Monday, July 27, 2026

చట్టసభల్లో 'జై యువత': ధనబలాన్ని దాటి సామాన్య 21 ఏళ్ల యువతీ యువకులు అడుగుపెట్టగలడా?

 ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కులైన జనాభా కలిగిన దేశాల్లో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. మన దేశ జనాభాలో దాదాపు 65 శాతానికి పైగా ప్రజలు 35 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారే కాగా, 15 నుండి 29 ఏళ్ల మధ్య ఉన్న యువత శాతమే దాదాపు 27.5 శాతంగా ఉంది. ఇక మన తెలంగాణ రాష్ట్ర విషయానికి వస్తే, రాష్ట్ర జనాభాలో దాదాపు 47 శాతానికి పైగా యువత ఉంది. కానీ, ఈ జనాభా నిష్పత్తికి తగ్గట్లుగా చట్టసభల్లో యువత ప్రాతినిధ్యం ఉందా అంటే నిరాశే ఎదురవుతోంది. మన పార్లమెంట్‌లో లేదా గడిచిన రెండు మూడు తెలంగాణ అసెంబ్లీలలో పరిశీలిస్తే, 40 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ప్రజాప్రతినిధుల శాతం కేవలం 10 నుండి 12 శాతానికి మించడం లేదు. ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల్లో యువతకు కేటాయిస్తున్న టికెట్ల శాతం కూడా ఐదు నుండి ఎనిమిది శాతానికి మించకపోవడం గమనార్హం.


ఇలాంటి పరిణామాల మధ్య, తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇటీవల ఒక సందర్భంలో మాట్లాడుతూ విప్లవాత్మకమైన ప్రతిపాదనను లేవనెత్తారు. "21 సంవత్సరాలకే ఒక యువకుడు ఐఏఎస్, ఐపీఎస్ కాగా లేనిది.. చట్టసభల్లోకి అడుగుపెట్టి ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి ఎందుకు కాకూడదు?" అని ప్రశ్నిస్తూ, పోటీ చేసే వయోపరిమితిని 21 ఏళ్లకు తగ్గించేలా రాబోయే రోజుల్లో తీర్మానం చేస్తామని సంకేతాలిచ్చారు. కాంగ్రెస్ నినాదానికి 'జై జవాన్, జై కిసాన్' తో పాటు 'జై యువత' ను జోడిస్తూ పిలుపునివ్వడం ఒక ముఖ్యమంత్రిగా ఆయన ధీరత్వానికి, యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలనే సంకల్పానికి ప్రతీక. ఈ ఆలోచన వినడానికి ఎంతో అద్భుతంగా ఉన్నప్పటికీ, నేటి రాజకీయ క్షేత్రంలో వేళ్లూనుకున్న కఠినమైన సామాజిక, ఆర్థిక యథార్థాల నేపథ్యంలో దీనిని సమగ్రంగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది.

మొదటగా, 21 ఏళ్ల యువకుడు సివిల్ సర్వీసెస్ సాధించడానికి, ఎన్నికల్లో పోటీ చేయడానికి మధ్య కొండంత వ్యత్యాసం ఉంది. ఐఏఎస్ లేదా ఐపీఎస్ పరీక్ష అనేది పూర్తిగా సదరు అభ్యర్థి ప్రతిభ (Merit), కష్టం, మేధస్సుపై ఆధారపడి ఉంటుంది. రూపాయి ఖర్చు లేకుండా, స్వశక్తితో ఒక పేద లేదా బడుగు బలహీన వర్గానికి చెందిన యువకుడు ఆ అత్యున్నత స్థాయికి చేరుకోగలడు. కానీ, నేటి ఎన్నికల రాజకీయం ధనబలంతో ముడిపడి ఉంది. గ్రామ స్థాయిలో సర్పంచ్ లేదా వార్డ్ మెంబర్ పోటీకి రూ. 10 లక్షల నుండి 50 లక్షలు, పట్టణాల్లో కార్పొరేటర్ స్థాయికి రూ. 50 లక్షల నుండి కోటి రూపాయలు, ఇక ఎమ్మెల్యే ఎన్నికకు రూ. 50 నుండి 100 కోట్లు, ఎంపీగా పోటీ చేయడానికి రూ. 150 నుండి 200 కోట్లు ఖర్చు చేయాల్సిన దుస్థితి తెలుగు రాష్ట్రాల్లో ఉంది. ధనబలం, రియల్ ఎస్టేట్ రంగాలు, కాంట్రాక్టర్ల ప్రమేయం రాజ్యమేలుతున్న ప్రస్తుత వాతావరణంలో, 21 ఏళ్ల సాధారణ సామాన్య యువకుడు లేదా యువతి పోటీ చేయడం ఆచరణలో ఎంతవరకు సాధ్యమనేది ప్రాథమిక ప్రశ్న.

దీనిని మరింత లోతుగా పరిశీలిస్తే, కేవలం వయోపరిమితి తగ్గించినంత మాత్రాన గ్రామీణ, పేద, మధ్యతరగతి మరియు బీసీ, ఎస్సీ, ఎస్టీ వంటి బడుగు బలహీన వర్గాల యువతకు అవకాశాలు లభిస్తాయా అనేది మరో పెద్ద సవాలు. విద్యాభ్యాసం పూర్తయి, ఆర్థికంగా స్థిరపడని ఈ వయస్సులో రాజకీయాల్లోకి రావాలంటే విపరీతమైన వెన్నుదన్ను అవసరం. విద్యార్థి ఉద్యమాల నుంచో, ప్రజా పోరాటాల నుంచో వచ్చిన ఒకరిద్దరికి రాజకీయ పార్టీలు మినహాయింపుగా అవకాశమివ్వవచ్చేమో కానీ, మిగతా 99 శాతం సందర్భాల్లో ఈ చట్టం కేవలం రాజకీయ వారసులకు (Dynastic Politics) మరియు కోటీశ్వరుల పిల్లలకు మాత్రమే సునాయాసంగా చట్టసభల్లోకి అడుగుపెట్టే ఒక రహదారిగా మారే ప్రమాదం ఉంది.

