Sunday, June 28, 2026

హైదరాబాద్‌ను తీసేస్తే తెలంగాణ బీహార్ అవుతుందా? వాస్తవాలు - వక్రీకరణలు

 ఇటీవల సోషల్ మీడియా వేదికగా కొందరు మిత్రులు తెలంగాణ ఆర్థిక బలాన్ని తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తున్నారు. "తెలంగాణను పక్క రాష్ట్రం వాళ్లే వచ్చి అభివృద్ధి చేశారు, హైదరాబాద్ లేకపోతే తెలంగాణ ఆదాయం లేదు, అది బీహార్ కంటే వెనుకబడిపోతుంది" అనే విధంగా జీడీపీ (GSDP) నంబర్లను వాడుకుంటూ వితండవాదానికి తెరలేపారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న ఒక ఉద్యమకారుడిగా, ఆర్థికశాస్త్రం మరియు ఈ గడ్డ చరిత్రపై అవగాహన ఉన్న పౌరుడిగా.. ఆ అరకొర విశ్లేషణలోని లొసుగులను పక్కా డేటాతో విశ్లేషించి చారిత్రాత్మక నిజాలను మీ ముందుకు ఉంచుతున్నాను.


1. భౌగోళిక అనుకూలతలు - ఒకరిది సముద్రం, మరొకరిది హైదరాబాద్

ఏ రాష్ట్రానికైనా ప్రకృతి ఇచ్చిన ఒక భౌగోళిక అనుకూలత, ఒక గ్రోత్ ఇంజిన్ ఉంటుంది. మహారాష్ట్రకు ముంబై, కర్ణాటకకు బెంగళూరులా.. తెలంగాణకు హైదరాబాద్.


ఇదే వింత లాజిక్‌ను మనం రివర్స్ చేసి చూద్దాం—"రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్‌కు ప్రకృతి ప్రసాదించిన 974 కిలోమీటర్ల పొడవైన సుదీర్ఘ సముద్ర తీరాన్ని (Sea Coast), విశాఖపట్నం, కృష్ణపట్నం, గంగవరం, కాకినాడ లాంటి ఓడరేవులను (Ports) తీసి పక్కన పెడితే ఏపీ పరిస్థితి ఏంటి?" అని ఎవరైనా అడిగితే సమాధానం ఉందా? ఆ సముద్ర తీరం, పోర్టుల వల్లే కదా ఏపీకి దేశంలోనే నంబర్ 1 ఆక్వాకల్చర్ ఆదాయం, పోర్ట్ బేస్డ్ భారీ పరిశ్రమలు వస్తున్నాయి? వాటిని తీసేస్తే ఏపీ జీడీపీ కూడా ప్రభావితం అవుతుంది. కానీ ఎవరూ అలా మాట్లాడరు, ఎందుకంటే అది ఆ రాష్ట్ర భౌగోళిక బలం. అలాగే హైదరాబాద్ అనేది తెలంగాణ భౌగోళిక పరిధిలోని అంతర్భాగం. దాన్ని విడదీసి మాట్లాడటమే ఒక పెద్ద ఆర్థిక అజ్ఞానం.


2. "మేము వచ్చి అభివృద్ధి చేస్తేనే హైదరాబాద్ అయింది" అనేది అపోహ మాత్రమే!


1956లో ఉమ్మడి రాష్ట్రం ఏర్పడక ముందే, నిజాం హయాంలోనే తెలంగాణ ప్రాంతం పారిశ్రామికంగా, మౌలిక సదుపాయాల పరంగా ఆసియాలోనే ఎంతో ముందంజలో ఉంది. ఎవరో వచ్చి పుణ్యానికి కడితే హైదరాబాద్ గ్లోబల్ సిటీ అవ్వలేదు. దానికి శతాబ్దాల బలమైన పునాది ఉంది:

 నైజాం కాలం నాటి భారీ పరిశ్రమలు: ఉమ్మడి రాష్ట్రం కంటే ముందే ఆసియాలోనే అతిపెద్ద చక్కెర కర్మాగారం 'నిజాం షుగర్ ఫ్యాక్టరీ' (బోధన్), సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్స్, అల్విన్, ప్రాగా టూల్స్, సింగరేణి కాలరీస్, చార్మినార్ సిగరెట్ ఫ్యాక్టరీ, డీబీఆర్ మిల్స్ వంటి ఎన్నో దిగ్గజ పరిశ్రమలు తెలంగాణ సొంత భూముల్లో ఏర్పాటయ్యాయి.

 మౌలిక సదుపాయాల ల్యాండ్‌మార్క్స్: ఉస్మానియా యూనివర్సిటీ, నిజామియా అబ్జర్వేటరీ, ఉస్మానియా హాస్పిటల్, బేగంపేట ఎయిర్‌పోర్ట్, నిజాం స్టేట్ రైల్వేస్ (NSR) వంటి ప్రపంచ స్థాయి సంస్థలు 1950ల నాటికే ఇక్కడ వైభవంగా ఉన్నాయి.

హైదరాబాద్‌కు ఉన్న అద్భుతమైన వాతావరణం, భూకంపాలు రాని భౌగోళిక స్థిరత్వం, ఇక్కడి ప్రజల ఆదరణ, శాంతిభద్రతల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు ఇక్కడికి వచ్చారు. వ్యాపారాలు చేసి లాభాలు గడించారు తప్ప, ఎవరూ ఉచితంగా వచ్చి ఇక్కడ దానం చేయలేదు. ఇది పరస్పర ఆర్థిక ప్రయోజనం (Mutual Benefit) మాత్రమే.


3. జీడీపీ (GSDP) మాయాజాలం - తలసరి ఆదాయమే అసలు కింగ్!

సదరు సోషల్ మీడియా పోస్టుల్లో ఏపీ GSDP ₹18.30 లక్షల కోట్లు, తెలంగాణ GSDP ₹18.00 లక్షల కోట్లు అని చూపించి మురిసిపోయారు. కానీ ఇక్కడ "జనాభా (Population)" అనే ప్రాథమిక సూత్రాన్ని విస్మరించారు.

 ఆంధ్రప్రదేశ్ జనాభా: ~ 5 కోట్లకు పైగా.

 తెలంగాణ జనాభా: ~ 3.5 నుండి 3.8 కోట్లు.

దాదాపు సమానమైన జీడీపీ ఉండి.. జనాభాలో తెలంగాణ చాలా తక్కువ ఉంది. దీనివల్ల "తలసరి ఆదాయం" (Per Capita Income) లో తెలంగాణ భారతదేశంలోనే టాప్ 3 స్థానాల్లో నిలుస్తోంది. అంటే ఏపీతో పోలిస్తే తెలంగాణలోని ప్రతి పౌరుడి సగటు ఆర్థిక బలం, జీవన ప్రమాణాలు, కొనుగోలు శక్తి చాలా ఎక్కువ అనేది నగ్నసత్యం.


