ఒక్కరోజు కాదు .. నెలరోజులు అస్సలు కాదు నాలుగు వందల సంవత్సరాల చరిత్ర పోరుగల్లుగా ,కాకతీయుల కంచుకోటగా పేరుగాంచిన వరంగల్ జిల్లాది ,ఒకనాడు సొంత విమానాశ్రయంతో విదేశాలతో సత్సంబందాలు నేర్పిన ఇలాక ఇది వ్యవసాయానికి ,సేద్యానికి చెరువులు తవ్వుకొనే నాగరికత నేర్పిన రామప్ప ,పాకాల చెరువులతో ప్రజల కడుపు నింపిన నేల రాచరికం అంతమెందింది భారతదేశంలో అంతర్బాగామయింది .కానీ రెండు వందల సంవత్సరాల చరిత్రగల హైదరాబాద్ కన్నా వెనుక బాటు తనానికి గురయ్యింది .పోరుకు ఎప్పుడయినా వరంగల్ సై అంటది గని ,తెలంగాణ పోరాటంలోనూ ,విద్యార్ది ఉద్యమాలలోనూ కీలక భూమిక వహించిన., అబివృద్దికెందుకో ఆమడదూరంలో నిలుచుంది ఈ జిల్లా. గత చరిత్రను తమ చరిత్రగా చెప్పుకునే నాయకులకు తెలంగాణలో కొదువేంలేదు అయినా . ఆ హక్కు తెలంగాణ పౌరులందరికీ ఉంది. కానీ వీరు చేసింది తెలంగాణాలో వరంగల్ జిల్లా చరిత్రకు సోబుగులు అద్దేపనే , తప్ప ఒక్క రోజులో చరిత్ర మారకపోవచ్చు,నెలరోజుల్లో చరిత్రను మార్చకపోవచ్చు కానీ, ఎన్నిరోజులు పడుతుంది ఈ దుస్థితి మారడానికి .ఈ దుస్తితిని మార్చడానికి పార్లమెంట్లో బిల్లుపెట్టి , అందరిని ఒప్పించి, మెప్పించి తెలంగాణ నూతన రాష్ట్రాన్ని ఇచ్చింది మేమే - తెచ్చింది మేమే అని కాంగ్రెస్ నాయకులు మళ్ళ వతన్ దార్లు కావాలని ఉవ్విళ్ళురితే, ..గెలుస్తే కేంద్రమంత్రి పదవి ఇస్తాం. అని భా.జా.పా. వరంగల్ ప్రజలకు ఎరవేస్తుంది, పవర్ మాది పట్టం కట్టండిని తెరాస , దేశంలో అవినీతి అంతంతోనే అబివృద్ది సాధ్యమని ఆప్, కొన్ని సామజిక వర్గాల ఓటర్లను రాబట్టుకొని సీటులో పాగా వేయాలనే వ్యూహంలో వై.సి. పి. ఇప్పుడు తాము తోక పార్టీలుకాదు, అస్సలు పార్టీలని వామపక్షాలు, జనాల మెప్పుకోసం జనసేన పోటిలో ఉంటుందా? తాము గెలిస్తే ఏదో చేస్తాం అని ప్రచారంలో స్వతంత్ర అభ్యర్ధులు ,ఓట్లు చిల్చేఎత్తుగడలో కొన్ని పార్టీలు , సీటు తమదే కావాలని గస్తీగా ప్రధాన పార్టీలు రంగంలోకి దిగి ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు తలామునకలయ్యి ఓటర్ల ముందు ప్రాదేయపడుతున్నారు, మరి ఓటర్ కు చుక్క-ముక్క -నోటుతో గాలం వేయడం కొత్త సంస్కృతి మేమీకాదు. ఎన్నికలకమీషన్ ఎంత పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించాలని భావించినా , కేసుల బైండోవర్లను బేఖాతర్ చేసి పాపం పందెం కోళ్ళలాగ బలయ్యేవారు లేకపోలేదు. మొత్తానికి బైపోల్స్ నోటిఫికేషన్ తో జిల్లో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కించి. అన్ని పార్టీలు ఇప్పుడురంది పడ్తుండ్రు. అన్ని ప్రధాన పార్టీలు సర్వేలతో తాము ముందంజలో ఉన్నామని చెబుతున్నా ఏపార్టీకయినా గెలుపు అంత సులువు కాదని చెప్పెది జనంమాట.నూతన రాష్ట్రము జనానికి ఎన్నో ఆశలు. ప్రభుత్వం ఎన్నో పతకాలను ప్రకటించిన , జనసామాన్యంలోకి వెళ్ళలేకపోవడం, కొంతమందికే ఆసరా పెన్షన్లు , డబల్ బెడ్ రూమ్లు వంటి పథకాలు వర్తింపజేయడం ,ఇంటికో ఉద్యోగం, లక్ష ఉద్యోగాలు , ఉచితంగా,కే.జి నుండి పి.జి వరకు విద్య.శిలాఫలకాలు దాటని ప్రభుత్వ అబివృద్ది పథకాలుని ప్రతిపక్షాలు , ప్రతిపక్షాలకు, ఇవి ప్రధాన వాక్భాణాలు కానున్నాయి . ప్రదానంగా వ్యవసాయ ఆర్దిక వ్యవస్థ, మధ్యతరగతి జీవనం ఎక్కువగా కన్పించే జిల్లలో రైతు ఆత్మహత్యల కోపం ప్రభుత్వం పై ప్రజలకు చల్లారనేలేదు ఉసురుమంటున్న రైతుకుటుంబాలు ఎవరి వైపు నిలుస్తాయి. గతంలో ప్రజా సంఘాల మద్దతుతో గెలిచినా తెరాస నుండి ప్రజాసంఘాలన్ని దూరమై వామపక్షలుకు దగ్గరవడం వల్ల ఓట్లు చీలనున్నాయా ? అది ఎవరికీ బలం చేకుర్చనున్నది. గ్రామాలలో వైద్యం అందించే ఆశావర్కర్లు ప్రభుత్వం పై అసంతృప్తితో ఉండగా, ఆ బంతిని కేంద్ర ప్రభుత్వం కోర్ట్ లోకి పంపి తప్పించుకోజుస్తున్నది అధికార పక్షం .అయిన వీరి ఆగ్రహం ఎన్నికలలో తధ్యం. ఎన్నివిమర్శలు విన్పించినా వరంగల్ మొదటినుండి తెలంగాణ ఉద్యమానికి పునాధి కాబట్టి విజయం తమదే అనే ధీమా అధికార పార్టీలో ఉండగా, అంత సులువుకాదు గెలుపు అని ప్రతిపక్షాలు ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ఇప్పుడు సెంటిమెంట్ ఆయింట్ మెంట్ కాబోదు.
తాళ్ళపెల్లి
సురేందర్
( M.Tech )
విద్యార్ధి నాయకుడు
జె .న్ .టి .యు హైదరాబాద్ -తెలంగాణ స్టూడెంట్ జాక్
No comments:
Post a Comment