కాబట్టి, అసెంబ్లీ సెషన్‌లో కేవలం వయోపరిమితి తగ్గింపుపై తీర్మానం చేయడమే కాకుండా, యువతకు నిజమైన ప్రజాస్వామ్య ఫలాలు దక్కేలా కొన్ని ప్రాథమిక సంస్కరణలపై సమగ్రమైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది. స్వీడన్, నార్వే వంటి ఐరోపా దేశాల మాదిరిగా ప్రతి రాజకీయ పార్టీ టికెట్ల కేటాయింపులో చట్టబద్ధంగా 'యువజన కోటా' నిబంధన తెచ్చేలా చర్చిం చాలి. అలాగే, ఇంద్రజిత్ గుప్తా కమిటీ (1998) సిఫార్సు చేసినట్లుగా ఎన్నికల వ్యయాన్ని నిబంధనలకు లోబడి ప్రభుత్వమే భరించే 'స్టేట్ ఫండింగ్ ఆఫ్ ఎలక్షన్స్' విధానంపై ఆలోచన చేయాలి. వీటితో పాటు, ఓటుకు నోటు ఇచ్చే సంస్కృతిని నిర్మూలించేలా అత్యంత కఠినమైన చట్టాలు తేవడం మరియు విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను, సామాజిక స్పృహను పెంపొందించడానికి విశ్వవిద్యాలయాల్లో నైతిక విలువలతో కూడిన క్యాంపస్ పొలిటిక్స్ (విద్యార్థి సంఘాల ఎన్నికలు) ను పునరుద్ధరించడం అత్యంత కీలకం.

ముగింపుగా చెబుతుంటే, 21 ఏళ్లకే యువత చట్టసభల్లోకి రావాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఎంతో స్వాగతించదగినది. అయితే, రాజకీయాల్లో పేరుకుపోయిన ఈ 'ధనబలాన్ని', 'వ్యాపారాత్మక ధోరణిని' ప్రక్షాళన చేయకుండా ఎన్ని చట్టాలు తెచ్చినా అవి ఉన్నత వర్గాలకు, రాజకీయ వారసులకే ఉపకరిస్తాయి. 'జై యువత' అనే నినాదం నిజమైన ప్రజాస్వామ్య సాధనంగా మారాలంటే, రూపాయి ఖర్చు లేకుండా సామాన్య పేద, బడుగు బలహీన వర్గాల యువకుడు చట్టసభల్లో ఎలా అడుగుపెట్టగలడో చూపించే సమగ్ర "ఎన్నికల సంస్కరణల"పై రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఫలవంతమైన చర్చ జరగాలి!


Saturday, July 25, 2026

సాధారణ జ్వరానికి (Ordinary/Viral Fever) మరియు శరీరంలోని కీలక అవయవాలలో (గుండె, కాలేయం, మూత్రపిండాలు వంటివి) ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే జ్వరానికి తేడా తెలుసుకోవడం చాలా ముఖ్యమైన విషయం.

 వైద్య పరిభాషలో మరియు క్లినికల్ విధానంలో దీనిని ఐడెంటిఫై చేయడానికి కొన్ని ముఖ్యమైన సంకేతాలు (Red Flag Symptoms) మరియు పరీక్షలు (Medical Markers) ఉంటాయి:

1. జ్వరం స్వభావం మరియు సమయం (Duration & Pattern)

 సాధారణ జ్వరం (Viral Fever): ఇది సాధారణంగా 3 నుండి 5 రోజుల్లో (గరిష్టంగా 7 రోజులు) తగ్గుముఖంపడుతుంది. దీనితో పాటు ఒళ్లు నొప్పులు, ముక్కు కారడం, తేలికపాటి గొంతు రాపిడి వంటి సాధారణ లక్షణాలు ఉంటాయి.

 అవయవ ఇన్ఫెక్షన్స్ (Organ-specific Infections): జ్వరం 5-7 రోజుల కంటే ఎక్కువ రోజులు కొనసాగినా, లేదా మందులు వేసుకున్నా జ్వరం తీవ్రత పెరిగినా (High Grade Fever) అది శరీరంలో ఎక్కడో లోపల ఇన్ఫెక్షన్ ఉందనడానికి మొదటి సంకేతం.

2. అవయవాన్ని బట్టి బయటపడే "ప్రత్యేక లక్షణాలు" (Organ-Specific Clues)

జ్వరం అనేది శరీరం ఇన్ఫెక్షన్‌తో పోరాడుతోందని చెప్పే ఒక సంకేతం మాత్రమే. కానీ ఇన్ఫెక్షన్ ఏ అవయవంలో ఉందో తెలుసుకోవడానికి ఆ అవయవానికి సంబంధించి బయటపడే ఈ క్రింది లక్షణాలను గమనించాలి:

1. గుండె ఇన్ఫెక్షన్ (Infective Endocarditis / Myocarditis):

 జ్వరంతో పాటు ఆయాసం (Shortness of breath) రావడం.

 గుండె దడ, తీవ్రమైన అలసట.

 కాళ్లలో లేదా పాదాల్లో వాపులు రావడం.

 గోళ్ల కింద లేదా చర్మంపై చిన్న చిన్న ఎర్రటి మచ్చలు/నొప్పులు రావడం.

2. కాలేయం / లివర్ ఇన్ఫెక్షన్ (Hepatitis / Liver Abscess):

 జ్వరంతో పాటు పసుపు రంగులోకి మారిన కళ్ళు/మూత్రం (జాయింటిస్/కామెర్లు).

 కడుపులో కుడివైపు ఎగువ భాగంలో (Right Upper Abdomen) తీవ్రమైన నొప్పి.

 వికారం, వాంతులు మరియు తీవ్రమైన ఆకలి మందగించడం.

3. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ (Pneumonia):

 జ్వరంతో పాటు పసిరి/రక్తంతో కూడిన తెమడ దగ్గు.

 గాలి పీల్చుకున్నప్పుడు లేదా దగ్గినప్పుడు ఛాతీలో పొడిచినట్లు నొప్పి.

4. మూత్రపిండాలు / యూరినరీ ఇన్ఫెక్షన్ (UTI / Pyelonephritis):

 జ్వరంతో పాటు వణుకు (Chills/Rigors).

 మూత్రంలో మంట, రక్తస్రావం లేదా మూత్రం దుర్వాసన రావడం.

 నడుము వెనుక భాగంలో లేదా పక్కటెముకల కింద తీవ్రమైన నొప్పి.