4. బీహార్‌తో పోలికా?


హైదరాబాద్ లేకపోతే తెలంగాణ మిగతా జిల్లాలు బీహార్ కంటే వేస్ట్ అని రాయడం వారి అజ్ఞానానికి పరాకాష్ట. ఒకసారి కాలిక్యులేటర్ తీసి ఈ సింపుల్ మ్యాథ్స్ చూడండి:

 బీహార్ లెక్క: 13 కోట్ల జనాభాకు ₹13 లక్షల కోట్ల జీడీపీ ఉంది. అంటే అక్కడ తలసరి ఆదాయం అత్యంత తక్కువగా ఉంది.

 తెలంగాణ (హైదరాబాద్ కాకుండా) లెక్క: హైదరాబాద్ మెట్రో ప్రాంతాన్ని మినహాయిస్తే మిగిలిన జిల్లాల జనాభా కేవలం 2.5 కోట్లు మాత్రమే. ఈ 2.5 కోట్ల జనాభా కలిపి సుమారు ₹7 లక్షల కోట్ల జీడీపీని ఉత్పత్తి చేస్తోంది.

13 కోట్ల మంది ₹13 లక్షల కోట్లు సాధించడం గొప్పా? లేక కేవలం 2.5 కోట్ల మంది ₹7 లక్షల కోట్లు సాధించడం గొప్పా? హైదరాబాద్ లేకపోయినా తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ (వ్యవసాయం, సింగరేణి బొగ్గు, పారిశ్రామిక క్లస్టర్లు) బీహార్ కంటే ఎన్నో రెట్లు అత్యంత సంపన్నమైనది మరియు శక్తివంతమైనది.






ముగింపు:

ఆర్థిక సూచీలను మనకు నచ్చినట్లు వాడుకుని, ఒక ప్రాంతాన్ని తక్కువ చేసి మాట్లాడటం వల్ల అజ్ఞానం బయటపడుతుంది తప్ప వాస్తవాలు మారవు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ తనకున్న సుదీర్ఘ సముద్ర తీరం, పోర్టులు, ఆక్వా, మాన్యుఫ్యాక్చరింగ్ (శ్రీసిటీ, కియా మోటార్స్) రంగాలతో తనదైన శైలిలో ఎదుగుతోంది. అదే సమయంలో తెలంగాణ తనకున్న శతాబ్దాల చరిత్ర కలిగిన గ్లోబల్ సిటీ హైదరాబాద్‌ను గ్రోత్ ఇంజిన్‌గా వాడుకుంటూనే, ఐటీ, సర్వీస్, రియల్ ఎస్టేట్ మరియు గ్రామీణ ఆర్థిక రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా దూసుకుపోతోంది. ఇప్పటికైనా ఇలాంటి సంకుచిత ప్రాంతీయ పోస్ట్‌లు మానేసి, ఫ్యాక్ట్స్ మాట్లాడటం నేర్చుకుంటే అందరికీ శ్రేయస్కరం!


Thursday, June 25, 2026

దేవుడు శక్తులిచ్చినా ఎందుకు ఓడిపోతున్నాం? నాస్తికులైనా నమ్మక తప్పని 'శివ-తత్వ' సైకాలజీ!

ఆత్మదర్శనం: శివయ్య ఇచ్చిన శక్తులు

అనగనగా భూలోకంలో ఒక గొప్ప శివభక్తుడు ఉండేవాడు. పరమశివుడంటే అతనికి అమితమైన భక్తి. ప్రతిరోజూ ఎంతో నిష్ఠతో స్వామిని పూజించేవాడు. శివనామ స్మరణ లేనిదే అతని రోజు గడిచేది కాదు.

అయితే, కాలక్రమేణా అతని జీవితంలో తీవ్రమైన కష్టాలు, వరుస ఇబ్బందులు ఎదురయ్యాయి. దాంతో అతను మానసికంగా కుమిలిపోతూ, మనశ్శాంతి కరువై తీవ్ర ఆవేదన చెందాడు. "దేవా! నాకు ప్రశాంతతను ప్రసాదించు" అని రోజూ వేడుకునేవాడు. అయినా మనసు స్థిమితపడలేదు. దాంతో ఆ భగవాన్ స్వరూపుడైన శివుడి కోసం క్రూరమైన, దుర్ఘటమైన అన్ని పుణ్యక్షేత్రాలకూ వెతుక్కుంటూ వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు.



చివరికి అత్యంత కఠినమైన హిమాలయాల పర్వత ప్రాంతానికి చేరుకుని, గడ్డకట్టే చలిని సైతం లెక్కచేయకుండా శివయ్య కోసం కఠోరంగా ప్రార్థించాడు. అతని నిష్కల్మషమైన భక్తికి మెచ్చి, పరమశివుడు సాక్షాత్కరించాడు.

శివయ్యను చూడగానే ఆ భక్తుడు తన్మయత్వంతో, "దేవా! నా భక్తికి మెచ్చి నువ్వు ప్రత్యక్షమవ్వడం నా జీవిత ధన్యత" అని మోకరిల్లాడు.

శివయ్య మందహాసం చేస్తూ, "భక్తా! నీ భక్తికి ప్రసన్నమయ్యాను. నీకు ఎలాంటి కోరికలు కావాలో కోరుకో!" అన్నాడు.

అప్పుడు ఆ భక్తుడు ఆవేదనతో, "అయ్యా! నేను ప్రతిరోజూ మిమ్మల్ని పూజిస్తున్నా నా జీవితంలో ప్రశాంతత లేదు, విజయాలు లేవు. ఎటు చూసినా కష్టాలే ఎదురవుతున్నాయి" అని తన బాధ చెప్పుకున్నాడు.

శివయ్య నవ్వుతూ... "నీకు నేను ఈ భూలోకానికి పంపించే అప్పుడే... ప్రశాంతంగా జీవించడానికి, విజయాలు పొందడానికి కావలసిన అన్ని శక్తులను నీలోనే నింపి పంపాను. మళ్ళీ ఇప్పుడు నన్ను అడుగుతున్నావేంటి భక్తా?" అన్నాడు.

భక్తుడు ఆశ్చర్యపోతూ... "అయ్యా! మరి అన్ని శక్తులు నాలోనే ఉంటే నాకు ఎందుకు ఈ కష్టాలు?" అని ప్రశ్నించాడు.

