నారు (వారి జాబితాలో బట్టి విక్రమార్క గారు, హనుమంతరావు గారు, పొన్నాల లక్ష్మయ్య గారు, మధుయాష్కి గారు, పొన్నం ప్రభాకర్ గారు మరి ఇలా చాలామంది) పార్టీలో ఉన్న నాయకులకే సామాజిక న్యాయం లేదు అలాంటిది వారు ప్రజలకు ఏమి సామాజిక న్యాయం చేస్తారనేది ప్రశ్న.


ఇలాంటి సందేహాల నుండి పుట్టినదే తెలంగాణ సమాజ కాంగ్రెస్ పార్టీ. 


రేపు జరగబోయే ఎన్నికల్లో, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ  టికెట్ల పంపకాల విషయంలో కానీ సామాజిక న్యాయం విషయంలో కానీ అన్యాయం జరిగినట్లయితే, కాంగ్రెస్ బడుగు బలహీన వర్గాల నాయకులు, యువ నాయకులు, కార్యకర్తలు ఈ పార్టీ వైపు చూసే అవకాశం మెరుగుగా ఉంది. ఇది ఒక బలమైన అంచనా. అలాగే బడుగు బలహీన వర్గాల ప్రజలు కూడా కాంగ్రెస్ విషయంలో పెద్దగా ఆసక్తి చూపడం లేదు, ఈ సమయంలో ఈ పార్టీ గనుక ప్రజల్లోకి బలంగా వెళ్ళినట్లయితే కాంగ్రెస్కి భారీ నష్టం కలగవచ్చు.


అలాగే తెలంగాణ సమాజ కాంగ్రెస్ పార్టీ వారి పార్టీ సిద్ధాంతాలు బడుగు బలహీన వర్గాల ప్రజలకు మరియు ఇతర ప్రజలకు వివరాత్మకంగా న్యాయబద్ధంగా ఉన్నాయి, అలాగే వారి ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా బీసీ నాయకుడని ప్రకటించారు. మరెన్నో మార్పులు చూడబోతున్నాం. ఇలాంటి అంశాలు అన్నీ కాంగ్రెస్ పార్టీని పద్మవ్యూహంలో బంధిస్తున్నాయి.

చివరగా రాష్ట్ర కాంగ్రెస్ అధినాయకులు ఆలోచనలు,బూతు పురాణాలు మాని కాంగ్రెస్ కార్యకర్తలకి బలాన్ని నింపాలని, అధికారం కోసం న్యాయబద్ధమైన చర్చలు చేస్తూ అధికారంలో రావాలని ఆశిస్తూ. 🙏

Saturday, June 10, 2023

సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ధరణిని సరిగ్గా సరి చేస్తే, దేశ వ్యవసాయ రంగంలో ఒక టెక్నాలజీ రెవల్యూషన్

ఒక వ్యవస్థను నూతనంగా ఏర్పాటు చేసినప్పుడు దానిలో కొన్ని లోపాలు సహజం, లోపాల కారణంగా ఆ వ్యవస్థను పూర్తిగా  తొలగించాలని అనడం మూర్ఖత్వం.

మన దేశంలో సైన్స్ మరియు టెక్నాలజీ రివల్యూషన్ని మొదలుపెట్టింది మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారు, దాని కారణంగానే వారిని భారత సమాచార సాంకేతికత & టెలికాం విప్లవానికి పితామహుడుగా పీల్చుకుంటాం.

 

భారతదేశంలో కంప్యూటర్‌, టెక్నాలజీ వ్యవస్థ ప్రవేశపెట్టడం ద్వారా సాంకేతిక యుగాన్ని తీసుకురావాలనే ఆయన దార్శనికత నేడు దేశాభివృద్ధికి దోహదపడుతున్నాయి. నాడు రాజీవ్ గాంధీ గారు ప్రవేశపెట్టిన వ్యవస్థలో కూడా కొన్ని లోపాలు ఉండవచ్చు కానీ నాడు వ్యవస్థని రద్దు చేయలేదు, లోపాలను సరిచేసి వ్యవస్థను ముందుకు నడిపించడం ద్వారా ఈరోజు దేశ అభివృద్ధిలో వారి నాటి ఆలోచనలు దేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళుతున్నాయి. ఇది మీరు సత్యం కాదని చెప్పగలరా?