3. మెడికల్ టెర్మినాలజీలో "ఈజీ ఐడెంటిఫికేషన్" సీక్రెట్: బ్లడ్ టెస్టులు (Medical Markers)

వైద్యులు కేవలం లక్షణాల ఆధారంగానే కాకుండా, శరీరంలో ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉందో తెలుసుకోవడానికి కొన్ని ప్రాథమిక రక్త పరీక్షలను (Blood Tests) ఆధారంగా చేసుకుంటారు:

 CBP / CBC (Complete Blood Picture): ఇందులో WBC (తెల్ల రక్త కణాలు) సంఖ్య సాధారణం కంటే చాలా ఎక్కువగా ఉంటే శరీరంలో ఎక్కడో తీవ్రమైన బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉందని అర్థం.

 CRP (C-Reactive Protein) & ESR: ఇవి శరీరంలో ఎంత శాతంలో ఇన్ఫెక్షన్ లేదా వాపు (Inflammation) ఉందో చెప్పే ప్రాథమిక సూచీలు.

 అవయవాల ప్రత్యేక పరీక్షలు:

 లివర్ కోసం: LFT (Liver Function Test).

 కిడ్నీల కోసం: KFT / Serum Creatinine.

 గుండె కోసం: 2D ECHO Scan, ECG మరియు Troponin పరీక్షలు.

ముగింపు

సారాంశం ఏమిటంటే—ఏదైనా జ్వరం 5 రోజుల కంటే ఎక్కువ కాలం ఉన్నా, లేదా జ్వరంతో పాటు ఆయాసం, పచ్చకామెర్లు, తీవ్రమైన కడుపు నొప్పి, లేదా మూత్రంలో ఇబ్బంది వంటి అదనపు లక్షణాలు కనిపిస్తే, దానిని సాధారణ జ్వరంగా పరిగణించకూడదు. వెంటనే రక్త పరీక్షలు మరియు స్కాన్ల ద్వారా ఏ అవయవంలో ఇన్ఫెక్షన్ ఉందో కచ్చితంగా కనుగొనవచ్చు.


Friday, July 24, 2026

Proposed Capital Value-Based Property Tax: A Blessing for Governance or a Burden on Homeowners?

 The Greater Hyderabad Municipal Corporation’s (GHMC) draft bill propose to reform the property tax structure—shifting from the traditional Annual Rental Value (ARV) system to a Capital Value-based system—has triggered intense public debate. Under the proposed 'CURE' draft bill, property tax will no longer be determined by estimated rental yields, but rather as a direct percentage of the government-notified registration or market value (Capital Value) of the asset. The draft proposes a tax slab of 0.10% to 0.50% for residential properties and 0.20% to 2.00% for commercial properties. For instance, if a residential flat's government land value is assessed at ₹50 lakh and the tax rate is set at 0.20%, the annual property tax would be ₹10,000. Should the registration department revise the land value to ₹60 lakh the following year, the tax automatically rises to ₹12,000 without requiring any manual re-assessment.


On paper, the rationale behind this reform appears sound. It aims to boost civic revenue, eliminate manual discretion, curb corruption among field assessors, and bring transparency through an automated digital framework. In an era of rapid urbanization, local governments require substantial revenue streams to build world-class infrastructure, flyovers, drainage networks, and public amenities. Since municipal bodies rely on tax revenues to fund development, systemizing tax collection is understandable from a macroeconomic perspective. However, link property tax directly to soaring land market values risks placing an unbearable financial burden on ordinary middle-class homeowners—a reality that policymakers cannot afford to ignore.

For an average middle-class citizen, a home is not an investment asset or a real estate trading commodity meant for speculation; it is a symbol of social dignity and a lifetime achievement. In a metropolis like Hyderabad, acquiring a modest 100-square-yard plot or a apartment flat today costs anywhere between ₹80 lakh and ₹1 crore. Hardly any middle-class family has such capital upfront. An individual typically invests 20% of life savings as a down payment and finances the remaining 80% through a bank home loan spanning 25 to 30 years. Everyday sacrifices—from children’s education funds to basic family comforts—are made just to service these monthly Equated Monthly Installments (EMIs).

Technically speaking, during this 30-year period, the property does not even fully belong to the individual; it remains mortgaged to the lending institution. The buyer pays property registration fees and GST at the time of purchase, alongside a heavy 9% to 10% annual interest rate to the bank over decades. Under such financial strain, hiking property taxes under the guise of "increased market valuation" effectively amounts to taxing the citizen’s debt twice over. Paper appreciation in market value yields zero real-time cash flow to a resident who has no intention of selling their primary home. If the government insists on implementing a Capital Value-based system, it should logicially grant an exemption or apply a nominal, fixed tax rate to self-occupied primary residential properties (Self-Occupied Properties) until the homeowner completely liquidates their mortgage.

Furthermore, this tax hike will inevitably create a cascading effect on the city's vast tenant population. When property owners face steep tax increments, they naturally pass that burden on to tenants through higher monthly rents. For salaried professionals, students, and low-income families already grappling with inflation and rising utility costs, escalating rents will make living in the city increasingly unsustainable. To prevent arbitrary rent hikes, the state government should establish a unified digital rental portal. Mandatory registration of tenancy agreements through this platform, coupled with government-defined caps on annual rent increases based on local infrastructure indices, would protect tenants while creating an authenticated demographic database to curb illegal activities.

Finally, civic revenue collection must be tied to hyper-local accountability. If a specific residential locality generates ₹2 crore in property tax, a major chunk of those funds should be mandatorily re-invested into that very area to maintain roads, sanitation, and drainage infrastructure. Collecting heavy taxes from residents while diverting those funds elsewhere—leaving local civic issues unaddressed—erodes public trust in governance. While municipal revenue expansion is vital for city growth, it must not come at the cost of pushing middle-class families into financial distress. A balanced policy that protects self-occupied mortgaged homes, regulates rental escalations, and ensures transparent local fund utilization is the need of the hour.




– Thallapelly Surender Goud

Independent Researcher / Social Activist

Hyderabad

Email: surendergoud104@gmail.com

Sunday, June 28, 2026

హైదరాబాద్‌ను తీసేస్తే తెలంగాణ బీహార్ అవుతుందా? వాస్తవాలు - వక్రీకరణలు

 ఇటీవల సోషల్ మీడియా వేదికగా కొందరు మిత్రులు తెలంగాణ ఆర్థిక బలాన్ని తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తున్నారు. "తెలంగాణను పక్క రాష్ట్రం వాళ్లే వచ్చి అభివృద్ధి చేశారు, హైదరాబాద్ లేకపోతే తెలంగాణ ఆదాయం లేదు, అది బీహార్ కంటే వెనుకబడిపోతుంది" అనే విధంగా జీడీపీ (GSDP) నంబర్లను వాడుకుంటూ వితండవాదానికి తెరలేపారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న ఒక ఉద్యమకారుడిగా, ఆర్థికశాస్త్రం మరియు ఈ గడ్డ చరిత్రపై అవగాహన ఉన్న పౌరుడిగా.. ఆ అరకొర విశ్లేషణలోని లొసుగులను పక్కా డేటాతో విశ్లేషించి చారిత్రాత్మక నిజాలను మీ ముందుకు ఉంచుతున్నాను.