అప్పుడు శివయ్య ఎంతో ప్రశాంతంగా... "సరే భక్తా, నువ్వు కొన్ని రోజులుగా తీసుకున్న అత్యంత కీలకమైన నిర్ణయాలు, చేసిన పనులు ఎలాంటివో నాకు ఒక్కసారి వివరించు" అన్నాడు. భక్తుడు తను తీసుకున్న ముఖ్యాతి ముఖ్యమైన నిర్ణయాలన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటిగా శివయ్యకు వివరించాడు.

అదంతా విన్న శివయ్య, అతని వైపు నిశ్శబ్దంగా చూస్తూ... "భక్తా! ఇప్పుడు చెప్పు... నువ్వు తీసుకున్న ఆ నిర్ణయాలన్నీ కరెక్ట్ అని నువ్వు భావిస్తున్నావా?" అని అడిగాడు.

ఆ ప్రశ్నకు భక్తుడు ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయాడు. అతనిలో అంతర్మథనం మొదలైంది. కాసేపటి తర్వాత తలదించుకుని, "కాదయ్యా... నేను కొన్ని తెలుసో తెలియకో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాను. వాటి వల్లే నాకు ప్రశాంతత లేకుండా పోయింది" అని ఒప్పుకున్నాడు.

"అయితే ఇప్పుడు ఆ తప్పులను సరిచేయాలని నన్ను అడుగుతున్నావా?" అని శివయ్య అడగగా... "అవునయ్యా! ఆ తప్పులను సరిచేసి, నా జీవితంలో కొత్త శక్తులను ప్రసాదించు" అని వేడుకున్నాడు.

దానికి శివయ్య... "భక్తా! నేను కొత్త శక్తులనూ ప్రసాదించలేను. నిన్ను భూమి మీదికి పంపించే ముందే నీకు ఏవైతే శక్తులు ఇచ్చానో... వాటిని మాత్రమే నేను మళ్ళీ 'రియాక్టివేట్' (పునరుజ్జీవింపజేయడం) చేయగలుగుతాను. కానీ, భవిష్యత్తులో నువ్వు మళ్ళీ తప్పుడు నిర్ణయాలు తీసుకోావని నమ్మకం ఏంటి?" అని అడిగాడు.

భక్తుడు వెంటనే రెండు చేతులూ జోడించి, "లేదు శివయ్య! నేను మళ్ళీ అలాంటి తప్పులను అస్సలు చేయను. నా తప్పుల నుండి నేర్చుకున్నాను. ఇకపై సరైన నిర్ణయాలతోనే నా ప్రయాణాన్ని సాగిస్తాను" అని నిశ్చయంగా చెప్పాడు.

అతని మాటలకు సంతోషించిన పరమశివుడు... "సరే, ఇకపై నువ్వు చేసే పనులలో విజయాలు పొందుతావు. నీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది" అని ఆశీర్వదించి, అంతర్ధానమయ్యాడు. ఆ భక్తుడు సరికొత్త ఆత్మవిశ్వాసంతో తన ఇంటికి చేరుకుని, ఎంతో ప్రశాంతంగా తన జీవిత గమ్యం వైపు అడుగులు వేయడం ప్రారంభించాడు.

 కైలాసంలో పార్వతీ పరమేశ్వరుల సంభాషణ:

అక్కడ కైలాసంలో, ఇదంతా గమనిస్తున్న పార్వతీ దేవికి ఒక సందేహం వచ్చి, శివయ్యను ఇలా అడిగింది... "అయ్యా! నీ భక్తుడు కష్టాలు ఓర్చి నీ దగ్గరికి వస్తే... మీరు చాలా సింపుల్‌గా కేవలం రెండు మాటలు చెప్పారు. తనకి మళ్ళీ కొత్తగా శక్తులేవీ ఇవ్వలేదు కదా! మరి తనకి జీవితంలో విజయాలు ఎలా కలుగుతాయి స్వామీ?" అని అడిగింది.

అప్పుడు ఆ శివయ్య చిరునవ్వు నవ్వి, పార్వతీ దేవి వైపు చూస్తూ ఇలా సమాధానమిచ్చాడు...

"పార్వతీ! నేను నా భక్తుడికి భూమి మీదికి పంపేటప్పుడే అన్ని శక్తులనూ ఇచ్చి పంపాను. కానీ, తను తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల ఆ శక్తులన్నీ లోపల నిర్వీర్యమైపోయాయి. అందుకే నేను అతని తప్పులను అతనికి గుర్తుచేసి, ఆ తప్పులను మరొకసారి చేయకుండా ఉండేలా అతనిలో విచక్షణను మేల్కొలిపాను. ఆ విచక్షణే నేను నా భక్తుడికి ఇచ్చిన అసలైన ఔషధం. ఒకవేళ గనుక తను ఇప్పటినుంచైనా తను తీసుకునే నిర్ణయాలను ఆలోచనాత్మకంగా, పాజిటివ్ థింకింగ్ తో తీసుకుంటే... నిద్రపోయిన ఆ శక్తులన్నీ తిరిగి మేల్కొంటాయి.

**అయితే పార్వతీ! ఇక్కడ మానవులు గ్రహించాల్సిన ఒక ముఖ్యమైన పరమార్థం ఉంది...**

చాలామంది మనశ్శాంతి కోసం, విజయాల కోసం తమ లోపల ఉన్న శక్తులను గమనించకుండా, బయట ఎక్కడో వెతుకుతూ అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకుంటారు. అలా సమయం వృధా అయ్యే కొద్దీ... వయసు పైబడుతుంది, మానసిక ఒత్తిడిల కారణంగా ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది.

ఒకవేళ వయసు పైబడిన తర్వాత, ఆరోగ్యం పాడైపోయిన తర్వాత నేను ప్రత్యక్షమై ఆ శక్తులను 'రియాక్టివేట్' చేసినా కూడా... వాటిని తట్టుకుని, ఉపయోగించుకునే శారీరక, మానసిక స్థితిగతులు ఆ సమయంలో వారిలో ఉండవు. ఆరోగ్యం సహకరించనప్పుడు దేవుడు ఎన్ని శక్తులు ఇచ్చినా అవి నిరుపయోగమే అవుతాయి!

అందుకే... దేవుడు ప్రసాదించిన శక్తులను సమయం ఉన్నప్పుడే శ్రద్ధగా గ్రహించాలి. వయసు, ఆరోగ్యం బాగున్నప్పుడే తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా, ఒకవేళ పొరపాట్లు జరిగినా వెంటనే వాటిని సరిదిద్దుకుంటూ, పాజిటివ్ థింకింగ్‌తో జీవిత ప్రయాణంలో ముందుకు సాగాలి. అదే అసలైన విజయం!" అని వివరించాడు శివయ్య.