అలాంటి ఆశయాలతోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, తెలంగాణ రాష్ట్రంలో రైతులు పడుతున్న కష్టాలను కొంతమంది అవినీతి అధికారుల నుంచి దళారి వ్యవస్థ నుంచి రైతులకు విముక్తి కలిగించాలని ఆలోచనతో, ఒక నూతన సాంకేతిక విధానాన్ని ప్రవేశపెట్టి దానిద్వారా రైతులకు మంచి చేయాలని దృఢ సంకల్పంతో ధరణి లాంటి వ్యవస్థను తీసుకువచ్చారు.

 

దాని ద్వారా రైతులకు లాభం జరిగింది, జరుగుతుంది అనేది వాస్తవం, ఒక వ్యవస్థను సృష్టించినప్పుడు వాటిలో కొన్ని లోపాలు దొరలడం అనేది సహజం.  దానిని అందరూ ఆమోదించవలసిందే, అలాగే ధరణి వ్యవస్థలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయనేది వాస్తవం. వ్యవస్థ అనేది ఒక నిరంతర ప్రక్రియ, ప్రక్రియలో లోపాలను కూడా ప్రభుత్వం సరిచేస్తుంది, సరిచేయాలనేది మనం వాదించాలి అంతేకానీ తొలగించాలని కాదు.

 

 

నిజానికి ధరణి పోర్టల్ అనేది ఒక అద్భుతమైన ఆన్లైన్ వ్యవస్థ, వందల వేల రోజులు జరగవలసిన పనులు కేవలం నిమిషాల్లో జరిగిపోతున్నాయి, ఒక ఆన్లైన్ వ్యవస్థను సృష్టించినప్పుడు దానిలో కొన్ని లోపాలు అనేది సహజం, అదే మాదిరిగా ధరణిలో కూడా వాటిని సరిచేసి ప్రభుత్వ అధికారులు సక్రమంగా పనిచేస్తే ధరణి ఒక సూపర్ స్పీడ్ సూపర్ మాన్ ప్రభుత్వ అధికారి అవుతుంది కానీ అది చేయడంలో ప్రభుత్వం కొద్దిగా విఫలమైందని చెప్పవచ్చును.


విషయంలో ప్రభుత్వం గమనించాలి & ఆలోచించాలి :-

అది సరి చేయడం ప్రభుత్వానికి పెద్ద సమస్య కాదు, ప్రభుత్వం గమనించవలసిన ముఖ్య విషయం ఏమిటంటే, ఒక ఆన్లైన్ వ్యవస్థ ఏర్పాటు చేసినప్పుడు వ్యవస్థలో పనిచేసే ప్రభుత్వ అధికారులు, వ్యవస్థపై పట్టు ఉండాలి కానీ నేడు వ్యవస్థలో పనిచేస్తున్న ప్రభుత్వ అధికారులను చూసినట్లయితే అది కనబడడం లేదు.

అది ఎలాగా అంటే ఒక ఎమ్మార్వో కానీ ఇతర సంబంధిత అధికారులు కానీ భూములు వాటికి సంబంధించిన రికార్డుల పట్ల వారికి అవగాహన ఉండవచ్చు కానీ వారిలో చాలామందికి టెక్నాలజీ పట్ల వాటిని ఉపయోగించడం పట్ల అవగాహన లేదు, దాని కారణంగానే కిందిస్థాయిలో కొన్ని లోపాలు ఏర్పడుతున్నాయి.


చాలా చోట్ల ఎమ్మార్వోలు చేయవలసిన పనులు వారి కింది స్థాయి వ్యక్తులు చేస్తున్నారు, ఇక్కడే అవినీతికి అడుగులు పడుతున్నాయి.  ఇదే నేటి రైతుల పాలిట శాపంగా మారుతుంది, దీనిలో ధరణి పోర్టల్ వ్యవస్థ లోపం లేదు కానీ వ్యవస్థ నడిపే అధికారుల్లో లోపం ఉంది . 