1. భౌగోళిక అనుకూలతలు - ఒకరిది సముద్రం, మరొకరిది హైదరాబాద్

ఏ రాష్ట్రానికైనా ప్రకృతి ఇచ్చిన ఒక భౌగోళిక అనుకూలత, ఒక గ్రోత్ ఇంజిన్ ఉంటుంది. మహారాష్ట్రకు ముంబై, కర్ణాటకకు బెంగళూరులా.. తెలంగాణకు హైదరాబాద్.


ఇదే వింత లాజిక్‌ను మనం రివర్స్ చేసి చూద్దాం—"రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్‌కు ప్రకృతి ప్రసాదించిన 974 కిలోమీటర్ల పొడవైన సుదీర్ఘ సముద్ర తీరాన్ని (Sea Coast), విశాఖపట్నం, కృష్ణపట్నం, గంగవరం, కాకినాడ లాంటి ఓడరేవులను (Ports) తీసి పక్కన పెడితే ఏపీ పరిస్థితి ఏంటి?" అని ఎవరైనా అడిగితే సమాధానం ఉందా? ఆ సముద్ర తీరం, పోర్టుల వల్లే కదా ఏపీకి దేశంలోనే నంబర్ 1 ఆక్వాకల్చర్ ఆదాయం, పోర్ట్ బేస్డ్ భారీ పరిశ్రమలు వస్తున్నాయి? వాటిని తీసేస్తే ఏపీ జీడీపీ కూడా ప్రభావితం అవుతుంది. కానీ ఎవరూ అలా మాట్లాడరు, ఎందుకంటే అది ఆ రాష్ట్ర భౌగోళిక బలం. అలాగే హైదరాబాద్ అనేది తెలంగాణ భౌగోళిక పరిధిలోని అంతర్భాగం. దాన్ని విడదీసి మాట్లాడటమే ఒక పెద్ద ఆర్థిక అజ్ఞానం.


2. "మేము వచ్చి అభివృద్ధి చేస్తేనే హైదరాబాద్ అయింది" అనేది అపోహ మాత్రమే!


1956లో ఉమ్మడి రాష్ట్రం ఏర్పడక ముందే, నిజాం హయాంలోనే తెలంగాణ ప్రాంతం పారిశ్రామికంగా, మౌలిక సదుపాయాల పరంగా ఆసియాలోనే ఎంతో ముందంజలో ఉంది. ఎవరో వచ్చి పుణ్యానికి కడితే హైదరాబాద్ గ్లోబల్ సిటీ అవ్వలేదు. దానికి శతాబ్దాల బలమైన పునాది ఉంది:

 నైజాం కాలం నాటి భారీ పరిశ్రమలు: ఉమ్మడి రాష్ట్రం కంటే ముందే ఆసియాలోనే అతిపెద్ద చక్కెర కర్మాగారం 'నిజాం షుగర్ ఫ్యాక్టరీ' (బోధన్), సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్స్, అల్విన్, ప్రాగా టూల్స్, సింగరేణి కాలరీస్, చార్మినార్ సిగరెట్ ఫ్యాక్టరీ, డీబీఆర్ మిల్స్ వంటి ఎన్నో దిగ్గజ పరిశ్రమలు తెలంగాణ సొంత భూముల్లో ఏర్పాటయ్యాయి.

 మౌలిక సదుపాయాల ల్యాండ్‌మార్క్స్: ఉస్మానియా యూనివర్సిటీ, నిజామియా అబ్జర్వేటరీ, ఉస్మానియా హాస్పిటల్, బేగంపేట ఎయిర్‌పోర్ట్, నిజాం స్టేట్ రైల్వేస్ (NSR) వంటి ప్రపంచ స్థాయి సంస్థలు 1950ల నాటికే ఇక్కడ వైభవంగా ఉన్నాయి.

హైదరాబాద్‌కు ఉన్న అద్భుతమైన వాతావరణం, భూకంపాలు రాని భౌగోళిక స్థిరత్వం, ఇక్కడి ప్రజల ఆదరణ, శాంతిభద్రతల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు ఇక్కడికి వచ్చారు. వ్యాపారాలు చేసి లాభాలు గడించారు తప్ప, ఎవరూ ఉచితంగా వచ్చి ఇక్కడ దానం చేయలేదు. ఇది పరస్పర ఆర్థిక ప్రయోజనం (Mutual Benefit) మాత్రమే.


3. జీడీపీ (GSDP) మాయాజాలం - తలసరి ఆదాయమే అసలు కింగ్!

సదరు సోషల్ మీడియా పోస్టుల్లో ఏపీ GSDP ₹18.30 లక్షల కోట్లు, తెలంగాణ GSDP ₹18.00 లక్షల కోట్లు అని చూపించి మురిసిపోయారు. కానీ ఇక్కడ "జనాభా (Population)" అనే ప్రాథమిక సూత్రాన్ని విస్మరించారు.

 ఆంధ్రప్రదేశ్ జనాభా: ~ 5 కోట్లకు పైగా.

 తెలంగాణ జనాభా: ~ 3.5 నుండి 3.8 కోట్లు.

దాదాపు సమానమైన జీడీపీ ఉండి.. జనాభాలో తెలంగాణ చాలా తక్కువ ఉంది. దీనివల్ల "తలసరి ఆదాయం" (Per Capita Income) లో తెలంగాణ భారతదేశంలోనే టాప్ 3 స్థానాల్లో నిలుస్తోంది. అంటే ఏపీతో పోలిస్తే తెలంగాణలోని ప్రతి పౌరుడి సగటు ఆర్థిక బలం, జీవన ప్రమాణాలు, కొనుగోలు శక్తి చాలా ఎక్కువ అనేది నగ్నసత్యం.


4. బీహార్‌తో పోలికా?