శివయ్య చెప్పిన ఆ అద్భుతమైన పరమార్థాన్ని విని పార్వతీ దేవి ఎంతో సంతోషించింది.

కథా నీతి (Moral of the Story):

మన విజయాలు, మానసిక ప్రశాంతతకు కావలసిన శక్తులను ఆ భగవాన్ స్వరూపుడు మనకు ఎప్పుడో ఇచ్చాడు. మన తప్పుడు నిర్ణయాలు ఆ శక్తులను నిర్వీర్యం చేస్తే... మన విచక్షణతో తీసుకునే సరైన నిర్ణయాలు ఆ శక్తులన్నింటినీ మళ్ళీ మేల్కొల్పుతాయి.

అయితే, ఆ ప్రశాంతత కోసం బయట ఎక్కడో వెతుకుతూ సమయాన్ని వృధా చేసుకోకూడదు. ఎందుకంటే, కాలం గడిచేకొద్దీ వయసు పైబడి, మానసిక ఒత్తిడి వల్ల ఆరోగ్యం క్షీణిస్తుంది. ఆ సమయంలో దేవుడు శక్తులను రియాక్టివేట్ చేసినా కూడా మన ఆరోగ్య స్థితిగతులు సహకరించకపోతే అవి నిరుపయోగమే అవుతాయి. కాబట్టి, లభించిన సమయంలోనే పాజిటివ్ థింకింగ్‌తో, తప్పుడు నిర్ణయాలకు తావివ్వకుండా, వివేకంతో ముందుకు సాగి విజయాన్ని అందుకోవడమే మానవ జీవిత పరమార్థం.

Regards 

Surender Thallapelly 

Friday, June 19, 2026

AP టూరిజం దూకుడు... తెలంగాణ అలర్ట్ అవ్వాల్సిన సమయం వచ్చిందా?

 AP టూరిజం దూకుడు... తెలంగాణ అలర్ట్ అవ్వాల్సిన సమయం వచ్చిందా?

పిల్లలకి వేసవి కాలం సెలవులు ముగుస్తుండటంతో, హాలిడేస్ ఎండింగ్‌ను కాస్త స్పెషల్‌గా ప్లాన్ చేద్దామని గత వీకెండ్ ఫ్యామిలీతో కలిసి ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల, చీరాల, రామాపురం బీచ్‌లను సందర్శించాను. ఇదివరకు ఇతర రాష్ట్రాల్లోని బీచ్‌లకు వెళ్లిన అనుభవంతో పోల్చి చూస్తే... ఇక్కడ జరుగుతున్న రీసెంట్ డెవలప్‌మెంట్ యాక్టివిటీస్ చూసి నిజంగా ఆశ్చర్యపోయాను!

పర్యాటకుల కోసం సరికొత్త రిసార్ట్స్, వైవిధ్యమైన ఫుడ్ స్టాల్స్, ఎంటర్టైనింగ్ గేమ్స్ అండ్ యాక్టివిటీస్‌తో బీచ్‌లను చాలా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. వీటికి తోడు అక్కడ లిక్కర్ షాప్స్‌/జోన్స్‌కు కూడా పర్మిషన్స్ ఇస్తున్నట్లు వస్తున్న వార్తలు నిజమైతే... రాబోయే రోజుల్లో ఇది టూరిజం రంగాన్నే మార్చేసే అవకాశం ఉంది.

గోవాకు గట్టి పోటీ... వైజాగ్ తరహాలో బాపట్ల, చీరాల!

ప్రస్తుతం గోవాలో జరుగుతున్న కొన్ని స్కామ్స్, మిస్-బిహేవియర్ల వల్ల తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్నారు. ఈ తరుణంలో చీరాల-రామాపురం బీచ్‌లు గోవాను తలదన్నే రేంజ్‌లో ఇంటర్నేషనల్ టూరిస్టులను సైతం అట్రాక్ట్ చేసేలా రెడీ అవుతున్నాయి.

పైగా హైదరాబాద్ నుండి ఈ బీచ్‌లకు డైరెక్ట్ కనెక్టివిటీ ఇచ్చే హైవే పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఆంధ్ర బోర్డర్ వరకు హైవే దాదాపు సిద్ధంగా ఉంది, మిగిలిన కనెక్టివిటీ కూడా పూర్తయితే... హైదరాబాద్ వాసులకు అతి తక్కువ సమయంలో చేరుకోగలిగే బెస్ట్ వీకెండ్ డెస్టినేషన్ ఇదే అవుతుంది.

📉 తెలంగాణ రెవెన్యూపై పడనున్న ప్రభావం?

ఈ డెవలప్‌మెంట్స్ గనుక సక్సెస్ ఫుల్ అయితే, దాని ప్రభావం తెలంగాణపై ఇండైరెక్ట్‌గా పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది:

 1. టూరిజం రెవెన్యూ:ఇప్పటికే తెలంగాణ నుండి భారీగా ప్రజలు ఏపీలోని పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నారు. ఇకపై ఈ బీచ్‌ల కోసం కూడా వీకెండ్స్ లో అక్కడికే క్యూ కట్టే అవకాశం ఉంది.

 2. లిక్కర్ రెవెన్యూ:ఏపీ బీచ్ టూరిజం పాలసీ వల్ల తెలంగాణ లిక్కర్ రెవెన్యూ కూడా కొంతమేర తగ్గే ప్రమాదం ఉంది.

🤝 గౌరవకారణమే... కానీ మన తెలంగాణ కూడా మారాలి!

పక్క రాష్ట్రం అభివృద్ధి చెందడం, అక్కడ లోకల్ గా ఉద్యోగ అవకాశాలు పెరగడం, అంతర్జాతీయంగా తెలుగు రాష్ట్రాల పేరు మార్మోగడం ఒక తెలుగువాడిగా మనందరికీ గర్వకారణమే. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ... ఇదే సమయంలో మన తెలంగాణ ప్రభుత్వం కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది!

మన దగ్గర అద్భుతమైన అడవి ప్రాంతాలు (Forest Tourism), హిస్టారికల్ ప్లేసెస్, రిజర్వాయర్లు ఉన్నాయి.

 * ఆంధ్రప్రదేశ్‌ తరహాలోనే మన దగ్గర కూడా టూరిజం హబ్‌లను ప్రణాళికాబద్ధంగా డెవలప్ చేయాలి.

 * ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ (ఉద్యోగ కల్పన) కోసం టూరిస్టులను ఆకర్షించేలా ఇక్కడ కూడా పాలసీలను సరళీకృతం చేయాలి.

 * మన ఆదాయం పక్క రాష్ట్రాలకు వెళ్లకుండా, మన తెలంగాణ టూరిజాన్ని గ్లోబల్ లెవెల్‌కు తీసుకెళ్లేలా ప్రభుత్వం ఆలోచనాత్మకమైన అడుగులు వేయాలని కోరుకుంటున్నాను.

