AP టూరిజం దూకుడు... తెలంగాణ అలర్ట్ అవ్వాల్సిన సమయం వచ్చిందా?
పిల్లలకి వేసవి కాలం సెలవులు ముగుస్తుండటంతో, హాలిడేస్ ఎండింగ్‌ను కాస్త స్పెషల్‌గా ప్లాన్ చేద్దామని గత వీకెండ్ ఫ్యామిలీతో కలిసి ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల, చీరాల, రామాపురం బీచ్‌లను సందర్శించాను. ఇదివరకు ఇతర రాష్ట్రాల్లోని బీచ్‌లకు వెళ్లిన అనుభవంతో పోల్చి చూస్తే... ఇక్కడ జరుగుతున్న రీసెంట్ డెవలప్‌మెంట్ యాక్టివిటీస్ చూసి నిజంగా ఆశ్చర్యపోయాను!
పర్యాటకుల కోసం సరికొత్త రిసార్ట్స్, వైవిధ్యమైన ఫుడ్ స్టాల్స్, ఎంటర్టైనింగ్ గేమ్స్ అండ్ యాక్టివిటీస్‌తో బీచ్‌లను చాలా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. వీటికి తోడు అక్కడ లిక్కర్ షాప్స్/జోన్స్‌కు కూడా పర్మిషన్స్ ఇస్తున్నట్లు వస్తున్న వార్తలు నిజమైతే... రాబోయే రోజుల్లో ఇది టూరిజం రంగాన్నే మార్చేసే అవకాశం ఉంది.
గోవాకు గట్టి పోటీ... వైజాగ్ తరహాలో బాపట్ల, చీరాల!
ప్రస్తుతం గోవాలో జరుగుతున్న కొన్ని స్కామ్స్, మిస్-బిహేవియర్ల వల్ల తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్నారు. ఈ తరుణంలో చీరాల-రామాపురం బీచ్‌లు గోవాను తలదన్నే రేంజ్‌లో ఇంటర్నేషనల్ టూరిస్టులను సైతం అట్రాక్ట్ చేసేలా రెడీ అవుతున్నాయి.
పైగా హైదరాబాద్ నుండి ఈ బీచ్‌లకు డైరెక్ట్ కనెక్టివిటీ ఇచ్చే హైవే పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఆంధ్ర బోర్డర్ వరకు హైవే దాదాపు సిద్ధంగా ఉంది, మిగిలిన కనెక్టివిటీ కూడా పూర్తయితే... హైదరాబాద్ వాసులకు అతి తక్కువ సమయంలో చేరుకోగలిగే బెస్ట్ వీకెండ్ డెస్టినేషన్ ఇదే అవుతుంది.
📉 తెలంగాణ రెవెన్యూపై పడనున్న ప్రభావం?
ఈ డెవలప్‌మెంట్స్ గనుక సక్సెస్ ఫుల్ అయితే, దాని ప్రభావం తెలంగాణపై ఇండైరెక్ట్‌గా పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది:
1. టూరిజం రెవెన్యూ:ఇప్పటికే తెలంగాణ నుండి భారీగా ప్రజలు ఏపీలోని పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నారు. ఇకపై ఈ బీచ్‌ల కోసం కూడా వీకెండ్స్ లో అక్కడికే క్యూ కట్టే అవకాశం ఉంది.
2. లిక్కర్ రెవెన్యూ:ఏపీ బీచ్ టూరిజం పాలసీ వల్ల తెలంగాణ లిక్కర్ రెవెన్యూ కూడా కొంతమేర తగ్గే ప్రమాదం ఉంది.
🤝 గౌరవకారణమే... కానీ మన తెలంగాణ కూడా మారాలి!
పక్క రాష్ట్రం అభివృద్ధి చెందడం, అక్కడ లోకల్ గా ఉద్యోగ అవకాశాలు పెరగడం, అంతర్జాతీయంగా తెలుగు రాష్ట్రాల పేరు మార్మోగడం ఒక తెలుగువాడిగా మనందరికీ గర్వకారణమే. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ... ఇదే సమయంలో మన తెలంగాణ ప్రభుత్వం కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది!
మన దగ్గర అద్భుతమైన అడవి ప్రాంతాలు (Forest Tourism), హిస్టారికల్ ప్లేసెస్, రిజర్వాయర్లు ఉన్నాయి.
* ఆంధ్రప్రదేశ్ తరహాలోనే మన దగ్గర కూడా టూరిజం హబ్‌లను ప్రణాళికాబద్ధంగా డెవలప్ చేయాలి.
* ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ (ఉద్యోగ కల్పన) కోసం టూరిస్టులను ఆకర్షించేలా ఇక్కడ కూడా పాలసీలను సరళీకృతం చేయాలి.
* మన ఆదాయం పక్క రాష్ట్రాలకు వెళ్లకుండా, మన తెలంగాణ టూరిజాన్ని గ్లోబల్ లెవెల్‌కు తీసుకెళ్లేలా ప్రభుత్వం ఆలోచనాత్మకమైన అడుగులు వేయాలని కోరుకుంటున్నాను.
మీరేమంటారు?
#AndhraPradeshTourism #ChiralaBeach #Bapatla #TelanganaTourism #TourismDevelopment #WeekendGateway #HyderabadToChirala #EconomicGrowth #TeluguState

No comments:
Post a Comment