హైదరాబాద్ లేకపోతే తెలంగాణ మిగతా జిల్లాలు బీహార్ కంటే వేస్ట్ అని రాయడం వారి అజ్ఞానానికి పరాకాష్ట. ఒకసారి కాలిక్యులేటర్ తీసి ఈ సింపుల్ మ్యాథ్స్ చూడండి:

 బీహార్ లెక్క: 13 కోట్ల జనాభాకు ₹13 లక్షల కోట్ల జీడీపీ ఉంది. అంటే అక్కడ తలసరి ఆదాయం అత్యంత తక్కువగా ఉంది.

 తెలంగాణ (హైదరాబాద్ కాకుండా) లెక్క: హైదరాబాద్ మెట్రో ప్రాంతాన్ని మినహాయిస్తే మిగిలిన జిల్లాల జనాభా కేవలం 2.5 కోట్లు మాత్రమే. ఈ 2.5 కోట్ల జనాభా కలిపి సుమారు ₹7 లక్షల కోట్ల జీడీపీని ఉత్పత్తి చేస్తోంది.

13 కోట్ల మంది ₹13 లక్షల కోట్లు సాధించడం గొప్పా? లేక కేవలం 2.5 కోట్ల మంది ₹7 లక్షల కోట్లు సాధించడం గొప్పా? హైదరాబాద్ లేకపోయినా తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ (వ్యవసాయం, సింగరేణి బొగ్గు, పారిశ్రామిక క్లస్టర్లు) బీహార్ కంటే ఎన్నో రెట్లు అత్యంత సంపన్నమైనది మరియు శక్తివంతమైనది.






ముగింపు:

ఆర్థిక సూచీలను మనకు నచ్చినట్లు వాడుకుని, ఒక ప్రాంతాన్ని తక్కువ చేసి మాట్లాడటం వల్ల అజ్ఞానం బయటపడుతుంది తప్ప వాస్తవాలు మారవు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ తనకున్న సుదీర్ఘ సముద్ర తీరం, పోర్టులు, ఆక్వా, మాన్యుఫ్యాక్చరింగ్ (శ్రీసిటీ, కియా మోటార్స్) రంగాలతో తనదైన శైలిలో ఎదుగుతోంది. అదే సమయంలో తెలంగాణ తనకున్న శతాబ్దాల చరిత్ర కలిగిన గ్లోబల్ సిటీ హైదరాబాద్‌ను గ్రోత్ ఇంజిన్‌గా వాడుకుంటూనే, ఐటీ, సర్వీస్, రియల్ ఎస్టేట్ మరియు గ్రామీణ ఆర్థిక రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా దూసుకుపోతోంది. ఇప్పటికైనా ఇలాంటి సంకుచిత ప్రాంతీయ పోస్ట్‌లు మానేసి, ఫ్యాక్ట్స్ మాట్లాడటం నేర్చుకుంటే అందరికీ శ్రేయస్కరం!


Thursday, June 25, 2026

దేవుడు శక్తులిచ్చినా ఎందుకు ఓడిపోతున్నాం? నాస్తికులైనా నమ్మక తప్పని 'శివ-తత్వ' సైకాలజీ!

ఆత్మదర్శనం: శివయ్య ఇచ్చిన శక్తులు

అనగనగా భూలోకంలో ఒక గొప్ప శివభక్తుడు ఉండేవాడు. పరమశివుడంటే అతనికి అమితమైన భక్తి. ప్రతిరోజూ ఎంతో నిష్ఠతో స్వామిని పూజించేవాడు. శివనామ స్మరణ లేనిదే అతని రోజు గడిచేది కాదు.

అయితే, కాలక్రమేణా అతని జీవితంలో తీవ్రమైన కష్టాలు, వరుస ఇబ్బందులు ఎదురయ్యాయి. దాంతో అతను మానసికంగా కుమిలిపోతూ, మనశ్శాంతి కరువై తీవ్ర ఆవేదన చెందాడు. "దేవా! నాకు ప్రశాంతతను ప్రసాదించు" అని రోజూ వేడుకునేవాడు. అయినా మనసు స్థిమితపడలేదు. దాంతో ఆ భగవాన్ స్వరూపుడైన శివుడి కోసం క్రూరమైన, దుర్ఘటమైన అన్ని పుణ్యక్షేత్రాలకూ వెతుక్కుంటూ వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు.



చివరికి అత్యంత కఠినమైన హిమాలయాల పర్వత ప్రాంతానికి చేరుకుని, గడ్డకట్టే చలిని సైతం లెక్కచేయకుండా శివయ్య కోసం కఠోరంగా ప్రార్థించాడు. అతని నిష్కల్మషమైన భక్తికి మెచ్చి, పరమశివుడు సాక్షాత్కరించాడు.

శివయ్యను చూడగానే ఆ భక్తుడు తన్మయత్వంతో, "దేవా! నా భక్తికి మెచ్చి నువ్వు ప్రత్యక్షమవ్వడం నా జీవిత ధన్యత" అని మోకరిల్లాడు.

శివయ్య మందహాసం చేస్తూ, "భక్తా! నీ భక్తికి ప్రసన్నమయ్యాను. నీకు ఎలాంటి కోరికలు కావాలో కోరుకో!" అన్నాడు.

అప్పుడు ఆ భక్తుడు ఆవేదనతో, "అయ్యా! నేను ప్రతిరోజూ మిమ్మల్ని పూజిస్తున్నా నా జీవితంలో ప్రశాంతత లేదు, విజయాలు లేవు. ఎటు చూసినా కష్టాలే ఎదురవుతున్నాయి" అని తన బాధ చెప్పుకున్నాడు.

శివయ్య నవ్వుతూ... "నీకు నేను ఈ భూలోకానికి పంపించే అప్పుడే... ప్రశాంతంగా జీవించడానికి, విజయాలు పొందడానికి కావలసిన అన్ని శక్తులను నీలోనే నింపి పంపాను. మళ్ళీ ఇప్పుడు నన్ను అడుగుతున్నావేంటి భక్తా?" అన్నాడు.

భక్తుడు ఆశ్చర్యపోతూ... "అయ్యా! మరి అన్ని శక్తులు నాలోనే ఉంటే నాకు ఎందుకు ఈ కష్టాలు?" అని ప్రశ్నించాడు.

అప్పుడు శివయ్య ఎంతో ప్రశాంతంగా... "సరే భక్తా, నువ్వు కొన్ని రోజులుగా తీసుకున్న అత్యంత కీలకమైన నిర్ణయాలు, చేసిన పనులు ఎలాంటివో నాకు ఒక్కసారి వివరించు" అన్నాడు. భక్తుడు తను తీసుకున్న ముఖ్యాతి ముఖ్యమైన నిర్ణయాలన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటిగా శివయ్యకు వివరించాడు.