మీరేమంటారు?

#AndhraPradeshTourism #ChiralaBeach #Bapatla #TelanganaTourism #TourismDevelopment #WeekendGateway #HyderabadToChirala #EconomicGrowth #TeluguState

Thursday, June 18, 2026

ఆలోచించాల్సిన సమయం.. విమర్శల వెనుక ఉన్న వ్యూహాన్ని గమనించండి!

ఈ మధ్య సోషల్ మీడియాలో మన కాంగ్రెస్ మిత్రులు కొందరు ప్రధాని నరేంద్ర మోడీ గారు టెలిప్రాంప్టర్లు చూసి చదువుతున్నారని, నిన్నటి G7 సదస్సులో చిట్టీలు చూసి మాట్లాడుతున్నారని తెగ ట్రోల్స్ చేస్తున్నారు. ఒక కాంగ్రెస్ భావజాలం ఉన్న వ్యక్తిగా, వ్యక్తిగతంగా బీజేపీ ఐడియాలజీకి నేను దూరంగా ఉన్నప్పటికీ.. మన వాళ్లు చేస్తున్న ఈ తరహా విమర్శలు చూస్తుంటే కొంత బాధగా, ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఇలాంటి అనవసరమైన అంశాలను హైలైట్ చేయడం వల్ల మన పార్టీకి వచ్చే మైలేజ్ ఏంటి? ఒక్కసారి ప్రాక్టికల్ గా ఆలోచిద్దాం.

1. చూసి చదవడం కాదు.. ప్రజల్లోకి ఎలా వెళ్తుందనేదే ముఖ్యం!

మోడీ గారు గత 12 ఏళ్లుగా ఒక పక్కా వ్యూహంతో (Strategic View) ముందుకు వెళ్తున్నారు. ఆయన టెలిప్రాంప్టర్ వాడినా, చిట్టీలు చూసినా.. ఆ ప్రసంగంలో ప్రజలను ఎలా ఆకట్టుకోవాలి, ఏ పాయింట్స్ మాట్లాడాలి, దేశ విదేశాల్లో భారత్ ఇమేజ్ ని ఎలా ప్రొజెక్ట్ చేయాలి అనే అంశాలపై వారి టీమ్ తీవ్రమైన రీసెర్చ్ చేస్తుంది. ఒక లీడర్ ఎలా మాట్లాడుతున్నాడు అనేదానికంటే, ఆ మాటలు ప్రజలను ఏ మేరకు ప్రభావితం (Influence) చేస్తున్నాయనేది ముఖ్యం. అందువల్లే విదేశాల్లో కూడా వారికి ఆ స్థాయి అట్రాక్షన్ దక్కుతోంది.

2. రాహుల్ గాంధీ గారు ఎక్కడ వెనుకబడుతున్నారు?

మన నాయకుడు రాహుల్ గాంధీ గారు చాలా నిజాయితీ గల వ్యక్తి. ఏ ప్రసంగానికైనా తనే స్వయంగా రీసెర్చ్ ఓరియెంటెడ్ గా ప్రిపేర్ అవుతారు, మనసులో ఏది ఉంటే అది ముక్కుసూటిగా మాట్లాడుతారు. కానీ, దురదృష్టవశాత్తూ ప్రజల నుంచి దక్కాల్సినంత ఆదరణ, నమ్మకం ఆయనకు ఎందుకు లభించడం లేదు? మనం ఎక్కడ వెనుకబడుతున్నామో ఆత్మపరిశీలన చేసుకోవాలి.

3. డైరెక్ట్ స్పీచ్ ల వల్ల వచ్చే నష్టాలు:


కొన్నిసార్లు ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా డైరెక్ట్ గా మాట్లాడటం వల్ల, భావోద్వేగంలో ఒక్క చిన్న మాట తప్పుగా దొర్లినా.. దానిని అపోజిషన్ వాళ్లు అస్త్రంగా మార్చుకుని, మొత్తం వ్యవస్థకే డ్యామేజ్ తెచ్చే ప్రమాదం ఉంటుంది. అది మనం చాలాసార్లు చూశాం. పొలిటికల్ కమ్యూనికేషన్ లో ప్రతి మాట ఒక తూటా లాంటిది, అది పక్కాగా ప్లాన్ చేసి వదలాలి.

4. శత్రువు వ్యూహాన్ని కాపీ కొట్టడంలో తప్పులేదు!

భాషపై పట్టు లేకపోయినా, స్క్రిప్ట్ చూసి చదివినా.. వాళ్లు ప్రజల్లో ఒక గట్టి పటిష్టతను, కనెక్టివిటీని బిల్డ్ చేసుకోగలుగుతున్నారు. అలాంటప్పుడు వాళ్లు అనుసరిస్తున్న ఆ 'సక్సెస్ ఫుల్ స్ట్రాటజీ'ని మనమెందుకు అనుసరించకూడదు? మన లీడర్ల ప్రసంగాలను కూడా అంతే పక్కాగా, వ్యూహాత్మకంగా ఎందుకు డిజైన్ చేయకూడదు?

ముగింపు:


చిట్టీలు పట్టుకున్నారని, హిందీలో చూసి చదివారని సోషల్ మీడియాలో మోడీ గారిని క్రిటిసైజ్ చేయడం వల్ల ఆయన వ్యక్తిగతంగా ఇంకా ఎదుగుతాడు తప్ప, మనకు వచ్చే లాభం శూన్యం. ఇలాంటి సిల్లీ ట్రోల్స్ ఆపి.. ప్రత్యర్థి బలాన్ని గుర్తించి, మన బలహీనతలను సరిదిద్దుకుని, క్షేత్రస్థాయిలో ప్రజలకు మరింత దగ్గరయ్యే వ్యూహాలపై మన కాంగ్రెస్ నాయకత్వం దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను.


ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.🙏


#PoliticalStrategy #Congress #Introspection #RahulGandhi #NarendraModi #IndianPolitics #G7

Monday, June 15, 2026

📌 తెలంగాణలో ప్రైవేట్ స్కూల్ ఫీజుల నియంత్రణ: నిర్ణయం మంచిదే... కానీ సమయం దాటిపోలేదా? 🤔

తెలంగాణలో ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణ కోసం కమిటీ వేసి, ఏ స్కూల్‌లో ఎంత ఫీజు ఉండాలో నిర్ణయించాలని అధికారులను ముఖ్యమంత్రి గారు ఆదేశించడం నిజంగా స్వాగతించదగ్గ పరిణామం. విద్యాశాఖ బాధ్యతలను కూడా ముఖ్యమంత్రి గారే స్వయంగా చూసుకుంటున్నారు కాబట్టి, ఈ సమస్యపై ఆయన ప్రత్యేక శ్రద్ధ పెట్టడం సంతోషకరం. కానీ, ఈ నిర్ణయం తీసుకున్న 'సమయం' గురించే ఇప్పుడు పేరెంట్స్ అందరిలోనూ పెద్ద ప్రశ్న నెలకొంది.



