✊ తెలంగాణ అమరవీరులకు, ఉద్యమకారులకు వందనం.. నాటి జ్ఞాపకాలతో మా ప్రయాణం! ✊
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా, నాటి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన అమరవీరుల త్యాగాలను మరియు తమ విలువైన సమయాన్ని, కష్టాన్ని ధారబోసిన ఉద్యమకారుల స్ఫూర్తిని గుండెల్లో నింపుకుంటూ... ఆనాడు #JNTUHJAC విద్యార్థి నాయకుడిగా ఉద్యమ బాటలో సాగిన ఆనాటి ప్రయాణాన్ని, ఆ పోరాట స్ఫూర్తిని ఈరోజు మరొక్కసారి గుర్తుచేసుకుంటున్నాను.
నాడు రాజకీయ జేఏసీ పిలుపునిచ్చిన ప్రతి ఉద్యమ కార్యక్రమంలోనూ మేము విద్యార్థి నాయకులుగా ముందుండి, ఎన్నో ఆశలతో, ఆకాంక్షలతో, మా విలువైన సమయాన్ని, జీవితాన్ని సైతం వదులుకొని ఆనాడు ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాము. పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగాము, అరెస్టులు అయ్యాము, పోలీస్ లాఠీ దెబ్బలు కూడా తిన్నాము.
గత పది సంవత్సరాల TRS/BRS ప్రభుత్వ హయాంలో కొంతమంది ఉద్యమకారులకు, అమరుల కుటుంబాలకు న్యాయం జరిగినప్పటికీ... ఒక ఉద్యమ పార్టీగా ఉద్యమకారులందరికీ పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోయిందనేది జగమెరిగిన సత్యం.
ఇక ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం విషయానికి వస్తే... తాము అధికారంలోకి వస్తే ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేస్తామని మేనిఫెస్టోలో హామీలు ఇచ్చారు. దానికి అనుగుణంగానే రీసెంట్‌గా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఉద్యమకారులను గుర్తిస్తాం, న్యాయం చేస్తాం అని చెప్తున్న ఈ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ కాంగ్రెస్ పాలనలోనైనా ఉద్యమకారులందరికీ సముచిత స్థానం, న్యాయం దక్కుతుందని ఆశిస్తూ... వారికి పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను.
పోరాటం నేర్పిన పాఠం.. యువతకు నా చిన్న సందేశం! 🙏
ఒక స్టూడెంట్ లీడర్‌గా ఆ రోజుల్లో మేము చేసిన పోరాటం, పడిన కష్టాలు, ఆ తర్వాత నా వ్యక్తిగత జీవితంలో ఎదురైన తీవ్రమైన స్ట్రగుల్స్ మరియు నా లైఫ్‌లో తెచ్చిన మార్పులను నేను ఇప్పటికీ మర్చిపోలేను. ఉద్యమ నేపథ్యం వల్ల ఆ రోజుల్లో అవకాశాలు రాక ఎన్నో ఇబ్బందులు పడ్డాను. కానీ, వాటన్నింటినీ దాటుకుని, నా తప్పులను నేను రియలైజ్ అయ్యి, మళ్ళీ కష్టపడి ఈరోజు ఒక చిన్న ఉద్యోగంలో నా జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాను.
నా ఈ వ్యక్తిగత అనుభవం నుండి ఈనాటి **యువతకు నేను ఇచ్చే ఒకే ఒక స్ట్రాంగ్ మెసేజ్:**
మీరు ఏ రాజకీయ పార్టీల వైపు వెళ్లినా, ఏ ఉద్యమాల్లో అడుగులు వేసినా... ఒకటికి వందసార్లు ఆచి తూచి అడుగులు వేయండి. ఎమోషన్స్ లో కొట్టుకుపోయి మీ జీవితాలను, మీ నమ్ముకున్న కుటుంబాల భవిష్యత్తును అడ్డుపెట్టకండి. ఏదేమైనా సరే... ఫస్ట్ మన జీవితం, మన కుటుంబం... ఆ తర్వాతే ఏదైనా!
తెలంగాణ కోసం పోరాడిన ప్రతి ఒక్కరికీ న్యాయం జరగాలని ఆశిస్తూ...
జై తెలంగాణ! 💐
Regard’s
Surender Thallapelly






No comments:
Post a Comment