అదంతా విన్న శివయ్య, అతని వైపు నిశ్శబ్దంగా చూస్తూ... "భక్తా! ఇప్పుడు చెప్పు... నువ్వు తీసుకున్న ఆ నిర్ణయాలన్నీ కరెక్ట్ అని నువ్వు భావిస్తున్నావా?" అని అడిగాడు.

ఆ ప్రశ్నకు భక్తుడు ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయాడు. అతనిలో అంతర్మథనం మొదలైంది. కాసేపటి తర్వాత తలదించుకుని, "కాదయ్యా... నేను కొన్ని తెలుసో తెలియకో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాను. వాటి వల్లే నాకు ప్రశాంతత లేకుండా పోయింది" అని ఒప్పుకున్నాడు.

"అయితే ఇప్పుడు ఆ తప్పులను సరిచేయాలని నన్ను అడుగుతున్నావా?" అని శివయ్య అడగగా... "అవునయ్యా! ఆ తప్పులను సరిచేసి, నా జీవితంలో కొత్త శక్తులను ప్రసాదించు" అని వేడుకున్నాడు.

దానికి శివయ్య... "భక్తా! నేను కొత్త శక్తులనూ ప్రసాదించలేను. నిన్ను భూమి మీదికి పంపించే ముందే నీకు ఏవైతే శక్తులు ఇచ్చానో... వాటిని మాత్రమే నేను మళ్ళీ 'రియాక్టివేట్' (పునరుజ్జీవింపజేయడం) చేయగలుగుతాను. కానీ, భవిష్యత్తులో నువ్వు మళ్ళీ తప్పుడు నిర్ణయాలు తీసుకోావని నమ్మకం ఏంటి?" అని అడిగాడు.

భక్తుడు వెంటనే రెండు చేతులూ జోడించి, "లేదు శివయ్య! నేను మళ్ళీ అలాంటి తప్పులను అస్సలు చేయను. నా తప్పుల నుండి నేర్చుకున్నాను. ఇకపై సరైన నిర్ణయాలతోనే నా ప్రయాణాన్ని సాగిస్తాను" అని నిశ్చయంగా చెప్పాడు.

అతని మాటలకు సంతోషించిన పరమశివుడు... "సరే, ఇకపై నువ్వు చేసే పనులలో విజయాలు పొందుతావు. నీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది" అని ఆశీర్వదించి, అంతర్ధానమయ్యాడు. ఆ భక్తుడు సరికొత్త ఆత్మవిశ్వాసంతో తన ఇంటికి చేరుకుని, ఎంతో ప్రశాంతంగా తన జీవిత గమ్యం వైపు అడుగులు వేయడం ప్రారంభించాడు.

 కైలాసంలో పార్వతీ పరమేశ్వరుల సంభాషణ:

అక్కడ కైలాసంలో, ఇదంతా గమనిస్తున్న పార్వతీ దేవికి ఒక సందేహం వచ్చి, శివయ్యను ఇలా అడిగింది... "అయ్యా! నీ భక్తుడు కష్టాలు ఓర్చి నీ దగ్గరికి వస్తే... మీరు చాలా సింపుల్‌గా కేవలం రెండు మాటలు చెప్పారు. తనకి మళ్ళీ కొత్తగా శక్తులేవీ ఇవ్వలేదు కదా! మరి తనకి జీవితంలో విజయాలు ఎలా కలుగుతాయి స్వామీ?" అని అడిగింది.

అప్పుడు ఆ శివయ్య చిరునవ్వు నవ్వి, పార్వతీ దేవి వైపు చూస్తూ ఇలా సమాధానమిచ్చాడు...

"పార్వతీ! నేను నా భక్తుడికి భూమి మీదికి పంపేటప్పుడే అన్ని శక్తులనూ ఇచ్చి పంపాను. కానీ, తను తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల ఆ శక్తులన్నీ లోపల నిర్వీర్యమైపోయాయి. అందుకే నేను అతని తప్పులను అతనికి గుర్తుచేసి, ఆ తప్పులను మరొకసారి చేయకుండా ఉండేలా అతనిలో విచక్షణను మేల్కొలిపాను. ఆ విచక్షణే నేను నా భక్తుడికి ఇచ్చిన అసలైన ఔషధం. ఒకవేళ గనుక తను ఇప్పటినుంచైనా తను తీసుకునే నిర్ణయాలను ఆలోచనాత్మకంగా, పాజిటివ్ థింకింగ్ తో తీసుకుంటే... నిద్రపోయిన ఆ శక్తులన్నీ తిరిగి మేల్కొంటాయి.

**అయితే పార్వతీ! ఇక్కడ మానవులు గ్రహించాల్సిన ఒక ముఖ్యమైన పరమార్థం ఉంది...**

చాలామంది మనశ్శాంతి కోసం, విజయాల కోసం తమ లోపల ఉన్న శక్తులను గమనించకుండా, బయట ఎక్కడో వెతుకుతూ అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకుంటారు. అలా సమయం వృధా అయ్యే కొద్దీ... వయసు పైబడుతుంది, మానసిక ఒత్తిడిల కారణంగా ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది.

ఒకవేళ వయసు పైబడిన తర్వాత, ఆరోగ్యం పాడైపోయిన తర్వాత నేను ప్రత్యక్షమై ఆ శక్తులను 'రియాక్టివేట్' చేసినా కూడా... వాటిని తట్టుకుని, ఉపయోగించుకునే శారీరక, మానసిక స్థితిగతులు ఆ సమయంలో వారిలో ఉండవు. ఆరోగ్యం సహకరించనప్పుడు దేవుడు ఎన్ని శక్తులు ఇచ్చినా అవి నిరుపయోగమే అవుతాయి!

అందుకే... దేవుడు ప్రసాదించిన శక్తులను సమయం ఉన్నప్పుడే శ్రద్ధగా గ్రహించాలి. వయసు, ఆరోగ్యం బాగున్నప్పుడే తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా, ఒకవేళ పొరపాట్లు జరిగినా వెంటనే వాటిని సరిదిద్దుకుంటూ, పాజిటివ్ థింకింగ్‌తో జీవిత ప్రయాణంలో ముందుకు సాగాలి. అదే అసలైన విజయం!" అని వివరించాడు శివయ్య.