తల్లిదండ్రుల ఆవేదన ఇదే:


 ముందే ఎందుకు ఆలోచించలేదు?: స్కూళ్లు ఈరోజే (జూన్ 15) ప్రారంభమయ్యాయి. ఇదే ఆదేశాలు ఒక నెల రోజుల ముందే ఇచ్చి ఉంటే, మధ్యతరగతి, పేద కుటుంబాలకు ఎంతో మేలు జరిగేది.


 ఆల్రెడీ ఫీజులు కట్టేశారు: కొత్త అడ్మిషన్లు తీసుకున్న వారైనా, పాత విద్యార్థులైనా... మెజారిటీ తల్లిదండ్రులు నెల రోజుల ముందే అప్పులు చేసో, దాచుకున్న డబ్బులతోనో అడ్వాన్స్ ఫీజులు చెల్లించేశారు.


 ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతుందా?: స్కూళ్లు మొదలయ్యాక అధికారులు నివేదికలు తయారు చేసి, స్కూళ్లకు ఆదేశాలు పంపేసరికి మరింత సమయం పడుతుంది. అప్పటివరకు ప్రైవేట్ యాజమాన్యాలు ఆగుతాయా? ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తాయా? అనేదే అసలు సిసలైన అనుమానం.


మానవతా దృక్పథంతో గౌరవ ముఖ్యమంత్రి గారికి కొన్ని సూచనలు:


1. వెంటనే ప్రెస్ మీట్ పెట్టాలి: ముఖ్యమంత్రి గారే స్వయంగా రేపు లేదా ఎల్లుండి లోగా దీనిపై ఒక ప్రెస్ మీట్ నిర్వహించాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏ ఏ స్టాండర్డ్స్ ఉన్న స్కూల్స్ ఎంత ఫీజు వసూలు చేయాలో స్పష్టమైన లిస్ట్ ప్రకటించాలి.


2. కఠిన చర్యలు తీసుకోవాలి: ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే ఒక్క రూపాయి ఎక్కువ వసూలు చేసినా... ఆయా ప్రైవేట్ స్కూళ్ల లైసెన్స్ రద్దు చేస్తామనే కఠినమైన హెచ్చరికలు జారీ చేయాలి. ఆ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలి.


3. కలెక్ట్ చేసిన ఫీజుల పరిస్థితి ఏంటి?: ఇప్పటికే స్కూళ్లు అదనంగా వసూలు చేసిన ఫీజులను, ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులకు అడ్జస్ట్ చేసేలా లేదా వెనక్కి ఇచ్చేలా స్పష్టమైన గైడ్‌లైన్స్ ఇవ్వాలి.


ఇలాంటి కీలకమైన నిర్ణయాలను ముందే ప్రణాళికాబద్ధంగా (Advanced గా) చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అప్పుడే పేద, మధ్యతరగతి కుటుంబాలకు నిజమైన లబ్ధి చేకూరుతుంది.


ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, కేవలం ఆదేశాలకే పరిమితం కాకుండా... రాబోయే 2 రోజుల్లోనే క్షేత్రస్థాయిలో దీనిని కఠినంగా అమలు చేస్తుందని ఆశిస్తున్నాం! ✍️


#Telangana #SchoolFeesRegulation #CMO_Telangana #TelanganaEducation #ParentsVoice #MiddleClassIssues


Anumula Revanth Reddy Telangana CMO

2018 కాంగ్రెస్ ఓటమి వెనుక అసలు నిజం ఏంటి? అంతర్గత కుట్రలా.. ప్రచారమా?

నిన్న నా మిత్రుడు ఒకరు ఫోన్ చేసి, *"నిజంగానే మీనాక్షి నటరాజన్ గారి మీద కాంగ్రెస్ పార్టీ నాయకులే ఇంటర్నల్ కోవర్ట్ ఆపరేషన్స్ (కుట్రలు) చేశారా? అని అడిగాడు. దానికి నేను నవ్వుతూ చెప్పిన సమాధానం ఒక్కటే... అది జరిగిందా లేదా పక్కన పెడితే, రాజకీయాల్లో అలా జరగడానికి ఖచ్చితంగా ఆస్కారం ఉంది!



దీనికి పెద్ద ఉదాహరణే మన కళ్లముందు ఉంది. అదే **2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు**.

ఆ రోజుల్లో ఏం జరిగిందో ఒక్కసారి గుర్తుచేసుకుందాం:


* **ప్రజా వ్యతిరేకత:** అప్పటి BRS (అప్పటి TRS) ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం అనిపించింది.

 * **ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కష్టం:** అప్పటి పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ వ్యాప్తంగా తీవ్రంగా పర్యటించి, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు.


 * **కానీ ఫలితం ఏమైంది?** అంత అనుకూల వాతావరణం ఉన్నా కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోయింది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీఎం కాలేకపోయారు.


### 🚫 ఇక్కడ జరిగిన అసలు నెగెటివ్ ప్రొపగండా ఏంటి?


రాజకీయ అవగాహన ఉన్న ఎవరికైనా తెలుసు... ఆ రోజుల్లో సోషల్ మీడియాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిపై ఒక దుష్ప్రచారం సృష్టించారు. ఆయనేదో BRS పార్టీకి కోవర్ట్ అని, ఆ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని నెగెటివ్ సినారియో క్రియేట్ చేశారు.

**ఒక్క లాజిక్ ఆలోచించండి:** ఏ నాయకుడైనా సరే... తాను కష్టపడి పార్టీని గెలిపించి, సీఎం అయ్యే అవకాశం ఉన్నప్పుడు, వేరే పార్టీకి సరెండర్ అవుతాడా? ఇది ఎంతవరకు నమ్మశక్యంగా ఉంది? ఆ రోజు జనాలు ఈ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు.

💥 సొంత పార్టీ నాయకుల కుట్రలే శాపమా?

నేను కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధంతో, ఆనాటి రాజకీయాలను గమనించిన వ్యక్తిగా చెప్తున్నాను... 2018 లో కాంగ్రెస్ ఓడిపోవడానికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీఎం కాకపోవడానికి కేవలం **కాంగ్రెస్ లోని కొంతమంది నాయకులు చేసిన అంతర్గత కుట్రలు, నెగెటివ్ ప్రొపగండానే** కారణం. ఇది కేవలం నేను చెప్పేది కాదు, కాంగ్రెస్ లోని ప్రతి ఒక్కరికీ, రాజకీయ అవేర్నెస్ ఉన్న ప్రతి సామాన్యుడికీ తెలిసిన సత్యం.