మరో ముఖ్య విషయం ప్రభుత్వం గమనించాలి, ఆలోచించాలి . అదేంటంటే ప్రభుత్వం ఒక ఆన్లైన్ వ్యవస్థను ఏర్పాటు చేసినప్పుడు వ్యవస్థను ఏర్పాటు చేయడం కోసం ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పినప్పుడు, ప్రవేట్ వ్యవస్థతో సమబద్ధంగా ప్రభుత్వ వ్యవస్థ కూడా నడిపించాలి.

అది ఎలాగా అంటే ధరణి ఏర్పాటు చేయడం కోసం ఒక ప్రైవేట్ సంస్థకు  డెవలప్మెంట్ కు హక్కులు ఇచ్చినప్పుడు, సమాంతరంగా ప్రభుత్వం కూడా అలాంటి వ్యవస్థను ప్రభుత్వంలో కూడా ఏర్పాటు చేసుకోవాలి,

ఉదాహరణ: ధరణిని ఒక ప్రైవేట్ సంస్థకి నిర్వహణ బాధ్యతలు ఇచ్చారు, దానిని డెవలప్ చేయడానికి సంస్థలో వివిధ శాఖల్లో వివిధ ఉద్యోగులు పనిచేస్తారు, అదే విధంగా ప్రభుత్వం కూడా సమాంతరంగా వ్యవస్థను ప్రభుత్వంలో ఏర్పాటు చేసుకోవాలి.

ఎందుకంటే లోపాలు వెతకడంలో, లోపాలను పరిష్కరించడంలో ప్రభుత్వంలో ఉన్న వ్యవస్థ  టెక్నాలజీ అధికారులు దోహదపడతారు. నాకు తెలిసి ధరినీలో వ్యవస్థ కూడా ఉందని నేను అనుకుంటున్నాను కానీ అది కేవలం 10 శాతం మాత్రమే ఉందని నేను భావిస్తున్నాను.

ఇలాంటి వ్యవస్థలని ఇతర దేశాల ప్రభుత్వాలు కూడా అవలంబిస్తున్నాయి. అందుచేత దేశాల్లో సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉంది, అదే మాదిరిగా దేశాల్లో ప్రభుత్వ సేవలు అన్ని ఆన్లైన్లోనే జరుగుతున్నాయి.

అంతే కానీ ఒక వ్యవస్థను పూర్తిగా తొలగించి పాత పద్ధతిలో వెళ్ళుదామనడం మూర్ఖత్వం. ప్రజలకు న్యాయం జరిగే విధంగా ఆలోచించాలి కానీ ప్రజలకు నష్టం జరిగే ఆలోచనలు చేయకూడదు.

నేడు  మన దేశ ప్రధాని మోడీ గారు కూడా డిజిటల్ ఇండియా అనే పేరుతో ఎన్నో పేర్లతో రూపకల్పన చేశారు వాటిలో కొన్ని విజయాలు సాధించాయి మరికొన్ని విఫలమవుతున్నాయి కానీ వాటిని తొలగించడం లేదు, వాటిలో లోపాలను వెతికి వాటిని పరిష్కరించి వాటిని ముందుకు నడిపిస్తున్నారు. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి.

దయచేసి ప్రతిపక్ష నాయకులు ఆలోచించవలసిన విషయం ఏమిటంటే ధరణి పోర్టల్ బాగుకోసం ఆలోచన చేయండి, బంగాళాఖాతంలో ప్రజల సొమ్మును కలిపే ఆలోచనలు చేయకండి. అది మీకు శ్రేయస్కరం కాదు.

ప్రభుత్వాలకి అధికారం శాశ్వతం కాదు, కేవలం మీరు ప్రజల శ్రేయస్సును కోరుకోండి, మీకు ఎల్లవేళలా వారి ఆశీర్వాదం ఉంటుంది.