శివయ్య చెప్పిన ఆ అద్భుతమైన పరమార్థాన్ని విని పార్వతీ దేవి ఎంతో సంతోషించింది.

కథా నీతి (Moral of the Story):

మన విజయాలు, మానసిక ప్రశాంతతకు కావలసిన శక్తులను ఆ భగవాన్ స్వరూపుడు మనకు ఎప్పుడో ఇచ్చాడు. మన తప్పుడు నిర్ణయాలు ఆ శక్తులను నిర్వీర్యం చేస్తే... మన విచక్షణతో తీసుకునే సరైన నిర్ణయాలు ఆ శక్తులన్నింటినీ మళ్ళీ మేల్కొల్పుతాయి.

అయితే, ఆ ప్రశాంతత కోసం బయట ఎక్కడో వెతుకుతూ సమయాన్ని వృధా చేసుకోకూడదు. ఎందుకంటే, కాలం గడిచేకొద్దీ వయసు పైబడి, మానసిక ఒత్తిడి వల్ల ఆరోగ్యం క్షీణిస్తుంది. ఆ సమయంలో దేవుడు శక్తులను రియాక్టివేట్ చేసినా కూడా మన ఆరోగ్య స్థితిగతులు సహకరించకపోతే అవి నిరుపయోగమే అవుతాయి. కాబట్టి, లభించిన సమయంలోనే పాజిటివ్ థింకింగ్‌తో, తప్పుడు నిర్ణయాలకు తావివ్వకుండా, వివేకంతో ముందుకు సాగి విజయాన్ని అందుకోవడమే మానవ జీవిత పరమార్థం.

Regards 

Surender Thallapelly 

Friday, June 19, 2026

AP టూరిజం దూకుడు... తెలంగాణ అలర్ట్ అవ్వాల్సిన సమయం వచ్చిందా?

 AP టూరిజం దూకుడు... తెలంగాణ అలర్ట్ అవ్వాల్సిన సమయం వచ్చిందా?

పిల్లలకి వేసవి కాలం సెలవులు ముగుస్తుండటంతో, హాలిడేస్ ఎండింగ్‌ను కాస్త స్పెషల్‌గా ప్లాన్ చేద్దామని గత వీకెండ్ ఫ్యామిలీతో కలిసి ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల, చీరాల, రామాపురం బీచ్‌లను సందర్శించాను. ఇదివరకు ఇతర రాష్ట్రాల్లోని బీచ్‌లకు వెళ్లిన అనుభవంతో పోల్చి చూస్తే... ఇక్కడ జరుగుతున్న రీసెంట్ డెవలప్‌మెంట్ యాక్టివిటీస్ చూసి నిజంగా ఆశ్చర్యపోయాను!

పర్యాటకుల కోసం సరికొత్త రిసార్ట్స్, వైవిధ్యమైన ఫుడ్ స్టాల్స్, ఎంటర్టైనింగ్ గేమ్స్ అండ్ యాక్టివిటీస్‌తో బీచ్‌లను చాలా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. వీటికి తోడు అక్కడ లిక్కర్ షాప్స్‌/జోన్స్‌కు కూడా పర్మిషన్స్ ఇస్తున్నట్లు వస్తున్న వార్తలు నిజమైతే... రాబోయే రోజుల్లో ఇది టూరిజం రంగాన్నే మార్చేసే అవకాశం ఉంది.

గోవాకు గట్టి పోటీ... వైజాగ్ తరహాలో బాపట్ల, చీరాల!

ప్రస్తుతం గోవాలో జరుగుతున్న కొన్ని స్కామ్స్, మిస్-బిహేవియర్ల వల్ల తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్నారు. ఈ తరుణంలో చీరాల-రామాపురం బీచ్‌లు గోవాను తలదన్నే రేంజ్‌లో ఇంటర్నేషనల్ టూరిస్టులను సైతం అట్రాక్ట్ చేసేలా రెడీ అవుతున్నాయి.

పైగా హైదరాబాద్ నుండి ఈ బీచ్‌లకు డైరెక్ట్ కనెక్టివిటీ ఇచ్చే హైవే పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఆంధ్ర బోర్డర్ వరకు హైవే దాదాపు సిద్ధంగా ఉంది, మిగిలిన కనెక్టివిటీ కూడా పూర్తయితే... హైదరాబాద్ వాసులకు అతి తక్కువ సమయంలో చేరుకోగలిగే బెస్ట్ వీకెండ్ డెస్టినేషన్ ఇదే అవుతుంది.

📉 తెలంగాణ రెవెన్యూపై పడనున్న ప్రభావం?

ఈ డెవలప్‌మెంట్స్ గనుక సక్సెస్ ఫుల్ అయితే, దాని ప్రభావం తెలంగాణపై ఇండైరెక్ట్‌గా పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది:

 1. టూరిజం రెవెన్యూ:ఇప్పటికే తెలంగాణ నుండి భారీగా ప్రజలు ఏపీలోని పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నారు. ఇకపై ఈ బీచ్‌ల కోసం కూడా వీకెండ్స్ లో అక్కడికే క్యూ కట్టే అవకాశం ఉంది.

 2. లిక్కర్ రెవెన్యూ:ఏపీ బీచ్ టూరిజం పాలసీ వల్ల తెలంగాణ లిక్కర్ రెవెన్యూ కూడా కొంతమేర తగ్గే ప్రమాదం ఉంది.

🤝 గౌరవకారణమే... కానీ మన తెలంగాణ కూడా మారాలి!

పక్క రాష్ట్రం అభివృద్ధి చెందడం, అక్కడ లోకల్ గా ఉద్యోగ అవకాశాలు పెరగడం, అంతర్జాతీయంగా తెలుగు రాష్ట్రాల పేరు మార్మోగడం ఒక తెలుగువాడిగా మనందరికీ గర్వకారణమే. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ... ఇదే సమయంలో మన తెలంగాణ ప్రభుత్వం కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది!

మన దగ్గర అద్భుతమైన అడవి ప్రాంతాలు (Forest Tourism), హిస్టారికల్ ప్లేసెస్, రిజర్వాయర్లు ఉన్నాయి.

 * ఆంధ్రప్రదేశ్‌ తరహాలోనే మన దగ్గర కూడా టూరిజం హబ్‌లను ప్రణాళికాబద్ధంగా డెవలప్ చేయాలి.

 * ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ (ఉద్యోగ కల్పన) కోసం టూరిస్టులను ఆకర్షించేలా ఇక్కడ కూడా పాలసీలను సరళీకృతం చేయాలి.

 * మన ఆదాయం పక్క రాష్ట్రాలకు వెళ్లకుండా, మన తెలంగాణ టూరిజాన్ని గ్లోబల్ లెవెల్‌కు తీసుకెళ్లేలా ప్రభుత్వం ఆలోచనాత్మకమైన అడుగులు వేయాలని కోరుకుంటున్నాను.

మీరేమంటారు?

#AndhraPradeshTourism #ChiralaBeach #Bapatla #TelanganaTourism #TourismDevelopment #WeekendGateway #HyderabadToChirala #EconomicGrowth #TeluguState

Thursday, June 18, 2026

ఆలోచించాల్సిన సమయం.. విమర్శల వెనుక ఉన్న వ్యూహాన్ని గమనించండి!

ఈ మధ్య సోషల్ మీడియాలో మన కాంగ్రెస్ మిత్రులు కొందరు ప్రధాని నరేంద్ర మోడీ గారు టెలిప్రాంప్టర్లు చూసి చదువుతున్నారని, నిన్నటి G7 సదస్సులో చిట్టీలు చూసి మాట్లాడుతున్నారని తెగ ట్రోల్స్ చేస్తున్నారు. ఒక కాంగ్రెస్ భావజాలం ఉన్న వ్యక్తిగా, వ్యక్తిగతంగా బీజేపీ ఐడియాలజీకి నేను దూరంగా ఉన్నప్పటికీ.. మన వాళ్లు చేస్తున్న ఈ తరహా విమర్శలు చూస్తుంటే కొంత బాధగా, ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఇలాంటి అనవసరమైన అంశాలను హైలైట్ చేయడం వల్ల మన పార్టీకి వచ్చే మైలేజ్ ఏంటి? ఒక్కసారి ప్రాక్టికల్ గా ఆలోచిద్దాం.

1. చూసి చదవడం కాదు.. ప్రజల్లోకి ఎలా వెళ్తుందనేదే ముఖ్యం!

మోడీ గారు గత 12 ఏళ్లుగా ఒక పక్కా వ్యూహంతో (Strategic View) ముందుకు వెళ్తున్నారు. ఆయన టెలిప్రాంప్టర్ వాడినా, చిట్టీలు చూసినా.. ఆ ప్రసంగంలో ప్రజలను ఎలా ఆకట్టుకోవాలి, ఏ పాయింట్స్ మాట్లాడాలి, దేశ విదేశాల్లో భారత్ ఇమేజ్ ని ఎలా ప్రొజెక్ట్ చేయాలి అనే అంశాలపై వారి టీమ్ తీవ్రమైన రీసెర్చ్ చేస్తుంది. ఒక లీడర్ ఎలా మాట్లాడుతున్నాడు అనేదానికంటే, ఆ మాటలు ప్రజలను ఏ మేరకు ప్రభావితం (Influence) చేస్తున్నాయనేది ముఖ్యం. అందువల్లే విదేశాల్లో కూడా వారికి ఆ స్థాయి అట్రాక్షన్ దక్కుతోంది.

2. రాహుల్ గాంధీ గారు ఎక్కడ వెనుకబడుతున్నారు?

మన నాయకుడు రాహుల్ గాంధీ గారు చాలా నిజాయితీ గల వ్యక్తి. ఏ ప్రసంగానికైనా తనే స్వయంగా రీసెర్చ్ ఓరియెంటెడ్ గా ప్రిపేర్ అవుతారు, మనసులో ఏది ఉంటే అది ముక్కుసూటిగా మాట్లాడుతారు. కానీ, దురదృష్టవశాత్తూ ప్రజల నుంచి దక్కాల్సినంత ఆదరణ, నమ్మకం ఆయనకు ఎందుకు లభించడం లేదు? మనం ఎక్కడ వెనుకబడుతున్నామో ఆత్మపరిశీలన చేసుకోవాలి.

3. డైరెక్ట్ స్పీచ్ ల వల్ల వచ్చే నష్టాలు:


కొన్నిసార్లు ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా డైరెక్ట్ గా మాట్లాడటం వల్ల, భావోద్వేగంలో ఒక్క చిన్న మాట తప్పుగా దొర్లినా.. దానిని అపోజిషన్ వాళ్లు అస్త్రంగా మార్చుకుని, మొత్తం వ్యవస్థకే డ్యామేజ్ తెచ్చే ప్రమాదం ఉంటుంది. అది మనం చాలాసార్లు చూశాం. పొలిటికల్ కమ్యూనికేషన్ లో ప్రతి మాట ఒక తూటా లాంటిది, అది పక్కాగా ప్లాన్ చేసి వదలాలి.

4. శత్రువు వ్యూహాన్ని కాపీ కొట్టడంలో తప్పులేదు!

భాషపై పట్టు లేకపోయినా, స్క్రిప్ట్ చూసి చదివినా.. వాళ్లు ప్రజల్లో ఒక గట్టి పటిష్టతను, కనెక్టివిటీని బిల్డ్ చేసుకోగలుగుతున్నారు. అలాంటప్పుడు వాళ్లు అనుసరిస్తున్న ఆ 'సక్సెస్ ఫుల్ స్ట్రాటజీ'ని మనమెందుకు అనుసరించకూడదు? మన లీడర్ల ప్రసంగాలను కూడా అంతే పక్కాగా, వ్యూహాత్మకంగా ఎందుకు డిజైన్ చేయకూడదు?

ముగింపు:


చిట్టీలు పట్టుకున్నారని, హిందీలో చూసి చదివారని సోషల్ మీడియాలో మోడీ గారిని క్రిటిసైజ్ చేయడం వల్ల ఆయన వ్యక్తిగతంగా ఇంకా ఎదుగుతాడు తప్ప, మనకు వచ్చే లాభం శూన్యం. ఇలాంటి సిల్లీ ట్రోల్స్ ఆపి.. ప్రత్యర్థి బలాన్ని గుర్తించి, మన బలహీనతలను సరిదిద్దుకుని, క్షేత్రస్థాయిలో ప్రజలకు మరింత దగ్గరయ్యే వ్యూహాలపై మన కాంగ్రెస్ నాయకత్వం దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను.


ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.🙏


#PoliticalStrategy #Congress #Introspection #RahulGandhi #NarendraModi #IndianPolitics #G7