ప్రత్యర్థి పార్టీలు మనల్ని దెబ్బతీయడానికి వ్యూహాలు రచించడం సహజం. కానీ సొంత పార్టీ వారే ఇలాంటి కుట్రలకు పాల్పడితే పార్టీ కోలుకోలేదు.

 📢 ఇప్పటికైనా మారాలి..!

దయచేసి ఇప్పటికైనా కాంగ్రెస్ అధిష్టానం ఇలాంటి అంతర్గత కుట్రలు, సొంత నాయకులపై జరిగే నెగెటివ్ ప్రొపగండాలను సీరియస్ గా తీసుకోవాలి. ఇలాంటి కోవర్ట్ రాజకీయాలకు చెక్ పెట్టకపోతే భవిష్యత్తులో పార్టీకి అంతకంటే పెద్ద నష్టం జరిగే ప్రమాదం ఉంది.

#TelanganaPolitics #CongressParty #UttamKumarReddy #PoliticalAnalysis #InternalPolitics

Monday, June 1, 2026

తెలంగాణ అమరవీరులకు, ఉద్యమకారులకు వందనం.. నాటి జ్ఞాపకాలతో మా ప్రయాణం!

 ✊ తెలంగాణ అమరవీరులకు, ఉద్యమకారులకు వందనం.. నాటి జ్ఞాపకాలతో మా ప్రయాణం! ✊


తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా, నాటి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన అమరవీరుల త్యాగాలను మరియు తమ విలువైన సమయాన్ని, కష్టాన్ని ధారబోసిన ఉద్యమకారుల స్ఫూర్తిని గుండెల్లో నింపుకుంటూ... ఆనాడు #JNTUHJAC విద్యార్థి నాయకుడిగా ఉద్యమ బాటలో సాగిన ఆనాటి ప్రయాణాన్ని, ఆ పోరాట స్ఫూర్తిని ఈరోజు మరొక్కసారి గుర్తుచేసుకుంటున్నాను.




నాడు రాజకీయ జేఏసీ పిలుపునిచ్చిన ప్రతి ఉద్యమ కార్యక్రమంలోనూ మేము విద్యార్థి నాయకులుగా ముందుండి, ఎన్నో ఆశలతో, ఆకాంక్షలతో, మా విలువైన సమయాన్ని, జీవితాన్ని సైతం వదులుకొని ఆనాడు ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాము. పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగాము, అరెస్టులు అయ్యాము, పోలీస్ లాఠీ దెబ్బలు కూడా తిన్నాము.




గత పది సంవత్సరాల TRS/BRS ప్రభుత్వ హయాంలో కొంతమంది ఉద్యమకారులకు, అమరుల కుటుంబాలకు న్యాయం జరిగినప్పటికీ... ఒక ఉద్యమ పార్టీగా ఉద్యమకారులందరికీ పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోయిందనేది జగమెరిగిన సత్యం.


ఇక ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం విషయానికి వస్తే... తాము అధికారంలోకి వస్తే ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేస్తామని మేనిఫెస్టోలో హామీలు ఇచ్చారు. దానికి అనుగుణంగానే రీసెంట్‌గా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఉద్యమకారులను గుర్తిస్తాం, న్యాయం చేస్తాం అని చెప్తున్న ఈ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ కాంగ్రెస్ పాలనలోనైనా ఉద్యమకారులందరికీ సముచిత స్థానం, న్యాయం దక్కుతుందని ఆశిస్తూ... వారికి పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను.


పోరాటం నేర్పిన పాఠం.. యువతకు నా చిన్న సందేశం! 🙏


ఒక స్టూడెంట్ లీడర్‌గా ఆ రోజుల్లో మేము చేసిన పోరాటం, పడిన కష్టాలు, ఆ తర్వాత నా వ్యక్తిగత జీవితంలో ఎదురైన తీవ్రమైన స్ట్రగుల్స్ మరియు నా లైఫ్‌లో తెచ్చిన మార్పులను నేను ఇప్పటికీ మర్చిపోలేను. ఉద్యమ నేపథ్యం వల్ల ఆ రోజుల్లో అవకాశాలు రాక ఎన్నో ఇబ్బందులు పడ్డాను. కానీ, వాటన్నింటినీ దాటుకుని, నా తప్పులను నేను రియలైజ్ అయ్యి, మళ్ళీ కష్టపడి ఈరోజు ఒక చిన్న ఉద్యోగంలో నా జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాను.


నా ఈ వ్యక్తిగత అనుభవం నుండి ఈనాటి **యువతకు నేను ఇచ్చే ఒకే ఒక స్ట్రాంగ్ మెసేజ్:**


మీరు ఏ రాజకీయ పార్టీల వైపు వెళ్లినా, ఏ ఉద్యమాల్లో అడుగులు వేసినా... ఒకటికి వందసార్లు ఆచి తూచి అడుగులు వేయండి. ఎమోషన్స్ లో కొట్టుకుపోయి మీ జీవితాలను, మీ నమ్ముకున్న కుటుంబాల భవిష్యత్తును అడ్డుపెట్టకండి. ఏదేమైనా సరే... ఫస్ట్ మన జీవితం, మన కుటుంబం... ఆ తర్వాతే ఏదైనా!


తెలంగాణ కోసం పోరాడిన ప్రతి ఒక్కరికీ న్యాయం జరగాలని ఆశిస్తూ...


జై తెలంగాణ! 💐

Regard’s 

Surender Thallapelly 


పవన్ కళ్యాణ్ - ప్రొఫెసర్ నాగేశ్వరరావు వివాదం: ఆవేశాలు పక్కన పెట్టి ఆత్మవిమర్శ చేసుకుందామా?

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా, టీవీ డిబేట్లలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు మద్దతుదారులకి, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమానులకి మధ్య జరుగుతున్న "మాటల యుద్ధం" తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మొదట్లో ఒక చిన్న 'మిస్ అండర్స్టాండింగ్' (తప్పుడు సమాచారం) వల్ల ప్రారంభమైన ఈ వివాదం, ఇప్పుడు ఏకంగా రెండు ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించే స్థాయికి వెళ్లడం నిజంగా విచారకరం. రాజకీయ విమర్శల సరిహద్దులు దాటి, వ్యక్తిగత దూషణల వరకు వెళ్లిన ఈ వ్యవహారంపై కాసేపు ఆవేశాన్ని పక్కన పెట్టి నిష్పాక్షికంగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.



వివాదం ఎలా మొదలైంది? (ఒక్కసారి ఫ్లాష్‌బ్యాక్)

ఈ వివాదానికి గల మూలాలను పరిశీలిస్తే..
1. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు తనకు అందిన ఒక సమాచారాన్ని బట్టి పవన్ కళ్యాణ్ గారిపై కొన్ని వ్యాఖ్యలు చేశారు.
2. ఆ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తీవ్రంగా స్పందిస్తూ, ఆ ఆరోపణలను ఖండించారు.
3. అయితే, పవన్ కళ్యాణ్ గారి స్పందన రాగానే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు పెద్ద మనసుతో ముందుకు వచ్చారు.

"నాకు రాంగ్ సోర్స్ వల్ల ఆ సమాచారం వచ్చింది, వాస్తవాలు తెలుసుకున్నాక నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా" అని చాలా స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు.
నిజానికి, ఒక మేధావి వర్గానికి చెందిన వ్యక్తి స్వయంగా తప్పును అంగీకరించి వెనక్కి తగ్గినప్పుడే ఈ వివాదానికి అక్కడితో ఫుల్ స్టాప్ పడాలి. కానీ, ఆ తర్వాత జరిగిన పరిణామాలు రెండు రాష్ట్రాల మధ్య సోషల్ మీడియా యుద్ధానికి దారితీశాయి.

 ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి స్థాయిని మరువొచ్చా?

ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కేవలం ఒక ప్రాంతానికో, ఒక పార్టీకో పరిమితమైన వ్యక్తి కాదు. దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఒక గొప్ప పొలిటికల్ అనలిస్ట్. దశాబ్దాలుగా సమాజానికి విశ్లేషకుడిగా సేవలు అందిస్తున్న వ్యక్తి. నిరంతరం రాజకీయ విశ్లేషణలు చేసే క్రమంలో ఎవరికైనా కొన్నిసార్లు సమాచార లోపం వల్ల పొరపాట్లు జరగడం సహజం. అంతేకానీ, దాన్ని పట్టుకుని రాజకీయ నాయకులు, వారి క్యాడర్ అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు.
కానీ ఈ వివాదంలో జనసేన కార్యకర్తలు, నాయకులు ప్రొఫెసర్ గారిపై విపరీతమైన ఆన్‌లైన్ ట్రోలింగ్‌కు దిగడం అత్యంత విచారకరం. ఆయన్ను "పేటీఎం బ్యాచ్" అని, "వైసీపీ మనిషి" అని, "శాలువాలు అమ్ముకునే వ్యక్తి" అని ఇష్టం వచ్చినట్లు కించపరిచారు. అంతటితో ఆగకుండా, ప్రొఫెసర్ గారికి మద్దతుగా నిలిచిన తెలంగాణ మేధావులను, ఉద్యమకారులను సైతం ప్రెస్ మీట్లు పెట్టి బూతులు తిట్టడం ఏ రకమైన సంస్కృతి? బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న నాయకుడి అనుచరులు చేయాల్సిన పనేనా ఇది?

సమయానుకూల రాజకీయాలు - ప్రాక్టికల్ ఆలోచన

మరోవైపు, ఈ కలియుగ రాజకీయాల్లో ఎవ్వరూ 'స్వచ్ఛమైన హరిశ్చంద్రులు' కారు అనేది కూడా జగమెరిగిన సత్యం. ఇక్కడ శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. అంతా కాలానుగుణంగా సాగే వ్యూహాలే.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారిపై కొందరు వ్యక్తిగత దాడులు చేస్తూ.. ఆయన గతంలో పార్టీలు మార్చారని, మాటలు మార్చారని విమర్శిస్తున్నారు. కానీ ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే.. ఈ రోజుల్లో ఒకే పాత సిద్ధాంతాన్ని పట్టుకుని కూర్చుంటే రాజకీయాల్లో మనుగడ సాధ్యమా? అలా మొండిగా వెళ్లిన వాళ్ళు ఈరోజు రాజకీయంగా ఏ తీరానికి చేరారో మన కళ్ళముందే ఉంది.

కాలంతో పాటు మారుతూ, సమయాన్ని బట్టి వ్యూహాలు మార్చుకుని.. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏపీకి డిప్యూటీ సీఎం అయ్యారు. కనీసం ఆ పదవి ద్వారా ఆయన కొంతమందికైనా రాజకీయంగా, పాలనా పరంగా న్యాయం చేయగలుగుతున్నారు కదా? ఆ వాస్తవాన్ని గుర్తించాల్సింది పోయి, ఇంకా పాత వ్యక్తిగత విషయాలనే పట్టుకుని వేలాడటం ఎంతవరకు సమంజసం?

ఇరువర్గాలకూ ఒకటే విన్నపం..

రాజకీయ విమర్శలు ప్రజాస్వామ్యంలో సహజం, ఆహ్వానించదగ్గవి కూడా. కానీ అవి వ్యక్తిగత దూషణలుగా, ప్రాంతీయ విభేదాలుగా మారకూడదు. ఈ విషయంలో ఇరుపక్షాలూ కాస్త సంయమనం పాటించాల్సి ఉంది.

తెలంగాణ మేధావులకు, ఉద్యమకారులకు: 

ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు స్వయంగా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న తర్వాత కూడా, ఇంకా దీనిపై పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం వల్ల సాధించే మైలేజ్ ఏముంది? ఇది అనవసరపు వైషమ్యాలకు దారితీయదా?

జనసేన కార్యకర్తలకు, అభిమానులకు:
బాధ్యతాయుతమైన డిప్యూటీ సీఎం పదవిలో ఉన్న ఒక నాయకుడి అభిమానులుగా మీ బాధ్యత మరింత ఎక్కువ. మీ కౌంటర్లు కూడా అంతే హుందాగా, వైజ్ఞానికంగా ఉండాలి తప్ప.. ఒక సీనియర్ అనలిస్ట్‌ను, తెలంగాణ ఉద్యమకారులను తిట్ల పురాణాలతో దూషించి మీ స్థాయిని, మీ నాయకుడి స్థాయిని 

ముగింపు:
ఈ సోషల్ మీడియా యుద్ధాల వల్ల ఇరువర్గాలకూ వచ్చే లాభం ఏమీ లేదు సరికదా, ఇది సమాజానికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వదు. ఇప్పటికైనా ఇరువర్గాల వారు సమన్వయం పాటించి, ఒక చిన్న పొరపాటు వల్ల పెద్దదైన ఈ వివాదానికి ఇక్కడితో పులిస్టాప్ పెట్టాలని ఆశిద్దాం.